NAGARJUNA SAGAR: నీళ్ళ గొడవ.. సాగర్ నీళ్ళు తిప్పేసుకున్న ఏపీ.. ఎన్నికల టైమ్‌లో తొందరెందుకు..?
రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత సాగర్ కుడికాలువ ద్వారా నీటిని ఏపీకి తిప్పుకున్నారు అక్కడి ఇంజినీరింగ్ అధికారులు. పోలింగ్ టైమ్ లో అకస్మాత్తుగా ఇప్పుడు నీళ్ళ పంచాయతీ ఎందుకు వచ్చింది..? తెలంగాణలో కేసీఆర్ ప్రోద్భలం ఉందా.. ఏపీలో జగన్ ఓట్ల కోసం రాజకీయం చేశారా..?
NAGARJUNA SAGAR: కొన్ని గంటల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న టైమ్ లో నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గర అటెన్షన్ మొదలైంది. బుధవారం అర్థరాత్రి వేళ 500 మందికి పైగా పోలీసులు డ్యామ్ మీదకు చేరుకోవడం.. నాగార్జున సాగర్ డ్యామ్ కి మద్యలో కంచె ఏర్పాటు చేయడం.. ఇటు TSSF సిబ్బందిని వారిని అడ్డుకోవడంతో.. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రికత్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత సాగర్ కుడికాలువ ద్వారా నీటిని ఏపీకి తిప్పుకున్నారు అక్కడి ఇంజినీరింగ్ అధికారులు. పోలింగ్ టైమ్ లో అకస్మాత్తుగా ఇప్పుడు నీళ్ళ పంచాయతీ ఎందుకు వచ్చింది..? తెలంగాణలో కేసీఆర్ ప్రోద్భలం ఉందా.. ఏపీలో జగన్ ఓట్ల కోసం రాజకీయం చేశారా..? ఏపీ, తెలంగాణ మధ్య మరో టెన్షన్ క్రియేట్ అయింది.
BANDI SANJAY: నోట్ల కట్టలు పంచలేదని ప్రమాణం చేద్దామా.. గంగులకు బండి సవాల్..
నాగార్జున సాగర్ జలాలను తమ వైపు మళ్ళించుకోడానికి అర్థరాత్రి ఉన్నట్టుండి డ్యామ్ పై ఏపీ పోలీసులు మొహరించారు. 500 మందికి పైగా పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లలో సగం మావే అంటూ.. అంటే 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. దీనిని TSSPF సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య అర్థరాత్రి స్వల్ప ఘర్షణ వాతావరణం తలెత్తింది. కంచె ఎత్తేయాలని మిర్యాల గూడ డీఎస్పీ చెప్పినా ఏపీ పోలీసులు వినలేదు. సాగర్ ప్రాజెక్టు కుడికాలువ నుంచి ఏపీ అధికారులు నీటిని విడుదల చేసుకున్నారు. 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఒంగోలు చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో గేట్లు ఎత్తారు. నాగార్జున సాగర్ జల వివాదంలో గతంలోనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు.. తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించింది. నీటి విడుదలతో పాటు భద్రతపైనా తెలంగాణ ప్రభుత్వమే ఇప్పటి వరకూ అన్ని చర్యలు చేపడుతోంది.
మరి ఉన్నట్టుండి ఏపీ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ ఎన్నికల టైమ్‌లో నీళ్ళ పంచాయతీ మొదలుపెట్టింది. సాగర్ దగ్గర ఉద్రిక్తతలపై తెలంగాణతో పాటు ఏపీలోనూ రాజకీయనేతలు స్పందించారు. ఎలక్షన్స్ జరుగుతున్నందున ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దనీ.. పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటారని CEO వికాస్ రాజ్ చెప్పారు. కానీ ఈ వివాదంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్కతో పాటు.. బీజేపీ ఎంపీ బండి సంజయ్, ఇతర లీడర్లు కూడా స్పందించారు. ఎన్నికల వేళ సెంటిమెంట్ రగిల్చేందుకు సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం జగన్‌తో కలసి కుట్ర పన్నారన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఓ వైపు తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఇంత హడావిడిగా ఉద్రిక్త పరిస్థితి సృష్టించాల్సిన అవసరం ఏపీ సర్కార్ కు ఏంటని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అటు.. ఏపీలో బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి కూడా అక్కడి ప్రభుత్వ చర్యపై మండిపడ్డారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టడానికే జగన్ సర్కార్ చూస్తోందని ఆరోపించారు.
ASSEMBLY ELECTIONS: నిద్రపోయింది చాలు.. వచ్చి ఓటెయ్.. హైదరాబాద్‌లో మళ్లీ అదే తీరు..
ఏపీలో ఓట్ల కోసమే జగన్ కొత్త ఎత్తు వేశారని అన్నారు. సీపీఐ నారాయణ కూడా BRS, YSRCP, BJP కలసి నాటకాలు ఆడుతున్నాయన్నారు. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న టైమ్‌లో ఇలాంటి వివాదాన్ని రేకెత్తించడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం పొలిటికల్ పార్టీల్లో వ్యక్తమైంది. జగన్ సర్కార్ ఏమి ఆశించి.. రాత్రికి రాత్రి ఈ చర్యలు చేపట్టింది అన్నది తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక బయటపడే అవకాశాలున్నాయి. వివాదం తలెత్తగానే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు స్పందించి ఉంటే బాగుండేదని నీటిపారుదల రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.