ఎన్టీఆర్ కు మళ్ళీ అవమానం, ఆహ్వానం పంపని నారా కుటుంబం
జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టిడిపి అనేది కొంతమంది సోషల్ మీడియాలో చేసే హడావుడి. అసలు వారి మధ్య ఏముంది అనేదానిపై క్లారిటీ లేకుండానే చాలామంది సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు.

జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టిడిపి అనేది కొంతమంది సోషల్ మీడియాలో చేసే హడావుడి. అసలు వారి మధ్య ఏముంది అనేదానిపై క్లారిటీ లేకుండానే చాలామంది సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి వారికి ఓ న్యూస్ పండగ తీసుకువచ్చింది. అవును సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ కొత్త వార్తతో ఓ బ్యాచ్ సందడి చేస్తోంది. అదే జూనియర్ ఎన్టీఆర్ కు నందమూరి నారా కుటుంబాలు ఆహ్వానం పలకలేదు అనే వార్త.
2014లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిని నూతన రాజధానిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత వైసీపీ ఆయనపై పెద్ద ఎత్తున చేసిన ఒకటే ఒక, ఆరోపణ.. ఆయన ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు కట్టుకోలేదని, కేవలం ఆయన హైదరాబాదులో నివాసం ఉంటూ అక్కడే ప్రేమ చూపిస్తున్నారని, అమరావతిపై ముసలి ప్రేమ కురిపిస్తున్నారంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. టిడిపి సోషల్ మీడియా కూడా ఒకానొక సందర్భంలో.. ఈ ఆరోపణలను కొట్టి పారేయలేని పరిస్థితి.
అయితే 2019లో ఓడిపోయిన తర్వాత అమరావతిలో చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతానికి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన ఓటు హక్కు కూడా గుంటూరు జిల్లాకు మారింది. పదేళ్ళ నుంచి ఉండవల్లి సమీపంలోని కరకట్టపై చంద్రబాబు నాయుడు, లింగమనేని గెస్ట్ హౌస్ లో అద్దెకు ఉంటున్నారు. పదేళ్ల నుంచి చంద్రబాబు అక్కడే ఉంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు.. అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నారు. ఒకవైపు హైకోర్టు, మరోవైపు సచివాలయం ఉండేలా మధ్యలో ఆయన నివాసం ఉంటుంది.
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆ స్థలాన్ని చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు. ఇప్పుడు అక్కడ భూమి పూజ జరగనుంది. అమరావతి పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా తన ఇంటి పనులను పూర్తిగా మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఇంటికి సంబంధించిన నిర్మాణ బాధ్యతలను ఒక ప్రైవేట్ సంస్థకు చంద్రబాబునాయుడు కుటుంబం అప్పగించింది. దీనికి నందమూరి, నారా కుటుంబాల సమక్షంలో బుధవారం భూమి పూజ కార్యక్రమం జరగనుంది.
అయితే దీనికి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం పంపలేదు.. అనేది ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న మాట. ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం నందమూరి, నారా కుటుంబాలు విజయవాడ చేరుకున్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం లేకపోవడంతో ఎన్టీఆర్ హైదరాబాదులోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత నివాసాన్ని.. అధికారిక నివాసంగా కూడా వినియోగించుకోవాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనితో సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనులు కూడా ఇక్కడే జరగనున్నాయి. రెండేళ్లలో ఇంటి నిర్మాణం పూర్తి చేయించుకోవాలని చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఒకరకంగా చంద్రబాబు నాయుడు జీవితంలో ఈ ఇల్లు అత్యంత ప్రతిష్టాత్మకం అనే చెప్పాలి. ఆయన ఎంపిక చేసిన రాజధాని లో ఆయన ఇల్లు కట్టుకునే కార్యక్రమం ఇది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానిస్తారా.. ఆహ్వానించి ఉంటే, ఆయన వస్తారా అనేది చూడాలి.