చైనా నుంచి కొత్త వైరస్, 2025 మరో 2020 కాబోతుందా
2025 మరో 2020 కాబోతోందా. మొత్తం ప్రపంచానికి ఇప్పుడు పట్టుకున్న టెన్షన్ ఇదే. అప్పుడు ఎలాంటి పరిస్థితు ఉన్నాయో ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిజానికి ఈ భయం ఇప్పుడు మొదలయ్యింది కాదు.
2025 మరో 2020 కాబోతోందా. మొత్తం ప్రపంచానికి ఇప్పుడు పట్టుకున్న టెన్షన్ ఇదే. అప్పుడు ఎలాంటి పరిస్థితు ఉన్నాయో ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిజానికి ఈ భయం ఇప్పుడు మొదలయ్యింది కాదు. చాలా రోజుల నుంచి సోషల్ మీడియా యూజర్లు 2025 విషయంలో భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే 2020, 2025 రెండు సంవత్సరాలు కూడా స్టార్ట్ అయిన వీక్ ఒకటే. 2020, 2025 రెండూ కూడా బుదవారం స్టార్ట్ అయ్యాయి. వెనస్‌డే, తర్స్‌డే, సాటర్‌డే. WTF అంటే ఎంటో నా కంటే మీకే బాగా తెలుసు. ఇదే విషయాన్ని చాలా రోజుల నుంచి సోషల్ మీడియా యూజర్లు వైరల్ చేస్తున్నారు. 2020లాగే ఈ సంవత్సరం కూడా ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ముందు నుంచీ భయపడుతూనే ఉన్నారు.
ఎగ్జాక్ట్‌గా వాళ్లు అనుకున్నట్టే.. అప్పుడు కరోనా పుట్టినిళ్లుగా చెప్పే చైనా నుంచి ఇప్పుడు మరో వైరస్ ప్రపంచం మీదకు బయల్దేరింది. చైనాలో వ్యాపించడం మొదలైన HMPV వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. ఇది కూడా అచ్చూ కరోనాలాగే వ్యాప్తి చెందుతోంది. దగ్గు, తుమ్ముల నుంచి, వైరస్ వచ్చిన వ్యక్తుల నుంచి వేరే వ్యక్తులకు… చాలా ఈజీగా వ్యాప్తి చెందుతోంది. కేసులు పెద్దగా రావడంలేదు అని చైనా ప్రభుత్వం చెప్తున్నా.. అక్కడ పరిస్థితి మాత్రం వేరేలా ఉంటోంది. వందల సంఖ్యలో కేసులు రోజూ వస్తున్నాయి. పేషెంట్లతో హాస్పిటల్స్ నిండిపోతున్నాయి. 2020లో కరోనా సమయంలో కూడా ఇదే చెప్పారు. పెద్ద ప్రమాదం లేదు అని చెప్తుండగానే వందల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. కొన్ని రోజుల్లోనే ఆ సంఖ్య లక్షలకు చేరింది.
దీంతో ఇప్పుడు కూడా ఈ వైరస్ ఎలా రూపాంతరం చెంది ఎలాంటి ఉపద్రవాన్ని తీసుకువస్తుందోనని చాలా మంది భయపడుతున్నారు. నిజానికి ఈ వైరస్ అంత ప్రమాదం కాదు అని చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు. కరోనాతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న వైరస్ అని అంతా చెప్తున్నారు. ప్రతీ వింటర్ సీజన్‌లో ఎలా సీజనల్ డిసీజ్‌లు వ్యాపిస్తాయో ఇది కూడా అలాంటిదేనని అంటున్నారు. దీని విషయంలో ఎవరూ పెద్దగా భయపడాల్సిన పని లేదు.. కరోనా లాంటి రోజులు మళ్లీ రావు అని చెప్తున్నారు. కానీ.. ఎవడి భయం వాడిది. అంతా జాగ్రత్తగా ఉండటం బెటర్. ఎందుకంటే కరోనా కూడా ఇలాగే సైలెంట్‌గా స్టార్ట్ అయ్యి వైలెంట్‌గా మారిపోయింది. ఆ లాక్‌డౌన్ రోజులు తలుచుకుంటేనే చాలా మందికి కాళ్లూ చేతులూ వణుకుతాయి. ఆ రేంజ్‌లో కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెట్టింది. ఇప్పుడు అదే చైనా నుంచి ఇంకో వైరస్ బయల్దేరింది. కరోనా నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ వైరస్ బారిన పడకుండా ఎంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే అంత బెటర్.