Top story: సర్జికల్ స్ట్రైక్స్ కాదు, అంతకుమించి, పాక్ అంతమే దోవల్, జైశంకర్ టార్గెట్

దేశంలో ఉగ్రదాడి అంటే గుర్తొచ్చే సంఘటలను రెండు. వాటిలో మొదటిది 26/11 ముంబై మారణహోమం. రెండోది పుల్వామా టెర్రర్ అటాక్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2025 | 08:44 PMLast Updated on: Apr 23, 2025 | 8:44 PM

Not Surgical Strikes But More The End Of Pakistan Is The Target Of Doval Jaishankar

దేశంలో ఉగ్రదాడి అంటే గుర్తొచ్చే సంఘటలను రెండు. వాటిలో మొదటిది 26/11 ముంబై మారణహోమం. రెండోది పుల్వామా టెర్రర్ అటాక్. ఆ రెండు ఘటనల్నీ యావత్ దేశం కలలో కూడా మరచిపోదు. కానీ, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి ఆ రెండు ఘటనల కంటే అతి దారుణమైంది. ఎందుకంటే, అమాయక టూరిస్టులపై కాల్పుల్లో రాక్షస మూకలు వ్యవహరించిన తీరు
భారత్‌తో పాటు యావత్ ప్రపంచాన్నీ నిలువునా వణికించేసింది. ఉగ్రవాదానికి మతం లేదని అడ్డంగా వాదించిన సో కాల్డ్ సెక్యులర్ వాదులకు కూడా ఈ మతోన్మాద ఉగ్రవాదం ముచ్చెమటలు పెట్టించింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఉగ్రవాదానికి మతం లేదనడం మూర్ఖత్వమే అవుతుంది. అందుకే, మతోన్మాదంతో రెచ్చిపోయిన ఉగ్రమూకలతోపాటు వాటిని పెంచి పోషించిన పాకిస్తాన్‌ కథ కూడా ముగించడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్, ట్రబుల్ షూటర్ జైశంకర్ సైతం సీన్‌లోకి వచ్చేశారు. ఈ ఇద్దరి యాక్షన్ శత్రువు ఊహకందని రీతిలో ఉండబోతోంది. ఇంతకూ, పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఎలా బదులివ్వబోతోంది? సర్జికల్ స్ట్రైక్స్‌కు మించిన ప్లాన్ ఆఫ్ యాక్షనేంటి?

ఉగ్రవాదానికి మతం లేదనే సో కాల్డ్ సెక్యులర్ వాదులకు ఒక్కసారి ఈ వీడియో చూస్తే నిజం ఎంత దారుణంగా ఉంటుందో తెలుస్తుంది. కశ్మీర్‌లో సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేయడంతో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రూరమైన దాడిలో బయటపడిన బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఉగ్రదాడి సమాచారం అందుకున్న సైనికులు ఘటనా స్థలానికి వెళ్లి.. వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుం డగా అక్కడున్న పర్యటకులు.. వారు కూడా ఉగ్రవాదులే అనుకొని భయంతో వణికిపోయారు. ఉగ్రవాదులు మళ్లీ ఆర్మీ దుస్తుల్లో తమపై దాడి చేయడానికి వచ్చారేమో అనుకొని సైనికులను చూసిన ఓ మహిళ తన చిన్నారిని ఏమీ చేయొద్దని బోరున విలపిస్తూ.. చేతులు జోడించి వారిని వేడుకుంది. ఓ సైనికుడు వారికి ధైర్యం చెప్తూ.. తాము భారత ఆర్మీ నుంచి.. మిమ్మల్ని రక్షించడానికే ఇక్కడికి వచ్చామని భరోసా ఇచ్చారు. బహుశా ఇలాంటి ఒకరోజు వస్తుందని సైనికులు కూడా ఊహించి ఉండరు. మేము భారత సైనికులం, మిమ్మల్ని రక్షించడానికే వచ్చామనే చెప్పుకోవాల్సి వచ్చిందంటే పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు బలితీసుకున్నది అమాయ ప్రాణాలనే కాదు.. 145 కోట్ల భారతీయుల ధైర్యాన్ని కూడా.

పహల్గామ్ ఉగ్రదాడి దేశంలోనే అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా చెప్పడానికీ, ఉగ్రవాదానికి మతం ఉందీ అనడానికి అసలు కారణం, అమాయకులపై ముష్కరులు వ్యవహరించిన తీరే అది. ఔను.. దేశంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగినా ఘోరాతిఘోరమైన ఉగ్రదాడి మాత్రం ఇదే. ఎందుకంటే, పాకిస్తానీ ముష్కరులు టూరిస్టుల మతం తెలుసుకుని మరీ ఊచకోత కోశారు. అచ్చంగా దశాబ్దాలక్రితం కశ్మీరీ పండిట్ల ఊచకోతలో అనుసరించిన వ్యూహాలనే పర్యాటకులపై అమలుచేశారు. మొదట మతమేంటని అడిగారు.. తర్వాత ఐడీ కార్డులు చెక్ చేశారు.. ఆ తర్వాత కొంత మంది ప్యాంట్లు విప్పి ప్రైవేట్ భాగాలను తనిఖీ చేశారు.. ఇంకొంతమందిని ఇస్లామిక్ నినాదమైన కల్మాను పఠించమని అడిగారు. ముస్లింలు కాదు అని నిర్ధారించుకున్న తర్వాతే అత్యంత దారుణంగా హత మార్చారు. దీన్నిబట్టి ఆ ముష్కరులు ఎంత కిరాత కంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవచ్చు. సో కాల్డ్ సెక్యులరిస్టులు ఇప్పుడు కూడా ఉగ్రవాదానికి మతం లేదనే వాదిస్తారా? ఆ వాదన పక్కనపెడితే.. పహల్గామ్ దాడికి ప్రతీకారం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు అసలు ప్రశ్న.

