Nara Lokesh: టీడీపీ, జనసేన సభకు లోకేశ్ ఎందుకు రాలేదు ?
పొత్తు, సీట్ల ప్రకటన తర్వాత.. రెండు పార్టీలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభలో.. లోకేశ్ కనిపించకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇదే కాదు.. సీట్ల ప్రకటన సమయంలోనూ లోకేశ్ కనిపించలేదు.
Nara Lokesh: తాడేపల్లిగూడెం వేదికగా.. టీడీపీ, జనసేన మొదటి ఉమ్మడిసభతో ఏపీ రాజకీయం వేడెక్కింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. చంద్రబాబు, పవన్ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. పొత్తు, సీట్ల ప్రకటన తర్వాత.. రెండు పార్టీలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభలో.. లోకేశ్ కనిపించకపోవడం ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇదే కాదు.. సీట్ల ప్రకటన సమయంలోనూ లోకేశ్ కనిపించలేదు. ఇలా రెండు పార్టీల కీలక రాజకీయ సమావేశాలకు లోకేశ్ అటెండ్ కాకపోవడం.. కొత్త అనుమానాలు తావిస్తోంది.
TS DSC Notification: 11062 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..
దీంతో ఆయన ఎందుకు రాలేదు.. ఏం జరిగిందని ఆరా తీయడం మొదలుపెట్టారు చాలామంది. భోగాపురంలో జరిగిన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ వచ్చారు. ఐేత తాడేపల్లిగూడెం సభకు లోకేష్ ఎందుకు రాలేదు.. ఏమైనా బిజీగా ఉన్నారా.. ఎంత బిజీగా ఉంటేమాత్రం ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైంది కదా.. ఆయన రాకపోవడం ఏంటి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇక వైసీపీ అనూకుల మీడియా.. ఓ అడుగు ముందుకేసి రకరకలా కథనాలు మొదలుపెట్టింది. పవన్‌కు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడాన్ని లోకేశ్ ఒప్పుకోవడం లేదని.. అందుకే దూరంగా ఉంటున్నారనే ప్రచారం మొదలుపెట్టింది. ఐతే దీన్ని టీడీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయ్. యువగళం పాదయాత్ర తర్వాత.. శంఖారావం పేరుతో లోకేశ్ జిల్లాల పర్యటనలు చేపడుతున్నారు. ఈ పనుల్లో బిజీగా ఉండి సభకు రాలేకపోయారని క్లారిటీ ఇస్తున్నారు.
టీడీపీ పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల.. పార్టీ కేడర్‌ను స్ట్రాంగ్ చేసే బాధ్యత లోకేశ్ తీసుకున్నారు. దీనికోసం ఆయనే రంగంలోకి ప్రతీ ఒక్కరితో టచ్‌లోకి వెళ్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సత్తా చాటాలని టీడీపీ ప్లాన్ మీద ఉంది. దీనికోసం త్వరలో జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధం అవుతోంది. ఆ సభను విజయవంతం చేసే బిజీలోనే లోకేశ్ ఉన్నారని.. పొలిటికల్ టీమ్‌తో కలిసి పనుల్లో బిజీగా ఉన్నారని.. అందుకే సభకు రాలేదన్నది తెలుగు తమ్ముళ్ల మాట. ఏమైనా ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.