ANDHRA PRADESH: ఏపీకి రాగానే నారా లోకేశ్ అరెస్టు..? ఆంధ్రా పాలిటిక్స్‌లో మరో సంచలనం..!

ఈనెల 29 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న లోకేశ్‌కు షాక్ ఇచ్చేలా అనూహ్యంగా అరెస్టు చేయాలనే వ్యూహంతో జగన్ సర్కారు ఉందని వినికిడి. యువగళం పాదయాత్రను ప్రారంభించడానికి ముందే లోకేశ్‌ను అరెస్టు చేస్తే.. ఆయనకు ప్రజా సానుభూతి దక్కకుండా చేయొచ్చని ప్లాన్ చేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2023 | 07:36 PMLast Updated on: Sep 26, 2023 | 7:36 PM

Nara Lokesh Will Arrest By Cid In Fibre Grid Scam After He Came To Andhra Pradesh

ANDHRA PRADESH: ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. చంద్రబాబు అరెస్టుతో వేడెక్కిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతోందనే చర్చ నడుస్తోంది. పది రోజులుగా ఢిల్లీలో ఉంటున్న చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ను.. అక్కడి నుంచి ఏపీకి వచ్చిన వెంటనే సీఐడీ అధికారులు అరెస్టు చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌ను అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫైబర్ గ్రిడ్ వ్యవహారంతో ముడిపడిన అన్ని కీలక ఫైల్స్‌ను ఇప్పటికే రెడీ చేసినట్లు సమాచారం.

ఢిల్లీ నుంచి వచ్చాక.. ఈనెల 29 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్న లోకేశ్‌కు షాక్ ఇచ్చేలా అనూహ్యంగా అరెస్టు చేయాలనే వ్యూహంతో జగన్ సర్కారు ఉందని వినికిడి. యువగళం పాదయాత్రను ప్రారంభించడానికి ముందే లోకేశ్‌ను అరెస్టు చేస్తే.. ఆయనకు ప్రజా సానుభూతి దక్కకుండా చేయొచ్చని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో రాజమండ్రి ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే లోకేశ్‌ను అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ అరెస్టు మాత్రం తప్పేలా లేదు. దీంతోపాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను ఏ14గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో ఇప్పటికే చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి పొంగూరు నారాయణ, లింగమనేని రమేష్, లింగమనేని రాజశేఖర్ తదితరుల పేర్లను సీఐడీ చేర్చింది.
బాలయ్య, భువనేశ్వరి, బ్రాహ్మణి..
లోకేశ్ గత పది రోజుల వ్యవధిలో ఢిల్లీలో పలు పార్టీల కీలక నేతలతో భేటీ అయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని, ఈ వ్యవహారంపై స్పందించాలని కోరారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసుపై కొందరు ప్రముఖ న్యాయ నిపుణులతో కూడా లోకేశ్ చర్చించారు. తాజాగా ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ ఆయన సమావేశమయ్యారు. మరోవైపు చంద్రబాబు రిమాండ్ గడువు పెరుగుతూపోతోంది. బెయిల్ దొరకడం గగనంగా మారింది. ఇప్పటికే ఓ విడతగా రెండు రోజుల పాటు చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. ఈ తరుణంలో లోకేశ్‌ను కూడా అరెస్టు చేస్తే టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు అవుతుంది. అదే జరిగితే.. పార్టీ కీలక బాధ్యతలను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి, నందమూరి బాలయ్య నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికి వారు ఇప్పటికే మానసికంగా సమాయత్తం అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే.. మరోవైపు జనంతో మమేకం కావాలని ప్లాన్ చేస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు.. నెల రోజుల వ్యవధిలో చంద్రబాబు, లోకేశ్‌ను సీఐడీ అరెస్టు చేయడం అనేది రాజకీయ ప్రతీకార చర్యే అనే అంశాన్ని ప్రజలకు వివరించాలని బాలయ్య, భువనేశ్వరి, బ్రాహ్మణి డిసైడ్ అయ్యారు.
సుప్రీంకోర్టు లీగల్ టీంతో ఏపీ సీఐడీ..
టీడీపీ హయాంలో లోకేశ్ 3 శాఖలకు మంత్రిగా పనిచేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌తో పాటు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాల్లోనూ నారా లోకేశ్ పాత్ర ఉందని సీఐడీ ఆరోపించింది. స్కిల్ స్కామ్ కేసులో లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేష్ పాత్రను సీఐడీ పదేపదే ప్రస్తావిస్తోంది. కిలారును లోకేషే బినామీగా ప్రవేశపెట్టారని సీఐడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి పలు ఆధారాలను సీఐడీ సేకరించిందని, అయితే అవి అరెస్ట్ చేసేందుకు సరిపోవని, ఈ నేపథ్యంలో మరింత లోతుగా విచారించి ఆధారాలు సేకరించే పనిలో సీఐడీ ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో లోకేశ్ కదలికలపై దృష్టిసారించినట్లు ప్రచారం జరుగుతోంది. లోకేశ్‌ కేసు విషయంలో ముందుకు ఎలా వెళ్లాలనే దానిపైనా సుప్రీంకోర్టు లీగల్ టీంతో ఏపీ సీఐడీ పోలీసులు చర్చించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.