నెక్ట్స్ టార్గెట్ కొడాలి నాని, రోజాయేనా ? రెచ్చిపోయిన నేతల్లో వణుకు మొదలైందా…?

వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైందా ? వంశీని జైలుకు పంపడంతో...తమను కూడా అరెస్టు చేస్తారన్న భయం పట్టుకుందా ? అడుసు తొక్కనేలా...కాలు కడగనేలా అన్నట్లు వ్యవహరిస్తున్నారా ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2025 | 11:55 AMLast Updated on: Feb 15, 2025 | 11:55 AM

New Tension Started For Ycp Leaders

వైసీపీ నేతలకు కొత్త టెన్షన్ మొదలైందా ? వంశీని జైలుకు పంపడంతో…తమను కూడా అరెస్టు చేస్తారన్న భయం పట్టుకుందా ? అడుసు తొక్కనేలా…కాలు కడగనేలా అన్నట్లు వ్యవహరిస్తున్నారా ? మాజీ మంత్రులు కొడాలి నాని, ఆర్కే రోజా, జోగి రమేశ్ లాంటి నేతలు…హిట్ లిస్టులో ఉన్నారా ?

వైసీపీ హయాంలో…ఆ పార్టీ నేతలు ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా…వైసీపీ నేతలను ప్రశ్నించినా…రోడ్లు సరిగ్గా లేవని అన్నా…నరకం చూపించారు. ఆడ, మగ అన్న తేడా లేకుండా వేధింపులకు గురి చేశారు. కొందరిపై కేసులు పెట్టించారు. మరికొందర్ని జైలు పాలు చేశారు. ఇంకొందర్ని పోలీసులతో తీవ్రంగా కొట్టించారు. మరోసారి నోరెత్తకుండా ఉండేందుకు ఎన్ని చేయాలో అన్ని చేసేశారు. కాలచక్రం ఎప్పుడు ఒకేలా ఉండదు. గిర్రున తిరిగింది. వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. నేను తలచుకుంటే…టీడీపీలో ఎవరు మిగలరన్న వైసీపీ అధినేత జగన్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ…జస్ట్ 11 సీట్లకే పరిమితం అయింది.

వైసీపీ హాయాంలో కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ, జోగి రమేశ్, అంబటి రాంబాబు…మాములు ఓవరాక్షన్ చేయలేదు. అసలవీ నోర్లా లేదంటే మూసినదా అన్నట్లు పెట్రేగిపోయారు. నోటి చెప్పలేని…చెవులతో వినలేని భాషను ఉపయోగించారు. మళ్లీ వైసీపీనే వస్తుందన్న ధీమాతో…టీడీపీ నేతలను ఎంత మాటోస్తే అంత అనేశారు. కుటుంబసభ్యులను, పిల్లలను కూడా వదల్లేదు. అంత ఛెండాలంగా మాట్లాడారు. సోషల్ మీడియాలో అతి జుగుప్సాకరంగా పోస్టులు పెట్టించారు. నేచర్ చాలా గొప్పది. వాళ్లు వీళ్లయ్యారు. ప్రభుత్వం మారిపోయింది. అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అమలు చేస్తామని ప్రస్తుత మంత్రి లోకేశ్ ముందు నుంచి వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. అయినా వైసీనీ నేతలు పట్టించుకోలేదు. పైగా పప్పుగాడు ఏం చేస్తాడంటూ చిల్లరకూతలు కూశారు.

టీడీపీ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమాపై అటాక్ చేసిన మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ తురకా కిశోర్ ను వెతివెతికి అరెస్టు చేశారు. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని బొక్కలోకి తోశారు. దీంతో నెక్స్ట్ టార్గెట్ ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. చంద్రబాబును, లోకేశ్ పై డాలి నాని, ఆర్కే రోజా, జోగి రమేశ్…అడ్డదిడ్డంగా నోరు పారేసుకున్నారు. వీరితో పాటు మరికొందరు కూడా రెచ్చిపోయారు. గన్నవరంలో బలమైన నాయకుడిగా పేరున్న వంశీనే అరెస్టు చేయడంతో…మిగిలిన నేతల్లో వణుకు మొదలైంది. తమను కూడా అరెస్టు చేస్తారన్న భయంతో లోలోపల టెన్షన్ పడుతున్నారు. వైసీపీ అధిష్ఠానం మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని చెబుతున్నా…ప్రెస్ మీట్లు పెట్టేందుకు జంకుతున్నారు. నోరు జారనేల…కేసులు పెట్టించుకోవడం ఎందుకు అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. కొడాలి నాని అయితే చాలా కాలంగా కనిపించడం లేదు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. రోజా టీడీపీపై విమర్శలు చేస్తున్నా…మునుపటి దూకుడు ప్రదర్శించడం లేదు. అరెస్టు చేస్తారన్న భయంతో ఆమెకు పట్టుకున్నట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో వీర్రవీగిన వైసీపీ నేతలంతా…టీడీపీ అధికారంలోకి రావడంతో సైలెంట్ అయ్యారు. కొందరు స్వస్థలాలను వదిలిపోయారు. మరి కొందరు తామ ఫ్యూచర్ కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు…పక్క పార్టీల్లోకి జంపయ్యారు. సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిన నేతలు…మీడియా సమావేశాల్లో అడ్డదిడ్డంగా మాట్లాడిన మాజీ మంత్రులు…బూతులతో రెచ్చిపోయిన నాయకులు వ్యవహారశైలిలో, తీరుల పూర్తిగా మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేశ్, రోజా మాటల్లో తేడా కనిపిస్తోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ధర్మాన బ్రదర్స్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. ధర్మాన బ్రదర్స్ ఏం చేస్తున్నారో…ఎక్కడున్నారో కూడా తెలియకుండా మెయింటెన్ చేస్తున్నారు.