AP Politics : జగన్‌, బాబు కాదు.. ఆయనే కావాలి.. ఏపీ పాలిటిక్స్‌లో మూడో వ్యక్తి ఎంటర్‌

జగనన్నే మళ్లీ రావాలన్నది వైసీపీ నినాదం. రాష్ట్రం బాగుపడాలంటే బాబు మళ్లీ రావాలన్నది టీడీపీ కేడర్‌ నినాదం. ఏపీ మొత్తం ఇదే సీన్‌ కనిపిస్తోంది. కానీ ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం జగన్‌, బాబు పేరు కాకుండా మూడో పేరు తెరపైకి వచ్చింది. ఆయన వస్తేనే ఆ ప్రాంతం బాగుపడుతుందని ఆ ప్రాంతం యూత్‌ అంతా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలంటూ ర్యాలీలకు సైతం సిద్ధమవుతున్నారు. ఆయనే మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత రఘువీరా రెడ్డి రాజకీయంగా వీక్‌ అయ్యారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌ను బతికించేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ 2019 ఎన్నికల తరువాత సీన్‌ అర్థం చేసకుని సైలెంట్‌ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 2, 2023 | 01:02 PMLast Updated on: Dec 02, 2023 | 1:02 PM

Not Jagan Or Babu He Is The One We Need Enter The Third Person In Ap Politics

జగనన్నే మళ్లీ రావాలన్నది వైసీపీ నినాదం. రాష్ట్రం బాగుపడాలంటే బాబు మళ్లీ రావాలన్నది టీడీపీ కేడర్‌ నినాదం. ఏపీ మొత్తం ఇదే సీన్‌ కనిపిస్తోంది. కానీ ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం జగన్‌, బాబు పేరు కాకుండా మూడో పేరు తెరపైకి వచ్చింది. ఆయన వస్తేనే ఆ ప్రాంతం బాగుపడుతుందని ఆ ప్రాంతం యూత్‌ అంతా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలంటూ ర్యాలీలకు సైతం సిద్ధమవుతున్నారు. ఆయనే మాజీ పీసీసీ చీఫ్‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డి. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తరువాత రఘువీరా రెడ్డి రాజకీయంగా వీక్‌ అయ్యారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌ను బతికించేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ 2019 ఎన్నికల తరువాత సీన్‌ అర్థం చేసకుని సైలెంట్‌ అయ్యారు.

Exciting exit polls : కాక రేపుతున్న ఎగ్జిట్‌ పోల్స్‌.. రాజకీయ నాయకుల్లో నరాలు తెగే టెన్షన్‌..

ఇక తన వల్ల కాదంటూ ఖద్దరు బట్టలు మార్చి కాషాయం కట్టారు. తన సొంతూరు నీలకంఠపురంలో వ్యవసాయం చేసుకుంటూ ఓ సామాన్యుడిలా బతకడం ప్రారంభించారు. కానీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ దృష్టిలో రఘువీరా క్రేజ్‌ మాత్రం అలాగే ఉంది. ఈ కారణంగానే కర్నాటక ఎన్నికల టైంలో రఘువీరాకు కీలక బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఆ బాధ్యతను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత.. CWC మెంబర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మారుతున్న రాజకీయ వాతావరణంతో.. ఏపీలో కూడా కాంగ్రెస్‌కు పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నారట కాంగ్రెస్ వాదులు. ఈ క్రమంలోనే మిణుకు మిణుకుమంటున్న దశలో కూడా పార్టీ బాధ్యతను భుజానేసుకుని మోసిన రఘువీరా తిరిగి యాక్టివ్‌ అవ్వాలన్న డిమాండ్‌ పెరుగుతోందట. ముఖ్యంగా కళ్యాణదుర్గం ఏరియా నుంచి ఇది ఎక్కువగా వినిపిస్తున్నట్టు తెలిసింది. వాస్తవంగా రఘువీరా సొంత నియోజకవర్గం మడకశిర. డీ లిమిటేషన్‌లో అది ఎస్సీ రిజర్వ్ కావడంతో తర్వాత ఆయన కళ్యాణదుర్గం నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు.

ఆ టైంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం గట్టిగా పనిచేశారన్న పేరుంది. అందుకే ఈసారి ఎన్నికల్లో కళ్యాణదుర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా రఘువీరా పోటీ చేయాలన్న డిమాండ్‌ పెరుగుతోందట. ఎందుకంటే.. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ఇటు వైసీపీ, అటు టీడీపీ రెండూ ఇంటి పోరుతో సతమతం అవుతున్నాయి. గ్రూప్‌ రాజకీయాలతో రెండు పార్టీల్లో గందరగోళ వాతావరణం ఉంది. ఆ పొలిటికల్ స్పేస్‌లోకి రఘువీరా వస్తే బాగుంటుదని అంటున్నారట ఆయన సన్నిహితులు. పాత కాంగ్రెస్‌ వాదులతో పాటు న్యూట్రల్‌గా ఉండే వాళ్ళలో సైతం అదే అభిప్రాయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈనెల 8న ఛలో నీలకంఠాపురం అని పిలుపునిచ్చారు కొందరు రఘువీరా అభిమానులు. వాల్‌పోస్టర్‌ ఆవిష్కరించి ఆ రోజున కళ్యాణదుర్గంలోని అక్కమ్మ గుడి నుంచి రఘువీరా స్వగ్రామం నీలకంఠాపురం వరకు బైక్ ర్యాలీ తీయబోతున్నారట. అయితే రఘువీరా మాత్రం తన మనసులో ఏముందో ఇప్పటికీ బయటపెట్టడం లేదు. దీంతో కళ్యాణదుర్గం పొలిటికల్ సర్కిల్స్‌లో ఉత్కంఠ పెరుగుతోంది. చూడాలి మరి.. ఈ ర్యాలీ తరువాత రఘువీరా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.