Nara Brahmani: ‘మోత మోగిద్దాం’ పేరుతో నిరసనకు నారా బ్రాహ్మణి పిలుపు
చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.
Nara Brahmani: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తూ ‘‘మోత మోగిద్దాం’’ పేరిట నిరసన కార్యక్రమానికి చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు ప్యాలెస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు తెలిపే నిరసనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు.
నారా బ్రాహ్మణి పిలుపు..
నియంత ముందు మొర పెట్టుకుంటే ఫలితం ఉండదన్నారు. అధికార మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అని అన్నారు. రేపు రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు 5 నిమిషాల పాటు 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా మోత మోగించాలని పిలుపునిచ్చారు. ఇంట్లోనో, ఆఫీస్‌లోనో ఇంకెక్కడ ఉన్నా బయటకొచ్చి గంట లేదా ప్లేట్ మీద గరిటెతో కొట్టండి. లేదా విజిల్ వేయాలని కోరారు. రోడ్డు మీద వాహనంతో ఉంటే హారన్ కొట్టాలన్నారు. మీరు ఏం చేసినా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని నారా బ్రహ్మణి పిలుపునిచ్చారు.
మోత మోగించి ప్రజాశబ్దం వినిపిద్దాం: లోకేశ్
టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా ‘‘మోతమోగిద్దాం’’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘‘అక్రమ అరెస్టు చేస్తే ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చూపిద్దాం. తప్పుడు కేసులు పెడితే వెనక్కి తగ్గబోమని నిరూపిద్దాం. చంద్రబాబుకు తెలుగువారంతా మద్దతిస్తున్నారని నిరూపించే సమయమిది. శనివారం రాత్రి ఉన్నచోటే మోత మోగించి ప్రజాశబ్దం వినిపిద్దాం’’ అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.