నెక్స్ట్ జీహెచ్ఎంసీ బాస్ ఎవరూ…? ఆమెపై రేవంత్ నమ్మకం
తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ ఇచ్చిన తీర్పు తో ప్రత్యామ్నాయ మార్గాలను తెలంగాణా ప్రభుత్వం అన్వేషిస్తోంది.
తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేయాలని క్యాట్ ఇచ్చిన తీర్పు తో ప్రత్యామ్నాయ మార్గాలను తెలంగాణా ప్రభుత్వం అన్వేషిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కమీషనర్ గా ఉన్న ఆమ్రపాలిని ఏపీ లో రిపోర్ట్ చేయాలని క్యాట్ చెప్పడంతో నెక్స్ట్ బల్దియా బాస్ ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. బల్దియా లో ఉన్న సవాళ్ళు అర్థం చేసుకొని ఫేస్ చేసే సమర్ధ అధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళన లో జీహెచ్ఎంసీ కీలకంగా ఉంది. ఈ నేపధ్యంలో సీనియర్ ఐఏఎస్ ను కొన్నిరోజుల పాటు ఇన్చార్జి జీహెచ్ఎంసీ కమీషనర్ గా నియమించే అవకాశం ఉంది. ఆర్ అండ్ బి ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన పేరుంది. పంచాయతీ రాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, హెచ్ఎండీఏ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, డిల్లీ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్ పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ కి కొన్నిరోజుల పాటు ఇన్చార్జి జీహెచ్ఎంసీ కమీషనర్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎనర్జీ సెక్రటరీగా ఉన్న రోనాల్డ్ రోస్ స్థానం లో సందీప్ కుమార్ సుల్తానియా, కృష్ణ భాస్కర్ పేర్లు వినపడుతున్నాయి. మిగితా స్థానాల్లో ఇంచార్జులను సర్కార్ నియమించనుంది.