పవర్ లో ఎవరున్నా… 5 ఏళ్లే ,సర్కార్లు నడపడం కష్టమే

మీరు నమ్మండి నమ్మకపోండి. ఇది నిజం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ పార్టీ పవర్ లో ఉన్నా... అది ఐదేళ్లు మాత్రమే. మళ్లీ అధికారంలోకి రావడం ఇప్పుడున్న పార్టీల్లో ఏ పార్టీకి సాధ్యం కాదు. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్నచోట, ఆర్థికంగా బలమైన ప్రత్యర్థులు ఉన్నచోట ఐదేళ్ల తర్వాత పాలక పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. అలా చూస్తే 2028... 29లో తెలుగు రాష్ట్రాల్లో

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2025 | 10:07 AMLast Updated on: Feb 03, 2025 | 10:07 AM

No Matter Who Is In Power It Is Difficult To Run Governments For Only 5 Years

మీరు నమ్మండి నమ్మకపోండి. ఇది నిజం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ పార్టీ పవర్ లో ఉన్నా… అది ఐదేళ్లు మాత్రమే. మళ్లీ అధికారంలోకి రావడం ఇప్పుడున్న పార్టీల్లో ఏ పార్టీకి సాధ్యం కాదు. ముఖ్యంగా ప్రతిపక్షం బలంగా ఉన్నచోట, ఆర్థికంగా బలమైన ప్రత్యర్థులు ఉన్నచోట ఐదేళ్ల తర్వాత పాలక పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. అలా చూస్తే 2028… 29లో తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిపోవడం ఖాయం. ఇలా చెప్తున్నందుకు మాకు ఏదో ఒక పార్టీ ముద్ర వేసి…. మేము ఆ గ్రూపులో ఉన్నాం.. ఈ గ్రూపులో ఉన్నాం అని ఆక్షేపించకండి. ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మీకే అర్థమవుతుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు నడపడం చాలా కష్టం. బలమైన వ్యూహం…. అత్యంత బలహీనుడైన ప్రత్యర్థి, ఆర్థిక సత్తా ఉంటే తప్ప ఐదేళ్ల తర్వాత మళ్లీ పాలక పార్టీ అధికారంలోకి రావడం తెలుగు రాష్ట్రాల్లో చాలా కష్టం. ప్రాక్టికల్ గా అసాధ్యం కూడా. దీనికి ప్రధాన కారణం ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు. అధికారంలోకి వచ్చాక అవి నెరవేర్చలేక, సంక్షేమ పథకాలు అమలు చేయలేక , ఇస్తున్న పథకాలకు డబ్బులు సర్దలేక…. జనాల్ని సంతృప్తి పరచలేక ఏ ప్రభుత్వమైనా సరే విఫలం కావాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో జనానికి, కష్టపడి పనిచేయడం కంటే కూర్చొని తినడం అలవాటు చేసేయ్ పార్టీలు. సంక్షేమం డబ్బులు ఇవ్వడం…. ఉచితాలు ఇవ్వడం ఈ రెండు వ్యసనాలను నరనరాన్న ఎక్కించాయి. తెలుగు రాష్ట్రాలు అప్పులు తీర్చడం ఎప్పటికీ సాధ్యం కాదు. ఎవ్వరికీ సాధ్యం కాదు. అసలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఏంటి.?.. మన ఆదాయం ఎంత?…. సంపద సృష్టించే మార్గాలు ఏమిటి? ఇవేవీ ఎన్నికల ముందు పార్టీలు ఆలోచించవు. ఏదో ఒకటి చేసి గెలవాలి… పవర్ లోకి వచ్చేస్తే ఆ తర్వాత ఏదో మసి పూసి మారేడు కాయ చేసి ఐదేళ్లు నెట్టుకు రావచ్చు అనే ఆలోచనతోనే మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు.

