రాఖీలో ఎన్టీఆర్‌.. రియల్‌ లైఫ్‌లో కేటీఆర్‌..

రాఖీ పండగ మాత్రమే కాదు.. లైఫ్‌లాంగ్ మెమొరీ. తోబుట్టువులతో హాయిగా జరుపుకునే పండగ. అందుకే రాఖీని మెమొరీగా మార్చుకోవాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 19, 2024 | 09:08 PMLast Updated on: Aug 19, 2024 | 9:08 PM

Ntr In Rakhi Ktr In Real Life

రాఖీ పండగ మాత్రమే కాదు.. లైఫ్‌లాంగ్ మెమొరీ. తోబుట్టువులతో హాయిగా జరుపుకునే పండగ. అందుకే రాఖీని మెమొరీగా మార్చుకోవాలని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో రాఖీ ఫెస్టివల్‌జోరుగా సాగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరు.. రాఖీలు కట్టి తోబుట్టువులపై తమ ప్రేమను చూపించారు. ఐతే కేటీఆర్‌ పరిస్థితి చూసి మాత్రం చాలామందికి జాలేసింది. సొంత చెల్లి కవిత జైల్లో ఉంది. దీంతో కేటీఆర్‌ ఎమోషనల్ అయ్యారు. కవిత తనకు రాఖీ కట్టలేకపోవచ్చునని… అయితే ఆమెకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని కేటీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

గతంలో కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టిన ఫొటోను పంచుకున్నారు. కేటీఆర్‌ను చూసి బాధపడ్డారో.. ఆ చెల్లిని మరిపించేందుకు.. ఈ చెల్లెల్లు ప్రయత్నించారో కానీ.. కేటీఆర్ చేతికి కట్టిన రాఖీలు.. పండగ రోజు హైలైట్ అయ్యాయ్‌. రెండు చేతులకు.. కేటీఆర్ మోచేతుల వరకు రాఖీలు కనిపించాయ్. ఇంకా చెప్పాలి అంటే.. రాఖీ సినిమాలో ఎన్టీఆర్‌లా కనిపించారు కేటీఆర్ అంటూ.. సోషల్‌ మీడియాలో ఈ పోస్ట్‌ను వైరల్ చేస్తున్నారు. సొంత చెల్లి పక్కనలేకపోతే ఏంటి అన్నయ్యా.. నువ్ మాకు కూడా అన్నయ్యే అని చెప్పి మరీ.. కేటీఆర్‌ చేతికి రాఖీలు కట్టారు చెల్లెళ్లు. దీంతో ఇప్పుడు కేటీఆర్ ఫొటో కాస్త వైరల్ అవుతోంది.

రీల్‌ లైఫ్‌లో ఎన్టీఆర్‌.. రియల్ లైఫ్‌లో కేటీఆర్ అంటూ.. ఆ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. ఇక అటు కవితను మీడియా ముందు తలుచుకున్న కేటీఆర్.. కాస్త ఎమోషనల్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఐదు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉన్నారు. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పలుమార్లు విచారణ జరిగినా బెయిల్ మంజూరు కాలేదు. ఈ క్రమంలో వారానికి ఒకటి రెండు సార్లు కేటీఆర్ జైలుకు వెళ్లి కవితతో ములాఖత్ అవుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి కవితను గుర్తు చేసుకుంటూ కేటీఆర్ ట్వీట్ చేయడం.. ఇలా మిగతా చెల్లెళ్లు అంతా కలిసి కేటీఆర్‌కు రాఖీ కట్టడం వైరల్‌గా మారింది.