NARA LOKESH: లోకేశ్ యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా..!
అక్టోబర్ 3 న సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు కి సంబంధించి వాదనలు ఉన్న నేపథ్యంలో యువగళం పాదయాత్ర. పునఃప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని టిడిపి ముఖ్య నేతలు లోకేష్ ని కోరారు.

NARA LOKESH: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరిగి ప్రారంభించనున్న యువగళం పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం లోకేష్ పాదయాత్ర శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉంది. అక్టోబర్ 3 న సుప్రీం కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసు కి సంబంధించి వాదనలు ఉన్న నేపథ్యంలో యువగళం పాదయాత్ర.
పునఃప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని టిడిపి ముఖ్య నేతలు లోకేష్ ని కోరారు. నాయకుల అభిప్రాయాల తో ఏకీభవించిన లోకేష్ యువగళం పునఃప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పునఃప్రారంభ తేదీని ప్రకటించాలని నిర్ణయించారు. కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తెచ్చి చంద్రబాబుని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని, ఈ సమయంలో లోకేష్ ఢిల్లీలో ప్రతినిత్యం అడ్వకేట్ల తో సంప్రదింపులు చెయ్యడం చాలా అవసరమని టిడిపి ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు.
పాదయాత్రలో ఉంటే న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుంది అని లోకేష్ చెప్పారు నేతలు. దీంతో వారి సూచన మేరకు యువగళం పాదయాత్రను వాయిదా వేశారు. పాదయాత్ర తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేది త్వరలోనే వెల్లడించనున్నారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఈ పాదయాత్ర వాయిదా పడిన సంగతి తెలిసిందే.