KTRs sensational comments : బీజేపీ, కాంగ్రెస్ కొత్తకుట్రలు.. రాబోయే 15 రోజులు అప్రమత్తం : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాబోయే పదిహేను రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ కొత్త కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో మనుగోడుకు చెందిన పాల్వాయి స్రవంతి చేరక సందర్భంగా ఈ సంచలన కామెంట్స్ చేశారు.
రాబోయే పదిహేను రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ కొత్త కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో మనుగోడుకు చెందిన పాల్వాయి స్రవంతి చేరక సందర్భంగా ఈ సంచలన కామెంట్స్ చేశారు. కాళేశ్వరం కూలుతోందంటూ…రెండు రోజుల్లో నివేదికలు రెడీ చేసి పంపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీ, మోడీ కొత్త కొత్త రిపోర్టులు తయారు చేయిస్తున్నారు. దేశంలో కేసిఆర్ చక్రం తిప్పకుండా కొత్త కుట్రలు చేస్తారని కేటీఆర్ ఆరోపించారు. ఈ 15 రోజులూ ఇవే కుట్రలు చేస్తూ మన ఆలోచనలు మార్చేలా చేస్తారన్నారు. మన జీవితాల్లో వెలుగులు నింపిన కేసిఆర్ కావాలా? కారు చీకట్లు తెచ్చే కాంగ్రెస్ కావాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అని కోరారు కేటీఆర్.
పాల్వాయి కుటుంబంతో అనుబంధం : కేటీఆర్
రాజగోపాల్ రెడ్డి ఎందుకు పార్టీలు మారాడో అర్థం కావడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసలు మునుగోడు ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. మళ్ళీ కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి ఎందుకు చేరాడని ప్రశ్నించారు. డబ్బు,మద్యం పంపిణీ చేసి వంద కోట్లతో మళ్ళీ గెలవలాని రాజగోపాల్ చూస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా ఆయన్ని ఓడించాలని కేటీఆర్ కోరారు. తమకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. TRS లోకి రమ్మన్నా…కాంగ్రెస్ లోనే ఉంటానని చెప్పారు. ఇప్పుడు ఆమె కూతురు పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందన్నారు కేటీఆర్. తాను బాగా ఆలోచించే బీఆర్ఎస్ లో చేరినట్టు పాల్వాయి స్రవంతి తెలిపారు. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదని తన తండ్రి చెప్పిన మాటలు గుర్తున్నాయ్నారు. కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిన నేతలను వెనక్కి నెట్టి ఇతరులకు అవకాశాలు ఇస్తున్నారని మండిపడ్డారు. తాను పదవుల కోసం బీఆర్ఎస్ లో చేరలేదన్నారు పాల్వాయి స్రవంతి. ఈ పార్టీతోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమన్నారు.