Priyanka Gandhi : పాలమూరు జిల్లాకు ప్రియాంక గాంధీ.. “పాలమూరు ప్రజాభేరీ” తో భారీ బహిరంగ సభ
తెలంగాణ రాజకీయాలు ఎన్నికల వేళ తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినట్టే కనిపిస్తోంది.. ఈ నెల అక్టోబర్ 31న తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటిస్తారు..
తెలంగాణ రాజకీయాలు ఎన్నికల వేళ తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ వచ్చినట్టే కనిపిస్తోంది.. ఈ నెల అక్టోబర్ 31న తెలంగాణలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ పర్యటిస్తారు..
తెలంగాణ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మొదటగా కొత్త జిల్లా అయిన నారాయణ పేట్ జిల్లాలోని దేవరకద్రకు ప్రియాంక గాంధీ మధ్యాహ్నం చేరుకుంటారు. అక్కడ మహిళలతో సమావేశమై టీపీసీసీ ప్రకటించిన ప్రధాన మేనిఫెస్టో ఆరు గ్యారంటీల ప్రచారం చేయనున్నారు. తర్వాత సాయంత్రం 4:30 గంటలకు వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో పాలమూరు ప్రజా భేరీ సభలో ప్రసంగించనున్నారు.
కొల్లాపూర్ గడ్డపై “పాలమూరు ప్రజా భేరీ”
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ప్రధానంగా రాష్ట్రం చూపు మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గం పైనే ఉంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో “పాలమూరు ప్రజా భేరీ” బహిరంగ సభ జరగనుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ లో గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ లో చేరగా..కొన్ని విభేదాల వల్ల జూపల్లి కృష్ణారావు ఈమధ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. . గతంలో రెండు సార్లు వాయిదా పడ్డ ప్రియాంక గాంధీ పర్యటనను ఈసారి విజయవంతం చేయాలని చూస్తుననారు. పాలమూరు ప్రజాభేరి సభలో కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి పేరును అధికారింగా ప్రకటించనున్నారు ప్రియాంక గాంధీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ప్రియాంక గాంధీ పర్యటించడం ఇది రెండోసారి.
SURESH