Nara Lokesh: గన్నవరంలో గరంగరం రాజకీయం.. వంశీ టార్గెట్‌గా లోకేశ్ పక్కా స్కెచ్..
21న గన్నవరంలో నారా లోకేశ్ పాదయాత్ర ఉంటుంది. అక్కడే భారీ సభ కూడా జరగనుంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన వల్లభనేని వంశీని టార్గెట్ చేసుకునే లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. అటు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఈ సభలోనే టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది.

Nara Lokesh: గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. ఉంటే ఉండు.. లేకుంటే పో అని యార్లగడ్డకు డోర్స్ క్లోజ్ చేసింది వైసీపీ. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో నిలబోయేది వల్లభనేని వంశీనే అని క్లారిటీ వచ్చింది. ఐతే ఇప్పుడు యార్లగడ్డ అడుగులు ఎటు పడబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని ఆసక్తి రేపుతున్న వేళ.. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గన్నవరంలోకి ఎంటర్ కాబోతోంది.
దీంతో రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందా అనే ఆసక్తి కనిపిస్తోంది. రాయలసీమ నుంచి కోస్తా వరకు లోకేష్ పాదయాత్ర సాగింది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో పాదయాత్ర కొనసాగుతుంది. ఇక్కడ అయిదురోజుల పాటు పాదయాత్ర చేస్తారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేసి లోకేష్ ఓడిపోయారు. మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అందుకే ఇక్కడ ఎక్కువ ఫోకస్ పెట్టారు. అయితే ఒక్క మంగళగిరిలోనే అయిదు రోజులు పాదయాత్ర చేయనున్న లోకేష్.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కేవలం మూడు రోజుల పాటే యాత్ర చేయనున్నారు. విజయవాడ, గన్నవరం మాత్రమే కవర్ అయ్యేలా పాదయాత్ర ఉంటుంది. 19న విజయవాడలోకి ఎంట్రీ ఇస్తారు. విజయవాడ వెస్ట్, తర్వాత సెంట్రల్‌లో పర్యటిస్తారు. 20న విజయవాడ ఈస్ట్, పెనమలూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 21న గన్నవరంలో పాదయాత్ర ఉంటుంది. అక్కడే భారీ సభ కూడా జరగనుంది. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన వల్లభనేని వంశీని టార్గెట్ చేసుకునే లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది.
అటు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ఈ సభలోనే టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది. లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని సమాచారం. ఇదంతా వంశీకి చెక్ పెట్టడం కోసమే. గన్నవరంలో వంశీకి బలం ఎక్కువ. ఆయనకు చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. మరి గన్నవరంలో వంశీ టార్గెట్‌గా లోకేశ్ ఏం మాట్లాడుతారు. వంశీ మద్దతుదారుల నుంచి స్పందన ఎలా ఉంటుంది. రాజకీయంగా పరిణామాలు ఎంటా ఉంటాయనే ఉత్కంఠ నియోజకవర్గంలో కనిపిస్తోంది.