పక్క పార్టీ ఏది ఇస్తే…. ఏం ప్రకటిస్తే …దానికి నాలుగు రెట్లు ఎక్కువ అనౌన్స్ చేసేసి జనాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేస్తున్నాయి పార్టీలు.2019లో వైఎస్ఆర్సిపి, 2023 లో తెలంగాణలో కాంగ్రెస్, 20 24 లో ఏపీలో టిడిపి కూటమి ఇలాగే అధికారంలోకి వచ్చాయి.2014… 19 మధ్య ఏపీలో చంద్రబాబు నాయుడు పాలన దుర్మార్గపు పాలన ఏమి కాదు. అంత అస్తవ్యస్తమైన పరిపాలన కూడా కాదు. సాదా సీదా ఆరోపణలు తప్ప వ్యవస్థలు మొత్తం నిర్వీర్యం అయిపోయేటంత దుష్పరిపాలన ఏమి జరగలేదు. జగన్మోహన్ రెడ్డి పథకాలు… అలవి కాని హామీ లకు ఆకర్షితులై….. చంద్రబాబు కార్పొరేట్ స్టైల్ కి విసిగిపోయిన జనం వైయస్సార్సీపీకి 2019లో 151 సీట్లు ఇచ్చేశారు. ఐదేళ్లపాటు ఏపీలో జగన్ దేశంలో ఎవ్వరూ ఇవ్వనని సంక్షేమ పథకాలు ఇచ్చాడు. ఒకటో తారీకున ఇంటికి వృద్ధాప్య పింఛన్ పంపాడు. బటన్ నొక్కడం… డబ్బులు వేయడం తప్ప ఐదేళ్లలో జగన్ సర్కార్ చేసింది శూన్యం. అప్పులు తెచ్చి జనం ఎకౌంట్లో డబ్బులు వేస్తూ….. మరోవైపు వైసీపీ అధినేత, మిగిలిన నేతలు అంతా రకరకాల మార్గాల్లో రాష్ట్రాన్ని దోచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి సర్కార్ కి అసలు ఏం పాలు పోవడం లేదు.

ఖజానాలో రూపాయి లేదని, వడ్డీలు కట్టలేక పోతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఆయన ఏం తక్కువ తినలేదు. మొన్నటి ఎన్నికల్లో అడ్డు అదుపు లేనిహామీలు ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్ ఏకంగా 3000 నుంచి 4000 కి పెంచడమే కాక రెండు నెలల బోనస్ కూడా ఇచ్చారు. ఇక మహిళలకు ఫ్రీ బస్సు, తో పాటు ఆరు హామీలు సూపర్ సిక్స్ అమలు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. కేవలం అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ లీడర్ కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి ఏపీ ని మరోసారి ముంచేశారు. ఇప్పుడు సంపదలు సృష్టించి ,ఆ సంపదలు జనానికి పంచి పెడతామని మరో సరికొత్త నినాదం అందుకున్నారు. సంపదలు సృష్టించడం ,ఆ సంపదలు అందరికీ పంచిపెట్టడం ఒక్క రోజులో…. రెండు రోజుల్లో జరిగేది కాదు. ఏది ఎలా ఉన్నా ఏపీలో ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోయింది.

ఈ ఐదేళ్లపాటు జనాన్ని సంతృప్తి పరచడం చంద్రబాబు కాదు కదా దేవుడికి వల్ల కూడా సాధ్యం కాదు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది…. అది మనకు ఎందుకు ఇస్తారు..?. మనకు ఇచ్చిన డబ్బు ఎవరిది..?. అప్పులు చేసి తెచ్చిన డబ్బుకి మనమే బాధ్యులం…. అనే ఇలాంటి విషయాలన్నీ జనం ఆలోచించడం లేదు. డబ్బులు ఇస్తున్నారా లేదా.? డబ్బిచ్చే వాడే మంచి నాయకుడు. ఇదే జనం ఆలోచన. అందువల్ల జనాన్ని సంతృప్తి పరచడం ఎవడి వల్ల కాదు. డ్రగ్స్ బానిస లాగా డబ్బు బానిసలు అయిపోయారు జనం. ఐదేళ్లపాటు ఉచితాలు, సంక్షేమ పథకాలు ఇస్తూ రాష్ట్రాన్ని ఏ నాయకుడు సమర్థంగా నడపలేడు. ఫైనల్ గా వ్యతిరేక ఓటు డెవలప్ అవుతుంది. ఫలితంగా ఓడిపోతారూ.

ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి. పదేళ్ల కెసిఆర్ పాలనపై అసంతృప్తితో ఉన్న జనానికి రకరకాల పథకాలు ఇస్తామంటూ కాంగ్రెస్ వాళ్లు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చేశారు. ఇప్పుడు అమలు చేయలేకపోతున్నారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం అని చెప్తూనే కెసిఆర్ లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, అందులో కమిషన్ల పేరిట వేల కోట్లు కుమ్మేసాడు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఆ వడ్డీలు కట్టలేక జుట్టు పీక్కుంటుంది. రెవిన్యూ జనరేషన్ లో అగ్రగామిగా నిలిచిన హైదరాబాద్ కూడా రియల్ ఎస్టేట్ కుప్ప కూలడంతో అతలాకుతలం అయిపోయింది. రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ సర్కార్ ఏడాదిలోనే చేతులెత్తేసింది. ఇక ఈ గవర్నమెంట్ రాదు అని అప్పుడే పబ్లిక్ డిసైడ్ అయిపోయారు. ఆరు నెలలు కూల్ గా ఉన్న బి ఆర్ ఎస్ ఇప్పుడు జవసత్వాలు కూడా తీసుకొని పొద్దున లేచిన దగ్గర్నుంచి రేవంత్ ని రైతు బీమా ఎక్కడ, రైతు భరోసా ఎక్కడ, ?ఆ స్కీమ్ ఎందుకు ఇవ్వటం లేదు.?.. ఈ అకౌంట్లో డబ్బులు ఎందుకు పడలేదు ?అని రోజు నిలదీస్తోంది. ప్రభుత్వం అంటే గవర్నెన్స్ చేయడం అనే విధానం పోయింది. ప్రభుత్వం ప్రజలకి డబ్బులు పంచాలి. డబ్బులు పంచితేనే ఆ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. ఇవ్వకపోతే ఆ ప్రభుత్వాన్ని ప్రజలు దించేస్తారు. తెలంగాణలో కూడా సంపదలు సృష్టిస్తాం అనే ఒక కొత్త డైలాగ్ చెప్పి జనాన్ని మభ్య పెట్టారు కాంగ్రెస్ వాళ్లు. ఇప్పుడు సంపద లేదు… సృష్టి లేదు. ఏడాది తిరిగేసరికి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చేసింది.

అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలన్నీ అవినీతిమయమే. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు ఐదేళ్ల కాలంలో కనీసం లో కనీసం 50 వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటాయి. బి ఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ అకౌంట్లోనే 1300 కోట్ల రూపాయల వైట్ మనీ జమ అయిందంటే…. ఆ పార్టీ పది సంవత్సరాల్లో తెర వెనక ఇంక ఎంత కుమ్మేసి ఉంటుందో అంచనా వేయండి. ఇక ఏపీలో వైఎస్ఆర్సిపి ఆర్థిక అరాచకానికి అంతే లేదు. రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీ ,ఆ పార్టీ నాయకులు వేల కోట్లకు ఎదిగిపోతారు. అధికారం పోయిన తర్వాత కూడా ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి నిత్యం అసంతృప్తిని రగిలిస్తూ ఉంటారు. ఎలాగూ ప్రభుత్వాలు ఉచితాలు, సంక్షేమ పథకాలు పూర్తిగా ఇవ్వలేవు. దీంతో ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా పై, మెయిన్ స్ట్రీ మీడియాపై, ఉద్యమాలపై, క్యాడర్ పై మళ్లీ డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వంపై అసంతృప్తి రగిలిస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఏపీలో టిడిపి, తెలంగాణలో కాంగ్రెస్ అదే పని చేసి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఏపీలో వైసిపి, తెలంగాణలో బి ఆర్ఎస్ అదే పని చేస్తూ నిత్యం అసంతృప్తిని రగిలిస్తున్నాయి.

రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని చక్కదిద్దడం ఇక ఏ సర్కారు వలన సాధ్యం కాదు. ప్రజల్ని సంతృప్తి పరచడం అసలే సాధ్యం కాదు. అందువల్ల ఏ అధికార పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. జనానికి డబ్బులు ఇచ్చి కూడా… ఏపీలో జగన్ అధికారంలోకి రాలేదు. అంటే జనం కేవలం డబ్బులుకే పడిపోరు. డబ్బు ఇచ్చిన తర్వాత… పనితీరు కూడా చూస్తున్నారు. లీడర్ల అవినీతిని గమనిస్తున్నారు. అవినీతికి పాల్పడకుండా భారతదేశంలో ఏ పార్టీ, ఏ నాయకుడు మనుగడ సాధించ లేరు. అయినవాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుకోవాలి. కమిషన్లు తీసుకోవాలి. ఇవన్నీ రాష్ట్రాల్లో లీడర్లు పార్టీలు నిత్యం చేస్తున్నదే. అందువల్ల జనంలో అసంతృప్తి సర్వసాధారణం. కాస్త ఇన్వెస్ట్ చేసి ఆ అసంతృప్తిని నిత్యం రగిలిస్తుంటే చాలు ఐదేళ్లకు ఆటోమేటిగ్గా సర్కారు మారిపోతుంది.

ఏపీలో జగన్ సర్కార్ ని ఐదేళ్లపాటు కంటిమీద కునుకు లేకుండా చేశాడు చంద్రబాబు. ఒకవైపు సోషల్ మీడియా… మరోవైపు మెయిన్ స్క్రీన్ మీడియా సాయంతో జగన్ సర్కార్ ని వనికించేశాడు. జగన్ విధ్వంస పాలనను ఒకటికి పది రెట్లు చూపించగలిగాడు. రాబోయే రోజుల్లో ఏపీలో వైసిపి మళ్లీ ఇదే ఫార్ములా అమలు చేస్తుంది. జనం జగన్ విధ్వంసపాలను మర్చిపోతారు. చంద్రబాబు పాలనపై అసంతృప్తి పెంచుకుంటారు. ఇప్పటికే 40% ఓట్ బ్యాంకు ఉన్న జగన్ మరో 12 శాతం తెచ్చుకోవడం కష్టమేమీ కాదు. తెలంగాణలోనూ అదే పరిస్థితి. కంగాలి కాంగ్రెస్లో కుమ్ములాటలు ఇప్పటికే తారా స్థాయికి చేరుకున్నాయి. ఈ గవర్నమెంట్ నాలుగేళ్ల తర్వాత ఉండదు అని కాంగ్రెస్ క్యాడర్, జనం డిసైడ్ అయిపోయారు. దీంతో బి ఆర్ ఎస్ బిజెపి పార్టీలకు తెలంగాణలో అధికారం నల్లేరు మీద నడకే కాబోతుంది. ఇక్కడ జగన్ చెడ్డవాడా?చంద్రబాబు మంచోడా? రేవంత్ చెడ్డోడా ? కెసిఆర్ మంచివాడ ? అన్నది చర్చే కాదు. అందరూ ఒకటే. అందరూ అవినీతిపరులే. అందుకే ఒకరికి ఒకసారి, మరొకరికి ఇంకోసారి అధికారం ఇవ్వాలి అనే అభిప్రాయం జనానికి వచ్చేసింది. ఐదేళ్ల కంటే ఏ పార్టీని జనం భరించలేరు. అందుకే ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో అది ఐదేళ్లు మాత్రమే.2028…29 లో అధికార మార్పిడిని మనం కచ్చితంగా చూస్తాం.