పహల్గామ్ ఉగ్రఘాతుకంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సీరియస్ వార్నింగ్ ఇది. ‘భారత్‌ను ఎవరూ భయపెట్టలేరు. దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. ప్రపంచం ఆశ్చర్యపోయే జవాబు ఇస్తాం. ఒక్క దోషిని కూడా విడిచిపెట్టే ప్రసక్తే లేదు. పాకిస్తాన్‌లో ఉన్న మాస్టర్‌మైండ్‌ను కూడా వదలం’. అన్నది రాజ్‌నాత్ సింగ్ ప్రకటన సారాంశం. ఈ రేంజ్ వార్నింగ్‌ వెనుక ఇద్దరి పాత్ర ఉంది. ఆల్రెడీ ఆ ఇద్దరూ యాక్షన్‌లోకి దిగిపోయారు. వారిలో ఒకరు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ అయితే, రెండో వ్యక్తి ట్రబుల్ షూటర్ జైశంకర్. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని తెలిసిన వెంటనే జెడ్డాలో ఉన్న మోడీ రిటర్న్ వచ్చేశారు. ఆ వెంటనే అజిత్ దోవల్, జైశంకర్‌తో సమావేశంలో కూర్చున్నారు. ఈ భేటీ అజెండా పాకిస్తాన్ అంతు చూడటమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ఇద్దరూ సీన్ లోకి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పనక్కర్లేదు.

అజిత్ దోవల్.. పహల్గామ్ దాడి తర్వాత 145 కోట్ల భారతీయులు ఇండియన్ జేమ్స్ బాండ్‌గా పిలుచుకునే ఈయన పేరు భారత్‌ కంటే పాకిస్తాన్‌లోనే ఎక్కువ రీసౌండ్ ఇస్తోంది. యుద్ద వ్యూహాల్లో దిట్ట అయిన అజిత్‌దోవల్.. పాకిస్తాన్‌పై ప్రతీకారంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ఐపీఎస్ అధి కారి అయిన దోవల్ గతంలో భద్రతాపరమైన చాలా ఆపరేషన్లను స్వయంగా నిర్వహించారు. 2019 నాటి బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్‌లో కీలకంగా వ్యవహరించిన వారిలో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అజిత్ దోవలే. ఈ ఇద్దరూ తెరమీద కనిపించలేదు. కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. తెర వెనక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అధినేతలతో చర్చలు జరిపారు. కీలక సమయాల్లో ఎవరిని రంగంలోకి దించాలో చర్చించుకున్నారు. మూడో కంటికి తెలియకుండా నిఘా వర్గాల నుంచి కీలక సమాచారం సేకరించారు. ప్లాన్ చేశారు.. ఆర్డర్స్ తీసుకున్నారు.. ఆర్డర్స్ ఇచ్చేశారు. చివరికి తెల్లవారు జామున ప్రధానికి అజిత్ దోవల్ ఫోన్ చేసి ‘పనైపోయింది’ అని గుడ్ న్యూస్ చెప్పేశారు. ఇంత తతంగం గుట్టుచప్పుడు కాకుండా, చాకచక్యంగా పూర్తిచేసిన బుర్ర ఎవరిదంటే.. జాతీయ భద్రతా సలహా దారు అజిత్ దోవల్‌ది. ఇండియన్ జేమ్స్‌బాండ్ ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారు. మరి ఈ ఆపరేషన్‌లో జైశంకర్ రోల్ ఏంటి?

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంలో భారత్ కొన్ని అంశాలను పరిశీలిస్తోంది. మిలిటరీ, దౌత్యపరంగా దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మిలిటరీ దెబ్బకొట్టే వ్యూహాలు అజిత్ దోవల్ చూసుకుంటారు. దౌత్యపరంగా దెబ్బకొట్టేందుకు ఏం చేయాలనేది ట్రబుల్ షూటర్ జైశంకర్ టార్గెట్. పాకిస్తాన్‌తో ప్రత్యక్ష, పరోక్ష వాణిజ్యాన్ని తెంచుకోవడం, సింధు నదీజలాల ఒప్పందం రద్దు, పహల్గామ్ ఉగ్రదాడి గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రతినిధులు, 95 దేశాలకి వివరించ డం ద్వారా పాకిస్తాన్ బెండు తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అసలే ఆర్థిక సంక్షోభం, వేర్పాటువాదంతో అల్లాడిపోతున్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజం సాయం నిలిచిపోయేలా చేయాలనేది అసలు ప్లాన్. పహల్గామ్ దాడి విషయంలో ఇప్పటికే ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి.
ముఖ్యంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనలో ఉండటం, ప్రధాని మోడీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన సమయంలో దాడి జరగడం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. కాబట్టి ఆయా దేశాల మద్దతు భారత్‌కే ఉంటుంది. సో.. దౌత్యపరంగా అంతర్జాతీయ సమాజాన్ని భారత్‌కు మద్దతుగా నిలపే బాధ్యత జైశంకర్‌దే. ఇక చాలా త్వరలోనే రాజ్‌నాథ్ సింగ్ చెప్పినట్టు పాకిస్తాన్‌పై ప్రపంచం ఆశ్చర్యపోయేలా దాడి జరగడం కూడా ఖాయమే. ఈ పరిణామాలన్నీ చివరకు పీవోకే విలీనం దిశగా వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.