Nara Lokesh: లోకేష్‌ను చూసి వైసీసీ భయపడుతోందా ? మంగళగిరిలో రెడీ చేసిన స్కెచ్ ఏంటి..
నారా లోకేష్‌కు మంగళగిరిలో మరోసారి చెక్ పెట్టేందు వైసీపీ తలమునకలవుతోంది. గత ఎన్నికల్లో చాలా ఈక్వేషన్స్‌తో లోకేష్‌కు చెక్ పెట్టిన జగన్.. ఈ సారి ఎన్నికల్లో మరో స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయినా లోకేష్ సాహసానికి విమర్శకులు మన్ననలు దక్కాయి. దాదాపు 25 ఏళ్ల నుంచి మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరలేదు.
మొదటి సారి పోటీలోనే అలాంటి స్థానం నుంచి పోటీ చేయడమంటే నిజంగా సాహసమే. ఎన్నికల్లో ఓడిపోయినా లోకేష్ మాత్రం మంగళగిరిని వదిలిపెట్టలేదు. లోకేష్‌పై గెలిచిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కంటే యాక్టివ్‌గా నియోజకవర్గంలో తిరగారు. చాలా ప్రాంతాల్లో సొంత నిధులతో అభివృద్ధి పనులు చేశారు. తన ఎమ్మెల్సీ నిధులను కూడా చాలా వరకూ మంగళగిరిని అభివృద్ధి చేసేందుకు ఉపయోగించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో లోకేష్‌ను ఓడించడం కష్టం అని భావించిన వైసీపీ.. కాస్ట్ కార్డ్ వాడుకునేందుకు రెడీ అవుతోంది. మంగళగిరిలో చేనేతలే ఎక్కువగా ఉంటారు. వాళ్ల ఓట్‌బ్యాంక్‌ను తమవైపు తిప్పుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో కూడా లోకేష్‌కు చెక్ పెట్టిచ్చని భావిస్తోంది వైసీపీ.
దీంతో ఈ సామాజికవర్గం నుంచే ఓ వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో లోకేష్‌కు పోటీగా దింపేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. వరుసగా బీసీ నేతలందరినీ జగన్ వైసీపీలోకి లాగేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావును పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీని చేశారు. అదే చేనేత వర్గానికి చెందిన పోతుల సునీతకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల సైతం వైసీపీలో ఉండి వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తున్నారు. టీడీపీ నేత, మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌గా పనిచేసిన గంజి చిరంజీవిని కూడా వైసీపీలోకి లాగేసుకున్నారు.
దీంతో చేనేతల్లో బలమైన నేతలంతా ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు. కేవలం లోకేష్‌ను ఓడించే టార్గెట్‌తోనే జగన్ ఈ సారి ఇక్కడ ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని బీసీ నేతను బరిలోకి దింపేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాటు ఆ వర్గాన్ని ఏకం చేసేందుకు పై నుంచి స్కెచ్‌లు గీస్తున్నట్టు సమాచారం. వైసీపీ ఈ సారి కూడా లోకేష్‌ను ఓడిస్తే.. రాజకీయంగా లోకేష్‌ను పూర్తిగా దెబ్బ కొట్టినట్టు అవుతుందని వైసీపీ భావిస్తోంది. అందుకే ఈ సారి మంగళగిరిలో బీసీ సామాజికవర్గ సమీకారణాలతో ఆట సరికొత్తగా మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది.