తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు పక్క ప్లానింగ్ తో విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఉదయం 10:30కు ఈడి కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి కేటీఆర్ కు ఈడి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈనెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఈ రోజు న్యాయవాది లేకుండానే ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈడీ కార్యాలయం వెలుపల భారీగా భద్రత వ్యవహరించడంతో ఆయనను నేడు అరెస్టు చేసే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు కేటీఆర్ కు షాక్ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంగా పేర్కొంది. తనపై ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసులు కొట్టేయాలంటూ ముందు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ ఆ తర్వాత హైకోర్టు షాక్ ఇవ్వడంతో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. దీనిపై విచారణ జరగగా సుప్రీంకోర్టు తాము జోక్యం చేసుకోలేము అని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో పలు ఆధారాలను కూడా ఈడీ అధికారులు సేకరించారు. అటు ఏసీబీ కూడా కేటీఆర్ ను మరోసారి విచారణకు రావాలని నోటీసులు పంపింది. దీనితో ఆయనను ఎప్పుడూ అదుపులోకి తీసుకుంటారు అనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే ఈడీ అధికారులు ఈ కేసులో ఐఏఎస్ అరవింద్ తో పాటుగా బీఎల్ఎన్ రెడ్డిని విచారించగా వారి వద్ద నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. కేటీఆర్ ఆదేశాలతోనే తాము పనిచేసినట్లు వాళ్లు వాంగ్మూలం ఇవ్వగా ఆ వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్నారు. వారం రోజుల క్రితం కేటీఆర్ విచారణకు హాజరైన సమయంలో న్యాయవాది ఉండటం నేడు విచారణకు హాజరైన సమయంలో న్యాయవాది లేకపోవడంతో అసలు ఏం జరుగుతుంది అనేది కాస్త ఆసక్తికరంగా మారింది. ఇక కేటీఆర్ విషయంలో ఏసీబీ అధికారులు సైలెంట్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అనే వార్తలు వస్తున్నాయి. మనీలాండరింగ్ సహా పలు అంశాల్లో ఈడి అధికారులు జోక్యం చేసుకోవడంతో ఏసీబీ కేసుని పూర్తిగా ఈడి చేతిలో పెట్టే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతుంది. తనను అరెస్టు చేసే అవకాశం లేదని ముందు కేటీఆర్ భావించినా ఈడీ అధికారులు ఎంటర్ కావడంతో కాస్త కంగారు పడుతున్నారు. ఏసీబీ విచారించిన సమయంలోనే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ అప్పుడు ఏసీబీ అధికారులు సైలెంట్ అయిపోయారు.[embed]https://www.youtube.com/watch?v=peawp4mrzFk[/embed]