INDIA-Canada: నిప్పుతో నేషనల్ గేమ్స్.. కెనడాకు భారత్ అంటే ఎందుకంత అక్కసు..
రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే చర్చ మొదలైంది. అతని కోసం కెనడా ఎందుకింత తాపత్రయపడుతోందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. భారత్ బ్యాన్ చేసిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేతే ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్.
INDIA-Canada: భారత్, కెనడా ధౌత్య సంబంధాలు రోజు రోజుకూ దిగజారిపోతున్నాయి. ఖలిస్థాని టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో.. రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. ఆ దేశ పార్లమెంట్ వేదికగా అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ పరిస్థితి తీవ్రం అయింది. ఆ తర్వాత కొన్ని గంటలకే కెనడాలో ఉన్న భారత రాయబారిపై ఆ దేశ ప్రభుత్వం బహిష్కరణ వేటు వేసింది.
దీనికి బదులుగా భారత్‌లోని సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి.. భారత్ సర్కార్ కెనడాకు గట్టిగా సమాధానమిచ్చింది. రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే చర్చ మొదలైంది. అతని కోసం కెనడా ఎందుకింత తాపత్రయపడుతోందనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. భారత్ బ్యాన్ చేసిన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధినేతే ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్. ఈ ఏడాది జూన్ 18వ తేదీన కెనడాలోని ఓ గురుద్వారాలో గుర్తు తెలియని వ్యక్తులు హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను హత్య చేశారు. ఈ హత్యలో భారత్ హస్తం ఉందనేది కెనడా వాదన. 1997లో భారత్ నుంచి కెనడాకు శరణార్థుడిగా వెళ్లాడు హర్దీప్ సింగ్. అక్కడి నుంచి ఖలిస్థాన్ వేర్పాటు కార్యక్రమాలు మొదలు పెట్టాడు. పాకిస్థాన్ ఐఎస్‌ఐతో కూడా హర్దీప్‌కు సంబంధాలు ఉన్నట్టు భారత్ ఇంటెలిజెన్స్ సంస్థకు సమాచారం ఉంది. ఇతర దేశాల్లో కూడా హర్దీప్ చేస్తున్న టెర్రర్ యాక్టివిటీస్ కారణంగా 2020లో హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్ట్‌గా ప్రకటించారు.
భారత్‌లో నిషేధానికి గురైన ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ కోసం హర్దీప్ సింగ్ నిజ్జర్ యువకులను రిక్రూట్ చేసేవాడు. వాళ్లకు శిక్షణ ఇచ్చి సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటువాద గ్రూపును కూడా నడిపాడు. కొన్ని రోజుల క్రితం ఖలిస్థానీ రెఫరెండం కూడా నిర్వహించాడు. 2018లో పంజాబ్ నుంచి కెనడాకు వెళ్లిన ఉగ్రవాదుల లిస్ట్‌లో నిజ్జర్ పేరు కూడా ఉంది. నిజ్జర్‌ను అప్పగించాలంటూ పంజాబ్ పోలీసులు 2022లో కెనడా ప్రభుత్వాన్ని కోరారు. కానీ కెనడా నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అప్పటికే నిజ్జర్ చాలా కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి చస్తే ఆ నేరాన్ని భారత్ మీద మోపాలని చూస్తోంది కెనడా. జస్ట్ కెనడాలో ఉంటున్న సిఖ్ కమ్యూనిటీ ఓట్‌బ్యాంక్‌ను కాపాడుకునేందుకు భారత్‌తో గేమ్స్ ఆడుతోంది.