NARA LOKESH: ఆళ్ల రాజీనామాతో మంగళగిరిలో లోకేశ్‌కు ఇక తిరుగే ఉండదా..?
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఎప్పుడూ నియోజకవర్గంలోనే కనిపిస్తున్న లోకేశ్.. జనాలకు అందుబాటులో ఉంటూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. అటు యువగళం పాదయాత్ర ద్వారా మంచి పరిణతి చెందినట్లు.. జనాల్లో టాక్ సంపాదించారు.
NARA LOKESH: ఏపీ రాజకీయాల్లో మంగళగిరి గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణరెడ్డి పదవికి రాజీనామా చేయడంతో పాటు వైసీపీకి కూడా గుడ్ బై చెప్పారు. దీంతో నియోజకవర్గ బాధ్యతలను గంజి చిరంజీవి చేతిలో పెట్టారు వైఎస్ జగన్. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి లోకేష్ పోటీలో నిలిచారు. ఐతే వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ల చేతిలో ఓడిపోయారు. ఐతే ఇప్పుడు ఆయన రాజీనామాతో మంగళగిరిలో లోకేశ్‌కు తిరుగులేదనే టాక్ వినిపిస్తోంది.
Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్..!
పైగా అటు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత.. ఎప్పుడూ నియోజకవర్గంలోనే కనిపిస్తున్న లోకేశ్.. జనాలకు అందుబాటులో ఉంటూ అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. అటు యువగళం పాదయాత్ర ద్వారా మంచి పరిణతి చెందినట్లు.. జనాల్లో టాక్ సంపాదించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్ విజయాన్ని అడ్డుకోవడం ఎవరికీ సాధ్యం కాదని.. టీడీపీ వర్గాలు భావిస్తున్నాయ్. ఐతే అది అంత ఈజీగా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున గంజి చిరంజీవి పోటీలో నిలిచే అవకాశం ఉంది. అదే నిజం అయితే.. టీడీపీకి, లోకేశ్‌కు గట్టి పోటీ తప్పదు. గంజి చిరంజీవి.. పద్మశాలి వర్గానికి చెందిన నాయకుడు. మంగళగిరిలో ఆ సామాజికవర్గ ఓటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. మంగళగిరిలో దాదాపు 60వేలకు పైగా పద్మశాలి వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు. వీళ్లంతా గంజి చిరంజీవి వైపు మొగ్గు చూపితే.. ఈసారి కూడా లోకేశ్‌కు నిరాశ తప్పపదు.
దీంతో ఈసారి మంగళగిరి స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను సరిచేసుకుటూ నియోజకవర్గంలో టీడీపీ బలపడేలా చంద్రబాబు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచే లోకేశ్ పోటీ చేయబోతున్నట్లు మొదట్లోనే ప్రకటించడంతో ఈసారి ఎలాగైనా గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.