NARA LOKESH: మాటకు మాట.. దెబ్బకు దెబ్బ.. రాటుదేలుతున్న నారా వారసుడు..

చంద్రబాబు అరెస్ట్‌ మొదలు కొన్ని రోజులుగా లోకేశ్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రోజు రోజుకూ రాజకీయాల్లో లోకేశ్ రాటుదేలుతున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచీ లోకేశ్ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇక్కడ లోకల్‌ క్యాడర్‌ను కోఆర్డినేట్‌ చేస్తూ ఢిల్లీలో పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 7, 2023 | 03:50 PMLast Updated on: Oct 07, 2023 | 3:50 PM

Nara Lokesh Becoming Strong Politician Day By Day

NARA LOKESH: యుద్ధం చేసే కొద్దీ మీకు అలుపొస్తుందేమో.. నాకు మాత్రం ఊపొస్తుంది. ఈ డైలాగ్‌ ఇప్పుడు టీడీపీ నేత, చంద్రబాబు వారసుడు నారా లోకేశ్‌కు బాగా సెట్‌ అవుతుంది. చంద్రబాబు వ్యవహారంలో కేసు తీవ్రత ముదిరిన కొద్దీ లోకేశ్ మరింత ఘాటుగా జగన్‌ ప్రభుత్వం విరుచుకుపడుతున్నారు. మాట్లాడటం రాదు.. రాజకీయం తెలియదు.. చంద్రబాబు లక్షణాలేవీ లోకేశ్‌లో లేవు.. ఇవి ఒకప్పుడు లోకేశ్ గురించి అంతా చేసిన కామెంట్స్‌. కానీ చంద్రబాబు అరెస్ట్‌ మొదలు కొన్ని రోజులుగా లోకేశ్ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రోజు రోజుకూ రాజకీయాల్లో లోకేశ్ రాటుదేలుతున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుంచీ లోకేశ్ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇక్కడ లోకల్‌ క్యాడర్‌ను కోఆర్డినేట్‌ చేస్తూ ఢిల్లీలో పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని చెప్పేందుకు ఉన్న అన్ని దారులను వాడుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక నేషనల్‌ మీడియాలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూతో చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారం దేశవ్యాప్తమైంది. ఓక టీడీపీ నాయకుడిగానే కాకుండా ఒక కొడుకుగా ఆయన తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని వివరించిన తీరు ప్రతీ ఒక్కరిని ఎమోషనల్‌‌గా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఓ పక్క వైసీపీని ఎండగడుతూనే ఎప్పటికప్పుడు లాయర్లతో సంప్రదింపులు జరుపుతూ.. లీగల్‌ ఆప్షన్స్‌ను రెడీ చేసుకుంటున్నారు లోకేశ్. ఈ గ్యాప్‌లో అధికార పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను ఎప్పటికప్పుడు ఘాటుగా తిప్పి కొడుతున్నారు. రీసెంట్‌గా లోకేశ్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఆయన వ్యవహరించిన తీరు చాలా మెచూర్డ్‌గా కనిపించిందంటున్నారు రాజకీయ నిపుణులు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులను ఎంత మర్యాదగా రిసీవ్‌ చేసుకున్నారో.. వాళ్ల నోటుసులపై అంతే సూటిగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

విచారణకు హాజరయ్యేందుకు రెడీగా ఉన్నానంటూ ధైర్యం చెప్పారు. నిన్న చంద్రబాబుతో ములాఖాత్‌ అనంతరం కూడా జగన్‌కు సపోర్ట్‌ చేస్తున్న మీడియాను ఓ ఆట ఆడుకున్నాడు. సీఐడీ అధికారులు తనకు ప్రేమతో లవ్‌ లెటర్లు ఇస్తున్నారని.. అలాంటప్పుడు వెళ్లకూడదా అంటూ పంచులు పేల్చాడు. ఇవన్నీ చూస్తుంటే రాజకీయంగా రోజు రోజుకూ లోకేశ్‌ అప్‌డేట్‌ అవుతున్నాడనే విషయం క్లియర్‌గా అర్థమవుతోందంటున్నారు విశ్లేషకులు. ఎన్నికలలోపు చంద్రబాబు జైలు నుంచి బయటకు వస్తే ఏపీలో వచ్చే ఎన్నికల సమరం ఓ రేంజ్‌లో ఉండబోతోందని చెప్తున్నారు.