Kangana : ఫస్ట్ లిస్ట్‌లో కంగనా, అక్షయ్‌కు నో ఛాన్స్..
లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఎన్నికల (BJP Elections) వ్యూహాలను శరవేగంగా అమలు చేస్తోంది. మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. షెడ్యూల్ రాకముందే తొలి జాబితాను ప్రకటించాలనుకున్న బీజేపీ హైకమాండ్.. గెలుపు గుర్రాలను సిద్ధం చేసింది.

No chance for Kangana and Akshay in the first list..
లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఎన్నికల (BJP Elections) వ్యూహాలను శరవేగంగా అమలు చేస్తోంది. మోదీ సారధ్యంలో ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. షెడ్యూల్ రాకముందే తొలి జాబితాను ప్రకటించాలనుకున్న బీజేపీ హైకమాండ్.. గెలుపు గుర్రాలను సిద్ధం చేసింది. 195 అభ్యర్థులతో బీజేపీ లోక్ సభ అభ్యర్థులు తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం అభ్యర్థుల్లో 57 మంది ఓబీసీ(OBC), 27 మంది ఎస్సీ అభ్యర్థులకు తొలి విడతలో అవకాశం కల్పించారు. ప్రధాని నరేంద్రమోదీ మరోసారి వారణాసి నుంచి బరిలో దిగనున్నారు. 28 మంది మహిళలు, 47 మంది యువతకు ఈసారి అవకాశం కల్పించింది బీజేపీ.. ఇక తెలంగాణలో 9 సీట్లను పార్టీ ప్రకటించింది.
రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ.. ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. అందుకే ఆభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రజలను ఆకట్టుకునే బలమైన అభ్యర్థులను వడపోసింది. ముఖ్యంగా 370 సీట్ల టార్గెట్‌ను చేరుకోవడానికి బీజేపీ ముమ్మర కసరత్తులు చేసింది. కాగా.. బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్, హీరో అక్షయ్ కుమార్‌లకు టికెట్ వచ్చే అవకాశమున్నట్లు వార్తలు బలంగా వినిపించాయి. తొలి జాబితాలోనే వీరిద్దరి పేర్లు ప్రకటించే అవకాశమున్నట్లు టాక్ వినిపించింది. ఢిల్లీలోని చాందినీచౌక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అక్షయ్‌కుమార్(Akshay Kumar).. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నుంచి కంగనా రనౌత్ (Kangana Ranaut) ను బీజేపీ అధిష్టానం నిలబెట్టాలనుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. దీంతో.. కంగన, అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ బీజేపీ ఫస్ట్ లిస్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే.. బీజేపీ రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్‌లో ఈ ఇద్దరు సినీ సెలబ్రిటీల పేర్లు లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. అయితే.. రానున్న జాబితాలో వీరిద్దరి పేర్లు కచ్చితంగా ఉంటాయని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
కంగనా రనౌత్ బీజేపీకి, ప్రధాని మోదీకి మద్దతుగా ఎప్పుడూ తన అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటుంది. మోదీ పేరు చెబితే చాలు కంగనాలో భక్తి భావం పొంగుకొస్తుంది. ఒకానొక సమయంలో మోదీని భగవంతుడి 11వ అవతారంగా కీర్తించిన కంగనా.. దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది కూడా.. అంతేకాదు.. రాజకీయాల్లో వచ్చేందుకు ఇదే సరైన సమయమని ఇటీవల కంగనా కామెంట్ కూడా చేసింది. దానికి తగ్గట్లుగానే.. కంగనా బీజేపీలో చేరితే స్వాగతిస్తామని పార్టీ అధ్యక్షుడు జే.పీ.అడ్డా గతంలో వ్యాఖ్యానించారు. దీంతో.. బీజేపీ నుంచి కంగనా పొలిటికల్ ఎంట్రీ పక్కా అని అందరూ ఫిక్సయిపోయారు. ఇక యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా అనేక సందర్భాల్లో మోదీకి అనుకూలంగా మాట్లాడారు. దీంతో.. లోక్‌సభ ఎన్నికల్లో ఈ బాలీవుడ్ సెలబ్రిటీలు ఇద్దరూ బీజేపీ తరపున బరిలోకి దిగడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి.. ఫస్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేక పోయిన ఈ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు.. వచ్చే లిస్ట్‌లో అయినా ఛాన్స్ కొట్టేస్తారో లేదో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.