ముంబైలో కొడాలి నానిని పరామర్శించిన ఎన్టీఆర్, టీడీపీ సోషల్ మీడియా కొత్త రచ్చ
కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య స్నేహం” ఎప్పుడూ... సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచే అంశం. వీళ్లిద్దరి మధ్య స్నేహం ఉందో లేదో ఎవరికి తెలియదు..

కొడాలి నాని, జూనియర్ ఎన్టీఆర్ మధ్య స్నేహం” ఎప్పుడూ… సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడిచే అంశం. వీళ్లిద్దరి మధ్య స్నేహం ఉందో లేదో ఎవరికి తెలియదు.. గానీ, దీనికి సంబంధించిన హడావుడి మాత్రం సోషల్ మీడియాలో గట్టిగానే జరుగుతూ ఉంటుంది. 2010 తర్వాత కొడాలి నాని టిడిపికి గుడ్ బై చెప్పి వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత టిడిపి అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చారు.
2024లో వైసీపీ ఓడిపోయే వరకు చంద్రబాబు నాయుడుని తీవ్రంగా విమర్శించిన నాయకుల్లో కొడాలి నాని ముందుంటారు. వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు నాయుడు పై ఆయన ఆరోపణలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. దీనితో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో సైలెంట్ గా ఉంటున్నాడని, కొడాలి నానితో స్నేహం ఉన్నా సరే అతన్ని కట్టడి చేసే ప్రయత్నం మాత్రం ఎన్టీఆర్ చేయలేదు, అంటూ టిడిపి సోషల్ మీడియాలో కొంతమంది ఇప్పటికీ కామెంట్ చేస్తూనే ఉంటారు.
ఇక వీళ్లిద్దరి స్నేహానికి సంబంధించి టిడిపి నేతలలో కూడా పెద్ద చర్చ ఉంటుంది. అయితే కొంతమంది మాత్రం వీళ్ళిద్దరికి మధ్య గ్యాప్ ఉందని, వీళ్ళిద్దరూ కలిసి చాన్నాళ్లయిందని, 2015 తర్వాత వీళ్ళిద్దరూ కలవలేదు.. అంటూ కొంతమంది ఇప్పటికీ ఆరోపణలను కొట్టి పారేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ వార్త బయటకొచ్చింది. ఇటీవల కొడాలి నాని గుండె సంబంధిత సమస్యలతో ముంబైలో చికిత్స తీసుకున్నారు. ఆయనకు రమాకాంత్ పాండా అనే ప్రముఖ వైద్యుడు సర్జరీ కూడా నిర్వహించారు.
హైదరాబాదులో ప్రముఖ ఆసుపత్రిలో ఉన్నా సరే కొడాలి నాని, ముంబై వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోనే కోలుకుంటున్నారు. ప్రత్యేక విమానంలో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. అయితే ఇప్పుడు కొడాలి నానిని పరామర్శించేందుకు.. జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో ఆసుపత్రికి వెళ్ళాడు, అనేది టిడిపిలో కొంతమంది మాట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న వార్ 2 లో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ లో ఒక సాంగ్ షూటింగ్ పెండింగ్ ఉంది.
ఆ సాంగ్ కోసం ముంబై వెళ్ళిన ఎన్టీఆర్ కొడాలి నానిని పరామర్శించాడు.. అనేది టిడిపి సోషల్ మీడియా మాట. అయితే ఈ విషయాన్ని బయటకు రానియకుండా జాగ్రత్త పడుతున్నాడు అని కొంతమంది కామెంట్ చేయడం గమనార్హం. దీని వెనుక ఆధారాలు ఉన్నా.. లేకపోయినా టిడిపి సోషల్ మీడియా మాత్రం ఎన్టీఆర్ ను, కొడాలి నానిని టార్గెట్ చేసే విషయంలో వెనకడుగు వేయడం లేదు. అయితే కొంతమంది నాని ఆరోగ్య పరిస్థితి.. మొత్తం బోగస్ అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. ఆయనకు నిజంగా గుండె సంబంధిత సమస్యలు ఉంటే.. విజయవాడ రమేష్ ఆసుపత్రి గుండే చికిత్సకు ప్రముఖ ఆసుపత్రిగా పేరుంది. ఎన్నో క్లిష్టమైన గుండె ఆపరేషన్లను విజయవాడలోనే నిర్వహించిన అనుభవం కూడా రమేష్ ఆసుపత్రి వైద్యులకు ఉంది. అయినా సరే ఎందుకు.. కొడాలి నాని ముంబై వెళ్లాల్సి వచ్చింది అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.