Top story : పెళ్లామా మజాకానా….!

పెళ్లాం చెబితే వినాలి... అది అమెరికా అధ్యక్షుడైనా, అనకాపల్లి వాడైనా...ఎవరికైనా పెళ్లాం పెళ్లామే.... ఇంట్లో ఆవిడే మొగుడుగారు... అలా కాదో ఇక వారికి జింతాత జితాతానే...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2025 | 11:30 AMLast Updated on: Apr 14, 2025 | 11:30 AM

Obama Micheli Divorce Rumores

పెళ్లాం చెబితే వినాలి… అది అమెరికా అధ్యక్షుడైనా, అనకాపల్లి వాడైనా…ఎవరికైనా పెళ్లాం పెళ్లామే…. ఇంట్లో ఆవిడే మొగుడుగారు… అలా కాదో ఇక వారికి జింతాత జితాతానే… అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ ఒబామా ఈ సూత్రాన్ని గుర్తించలేక దెబ్బైపోయారు.. పెళ్లామే కదా అని అప్పుడు లైట్ తీసుకున్నందుకు ఇప్పుడు ఫీలైపోతున్నారు. వ్యవహారం విడాకుల దాకా వెళ్లింది.

బరాక్ ఒబామా అమెరికా మాజీ అధ్యక్షుడు… మాజీ ఫస్ట్ లేడీ మిచెలీ ఒబామా… ఇద్దరూ చూడటానికి అనోన్యమైన జంటలా కనిపిస్తారు కదా… కనిపించడం ఏంటి నిజమే అని మాత్రం అనకండి వారిద్దరు నిన్న మొన్నటిదాకా అలా నటించారన్నమాట. ప్రస్తుతం వారిద్దరి మధ్య చాలా గ్యాప్ ఉందంటున్నారు. ఎంత గ్యాప్ అంటే విడాకులు తీసుకున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది.

ప్రపంచాన్ని ఏలే మగ మహారాజైనా భార్యకు లోకువే… పెళ్లాం చిన్నచిన్న కోరికలు తీర్చకపోతే ఇక ఆ ఇంట్లో సునామీనే…రచ్చ రంబోలానే… ప్రపంచాన్ని గెలిచినా ఇంటావిడ మనసు గెలవకపోతే మూడో ప్రపంచయుద్ధాన్ని రోజూ చూడొచ్చు. దేశాన్ని గడగడలాడించే వాళ్లు కూడా కాస్త అటూ ఇటూ చేస్తే పెళ్లాం ముందు గజగజలాడాల్సింది. ప్రస్తుతం ఒబామాది అదే సీన్. ఎనిమిదేళ్లు అమెరికా అధ్యక్షగిరి వెలగబెట్టారు సార్. రెండుసార్లు ప్రజల మనసును గెలుచుకున్నారు. ప్రపంచదేశాలను ఒక్క చూపుతో శాసించారు. కానీ మిచెలీ సంగతి మర్చిపోయారు. అదే ఇప్పుడు కొంపముంచింది. భర్త తనను సరిగా పట్టించుకోవడం లేదని మిచెలీ ఫీలైంది. దాంతో ఇద్దరి మధ్య క్రమంగా గ్యాప్ పెరిగింది. అది పూడ్చలేని స్థాయికి చేరింది. ఇప్పుడు ఇద్దరూ సరిగా మాట్లాడుకోవడం లేదు. కలిసి బయటకు కూడా రావడం లేదు. విడాకులు కూడా తీసుకున్నట్లు అమెరికా కోళ్లు KFCపై ఒట్టేసి మరీ కూస్తున్నాయి. పైకి ఆల్ ఈజ్ వెల్ అన్నట్లు ఒబామా సైలెంట్‌గా వ్యవహరిస్తున్నారు. మిచెలీ కూడా అలాంటిదేమీ లేదంటూ కవర్ చేస్తున్నారు.

విడాకులు తీసుకోలేదని చెబుతున్నా ఇద్దరి మధ్య దూరం చాలానే ఉందన్నది మాత్రం వాస్తవం. కొంతకాలంగా వీరిద్దరూ బయట కలిసి కనిపించడం లేదు. పాప దారి పాపదే.. బాబు దారి బాబుదే. హైప్రొఫైల్ ఈవెంట్స్‌కు కూడా బరాక్, మిచెలీ ఒబామాలు కలసి రాలేదు. చివరకు ట్రంప్ ప్రమాణస్వీకారానికి కూడా మిచెలీ రాలేదు. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు కూడా బరాక్ ఒక్కరే హాజరయ్యారు. దీంతో ఇద్దరూ డివోర్స్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. కొంతకాలం క్రితం మిచెలీ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. ఒబామా రాజకీయ ఆకాంక్షలు, వైట్‌హౌస్‌లో ఉన్న సమయంలో తమ వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావించారు మిచెలీ. తన భర్త పొలిటికల్‌గా బిజీగా ఉండటంతో తాను ఒంటరితనాన్ని అనుభవించాననని ఓ పుస్తకంలో రాశారు. ఒబామా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నాక కూడా ఆ ఇద్దరి మధ్య బంధం మళ్లీ బలపడనట్లే కనిపిస్తోంది.

విడాకుల వార్తలపై ఇద్దరూ చాలాకాలం మౌనంగానే ఉన్నారు. ఒబామా అలాంటిదేమీ లేదన్న సంకేతాలు ఇస్తూ వచ్చారు. రెండ్రోజుల క్రితం ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడిన మిచెలీ విడాకులు తీసుకోలేదని చెప్పారు. అదే సమయంలో ఓ మెచ్యూర్డ్ మహిళగా నా నిర్ణయాలు తీసుకోకూడదా అని ఎదురు ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతానికి విడాకుల వార్తలకు బ్రేక్ పడింది. అయితే దూరం లేదని మాత్రం మిచెలీ స్పష్టంగా చెప్పలేదు. అమెరికా అధ్యక్షుడికి ఎన్నో తలనొప్పులుంటాయి. ప్రపంచగతినే మార్చాల్సిన నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ ఎంతో కొంత టైమ్ ఫ్యామిలీకి కేటాయిస్తుంటారు. ట్రంప్ కూడా తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. కానీ బరాక్ మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకోవాలన్న తపనతో మిచెలీతో క్వాలిటీ టైమ్ గడపలేకపోయారు. ఆ కారణమే ఇన్నేళ్ల తన వివాహబంధాన్ని చిక్కుల్లో పడేసింది, ఫెవికాలతో అతికించినా అతకడం డౌటే అంటోంది అమెరికన్ మీడియా. అమెరికా ప్రజలు గెలిపిస్తే పవర్ వస్తుంది. అదే పెళ్లానికి కోపం వస్తే మన ఫ్యూజ్ ఎగిరిపోతుంది. మరి ఇంత చిన్న లాజిక్… అంత పెద్ద దేశానికి అధ్యక్షుడిగా చేసిన వ్యక్తి ఎలా మిస్సయ్యాడంటారు…!