BRS IN RURAL: ఎదురుగాలి ? కారును నమ్మని గ్రామీణ ఓటర్లు.. బీఆర్ఎస్ ఆశలన్నీ వాళ్ళపైనే..

ఫించన్లకు వృద్ధులు, రైతుబంధు, రైతు బీమాకు రైతులు.. గ్రామీణ ప్రాంతాల్లో ఆకర్షితులైనా మహిళలు మాత్రం గులాబీ పార్టీ మీద కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాకపోవడమే ఇందుక్కారణం. అల్లుడొస్తే ఏడ పడుకోవాలి.. అంటూ కేసీఆర్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ జనం చెవుల్లో రింగు మంటున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 29, 2023 | 07:03 PMLast Updated on: Nov 29, 2023 | 7:18 PM

No Advantage For Brs In Rural Brs Hopes Only On Hyderabad

BRS IN RURAL: తెలంగాణను రెండు సార్లు.. అంటే పదేళ్ళపాటు పాలించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మహిళలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, రైతులు, దళితులు, ముస్లింలు.. ఇలా అనేక వర్గాలవారికి పథకాలు తీసుకొచ్చింది. సాధారణంగా ఈ పథకాలను అందుకున్న వాళ్ళల్లో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే ఉన్నారు. ఫించన్లు, రైతుబంధు, రైతు బీమా, ఇతర ఆర్థిక సహాయాలన్నీ వాళ్ళే ఎక్కువగా అనుభవించారు. కానీ ఎందుకో గ్రామీణ ఓటర్లు బీఆర్ఎస్‌ను మాత్రం కరుణించడం లేదని తెలుస్తోంది. ఫించన్లకు వృద్ధులు, రైతుబంధు, రైతు బీమాకు రైతులు.. గ్రామీణ ప్రాంతాల్లో ఆకర్షితులైనా మహిళలు మాత్రం గులాబీ పార్టీ మీద కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాకపోవడమే ఇందుక్కారణం. అల్లుడొస్తే ఏడ పడుకోవాలి.. అంటూ కేసీఆర్ చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ జనం చెవుల్లో రింగు మంటున్నాయి.

KTR BLOOD DONATION: కేటీఆర్ డయాబెటిస్ పేషెంట్ ! మరి రక్తదానం చేయొచ్చా?

గజ్వేల్ లాంటి చోట్ల అందమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళుకట్టించి ఇచ్చినా.. చాలా చోట్ల మాత్రం ఇవి అర్హులైన లబ్ధిదారులకు అందలేదు. కొన్ని చోట్ల అనర్హులు, పార్టీ కార్యకర్తలకే ఇళ్ళు దక్కాయన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఇళ్ళ స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తామని చెప్పినా దాన్ని కూడా అమలు చేయలేదు. చివరగా ఎన్నికలకు ముందు హడావిడిగా గృహలక్ష్మి స్కీమ్ తెచ్చారు. అది కూడా 3 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇందులో కొందరు మహిళలకు మాత్రమే ఎమ్మెల్యేలు హడావిడిగా చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ వచ్చింది. చెక్కులన్నీ మాదగ్గరే ఉన్నయ్.. ఎన్నికలయ్యాక ఇస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రచారాల సందర్భంగా చెప్పుకున్నారు. కానీ మహిళా ఓటర్లు ఆ మాటలు నమ్మడం లేదు. ఇక డ్వాక్రా సంఘాలు మంచిగానే రన్ అయినా.. మధ్యతరగతి జనానికి చాలామందికి ఇవి అందుబాటులో లేవు. రైతుల సంగతి చూసుకుంటే.. రైతు బంధు, రైతు బీమా ఇంకా పెంచుతామని ఆశలు పెట్టింది బీఆర్ఎస్ గవర్నమెంట్.

ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికలపై ఏపీలో బెట్టింగ్‌లు.. ఆ ఇద్దరి మీదే భారీగా పందేలు..

అసలు రైతుబంధు పేటెంట్ హక్కు నాదే అని చాలా ప్రచార సభల్లో అన్నారు కేసీఆర్. అయితే కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో రైతు బంధు అమౌంట్‌ను రూ.15 వేలకు పెంచింది. పైగా కౌలు రైతులకు కూడా వర్తించేలా చూస్తామంది. దీనికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయలపైగా బాకీ ఉన్న రుణాలు మాఫీ కాలేదు. దాంతో చాలామంది రైతులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మారిపోయినట్టు అర్థమవుతోంది. ఇంక దళితులకు మూడు ఎకరాల భూమి రాలేదు. దళితబంధు కూడా ఏవో కొందరు గులాబీ కార్యకర్తలకే దక్కిందనే విమర్శలు కూడా ఉన్నాయ. బీసీలు, గిరిజనులు, ముస్లింలు కూడా కారు పార్టీకి వ్యతిరేకం అయ్యారు. టోటల్‌గా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వర్గం బీఆర్ఎస్ పార్టీకి దూరమవుతూ వచ్చింది. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు కేసీఆర్‌కు వివరించినట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గ్రామీణ ఓటర్ల నుంచి ఆదరణ లేకపోవడంతో.. హైదరాబాద్ సిటీ, పట్టణ ఓటర్లపై ఆశలు పెట్టుకుంది. హైదరాబాద్‌లో అయితే ప్రభుత్వం చేపట్టిన విజిబుల్ డెవలప్మెంట్ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలోలాగా ట్రాఫిక్ నరకయాతన కొంతవరకూ తగ్గింది. సిటీలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, స్కై వేలు అందుబాటులోకి వచ్చాయి.

ఒక్క వర్షం వస్తే మునిగిపోవడం తప్ప.. గతంలో లాగా తాగు నీటికి ఇబ్బంది లేదు. సో.. ఇక్కడి అభివృద్ధిని చూసి సిటీ ఓటర్లు కరుణిస్తారని బీఆర్ఎస్ నమ్మకంగా ఉంది. అయితే సిటీలో సీమాంధ్రుల ఓట్లు ఎటు పడతాయన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. గత రెండు సార్లు మాత్రం బీఆర్ఎస్‌కే ఓట్లేశారు వీళ్ళు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ కామెంట్స్‌తో.. సీమాంధ్ర కమ్మ ఓటర్లలో బీఆర్ఎస్‌పై వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆ ఓటర్లు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ తర్వాత కేటీఆర్ అలా అనకుండా ఉండాల్సింది అని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. దాంతో సీమాంధ్రుల్లో కమ్మవారు మినహా మిగతా వర్గాల వారు తమకే ఒట్లు వేస్తారని కారు పార్టీ నమ్ముతోంది. ఇలాంటి ఈక్వేషన్స్ కరెక్ట్ అయితే.. హైదరాబాద్‌లో కొన్ని సీట్లు గెలిచినా అధికారంలోకి రావొచ్చని బీఆర్ఎస్ నమ్మకంగా ఉంది. గ్రామీణ ఓట్ బ్యాంక్ పోగొట్టుకోవడం గులాబీ పార్టికి ఇబ్బందిగానే ఉంది.