నందిగం అరెస్ట్, అవినాష్ ఎక్కడ…?
మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు... హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగామ సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త ని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.
మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు… హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నందిగామ సురేష్ ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త ని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. అదే ప్రాంతంలో ఉండే శ్రీనివాస రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు నుండి స్పెషల్ టీమ్స్ వచ్చి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
నందిగం సురేష్ ను నిన్ననే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావించి ఆయన నివాసానికి వెళ్ళగా అక్కడ ఆయన లేరని తెలియడంతో హైదరాబాద్ వెళ్ళారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆయనను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దేవినేని అవినాష్ కూడా హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మీద కూడా పోలీసులు ఫోకస్ చేసారు.