AP Politics : చంద్రబాబుకు నాగబాబు కౌంటర్.. రియాక్షన్ తప్పదంటూ ట్వీట్..
ఏపీలో రాజకీయం (AP Politics) రోజుకో రకంగా మారిపోతోంది. నిన్నటి వరకూ వైసీపీ వర్సెస్ (YCP Vs TDP) టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి (AP Politics Alliance) అన్నట్టుగా ఏపీలో సీన్ ఉండేది. కానీ నిన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న నిర్ణయంతో అంచనాలు మారిపోయాయి. టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అలాంటప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా రెండు పార్టీలు కలిసే తీసుకోవాలి.

Nagababu's counter to Chandrababu.. tweet that the reaction is wrong..
ఏపీలో రాజకీయం (AP Politics) రోజుకో రకంగా మారిపోతోంది. నిన్నటి వరకూ వైసీపీ వర్సెస్ (YCP Vs TDP) టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి (AP Politics Alliance) అన్నట్టుగా ఏపీలో సీన్ ఉండేది. కానీ నిన్న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న నిర్ణయంతో అంచనాలు మారిపోయాయి. టీడీపీ-జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అలాంటప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా రెండు పార్టీలు కలిసే తీసుకోవాలి. కానీ టీడీపీ మాత్రం జనసేనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రెండు సీట్లు ప్రకటించింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ టీడీపీ మీద చాలా వ్యూహాత్మంకా విమర్శలు చేశారు. ఇది పొత్తు ధర్మం కాదని.. వచ్చే మీటింగ్స్‌లో దీని గురించి మాట్లాడుకుంటామని చెప్తూనే.. టీడీపీ యాక్షన్‌కు రియాక్షన్‌గా తాను కూడా రెండు సీట్లు ప్రకటించాడు. అయితే ఇక్కడ పవన్ చంద్రబాబును గానీ టీడీపీని గానీ నేరుగా విమర్శించలేదు.
టీడీపీతో పొత్తు ఉంటుందిన బలంగా మరోసారి చెప్పాడు. కానీ కొద్దిసేపటికే పవన్ చిన్నన్నయ్య, జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ మరో చర్చకు దారి తీసింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే తనకు న్యూటన్ ఫార్ములా గుర్తుకు వస్తుందని చెప్పారు. ప్రతీ యాక్షన్‌కు సేమ్, అపోజిట్ రియాక్షన్ ఉండి తీరుతుందంటూ టీడీపీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఈ విషయంలో ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సీట్ల పంపకాల విషయంలో తాము ఎక్కడా తగ్గేది లేదు అని చెప్పేందుకే నాగబాబు ఈ ట్వీట్ చేశాడు అనేది క్లియర్. కానీ ఎన్నికలకు ఇంకా ఎక్కువ టైం లేదు. ప్రస్తుతం సిచ్యువేషన్ కూడా ఎవరికీ పాజిటివ్‌గా లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు ఎంత బలపడితే అంత మంచిది. కానీ టీడీపీ-జనసేన మధ్య మాత్రం పరిస్థితి అలా లేదు. వీళ్ల మధ్య గ్యాప్ తెచ్చేందుకు చాలా మంది అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి టైంలో అంతా కలిసి ఉండాలి కానీ.. ఇలాంటి నిర్ణయాలతో శతృవులకు అవకాశం ఇస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకు. రెండు సీట్ల విషయంలో టీడీపీ-జనసేన మధ్య మొదలైన ఈ యుద్ధం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి.