Nandamuri Balakrishna: బావ కోసం బాలకృష్ణ పూజలు.. జైలు ముందు ఎమోషనల్ సీన్..
చంద్రబాబును రిసీవ్ చేసుకునేందుకు బాలకృష్ణ తన కార్యకర్తలతో కలిసి వెళ్లారు. జైలు నుంచి విడుదలై వచ్చిన తన బావ పేరు మీద పూజ చేయించి ప్రసాదం తీసుకువచ్చారు.

Nandamuri Balakrishna: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయనను బయటికి తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు నందమూరి బాలకృష్ణ. పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్తూనే లీగల్‌గా ఉన్న ఆప్షన్స్‌ను పరిశీలిస్తూ వచ్చారు. ఢిల్లీలో ఉంటూ నారా లోకేష్ బెయిల్ కోసం ప్రయత్నిస్తే.. ఇటు రాష్ట్రంలో, అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా గళం వినిపించారు.
అన్యాయంగా చంద్రబాబును అరెస్ట్ చేశారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటమే చేశారు బాలకృష్ణ. ఆఖరికి టీడీపీ శ్రేణుల ప్రార్ధన, లాయర్ల కష్టం ఫలించింది. చంద్రబాబుకు 4 వారాల పాటు బెయిల్ మంజూరైంది. 53 రోజుల తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇవాళ చంద్రబాబు విడుదలయ్యారు. చంద్రబాబును రిసీవ్ చేసుకునేందుకు బాలకృష్ణ తన కార్యకర్తలతో కలిసి వెళ్లారు. జైలు నుంచి విడుదలై వచ్చిన తన బావ పేరు మీద పూజ చేయించి ప్రసాదం తీసుకువచ్చారు. కార్ దిగి చంద్రబాబు దగ్గరికి వెళ్లిన వెంటనే ప్రసాదం కవర్‌ను ఆయనకు అందించారు. ఈ ఒక్క సీన్ చాలు బాలకృష్ణకు చంద్రబాబు అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి.
అప్పటి వరకూ జై బాబు అంటూ నినాదాలు చేసిన కార్యకర్తలు కూడా బాలకృష్ణ, చంద్రబాబు మధ్య ఆప్యాయతను అలా చూస్తూనే ఉండిపోయారు. బావ మీద బాలకృష్ణకు ఉన్న ప్రేమ ప్రతీ ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగేలా చేసింది. జైలు నుంచి వచ్చిన వెంటనే తనకు మద్దతు తెలిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు. తన కాన్వాయ్‌లో ఉండవల్లి నివాసానికి బయల్దేరారు. రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వస్తారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో చంద్రబాబు చికిత్స తీసుకుంటారు.