FOUR TARGET : ఆ నలుగురిపై.. చతుర్ముఖ వ్యూహం

వై నాట్ 175 (Y Nat 175) లక్ష్యంగా ముందుకు సాగుతోన్న వైసీపీ (YCP)ఆ నాలుగు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న ఆ స్థానాల్లో దూకుడుగా వెళుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2024 | 10:24 AMLast Updated on: Apr 02, 2024 | 10:24 AM

On Those Four A Four Pronged Strategy

వై నాట్ 175 (Y Nat 175) లక్ష్యంగా ముందుకు సాగుతోన్న వైసీపీ (YCP)ఆ నాలుగు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కూటమి ముఖ్య నేతలు పోటీ చేస్తున్న ఆ స్థానాల్లో దూకుడుగా వెళుతోంది. విపక్ష నేతల్ని కట్టడి చేసేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ ఇదే.

ఎన్నికల వేళ ఏపీ రాజకీయం (AP Politics) వేడెక్కింది. ప్రధానపార్టీలు ప్రచార స్పీడ్ ని పెంచాయి. వైసీపీ (YCP) అధినేత, సీఎం జగన్ (CM Jagan) మేమంతా సిద్ధం పేరిట బస్సుయాత్ర కొనసాగిస్తున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల గెలుపే లక్ష్యంగా వైసీపీ పావులు కదుపుతోంది. అటు విపక్ష ముఖ్యనేతలు బరిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కుప్పం, మంగళగిరి (Mangalagiri), పిఠాపురం, హిందూపురంలో ఎన్నికల ప్రచారం మొదలు పోలింగ్ వరకు ప్రత్యేక దృష్టి పెట్టాలని డిసైడ్ అయింది. వైసీపీ వార్ రూమ్ నుంచి నిత్యం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలు, ఎన్నికల ప్రచార సరళపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది.

చంద్రబాబు పోటీలో ఉన్న కుప్పం, నందమూరి బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం, పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురం, నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గాలకు ముఖ్య నేతలు వెళ్లి ప్రచారం చేసేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే రీజినల్ కోఆర్డినేటర్లకు ఈ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని జగన్ సూచించారు. పార్టీ ఆదేశాలతో కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఇక లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో అందరు నేతలను ఒక తాటి పైకి తీసుకువచ్చారు రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి. మంగళగిరిలో ఎన్నికల ప్రచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అటు పిఠాపురంలో రీజినల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఎన్నికల బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే సామాజిక వర్గాలవారీగా సమావేశాలకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఇటు పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు ఆ నాలుగు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించేలా ఏర్పాట్లు చేస్తోంది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఫోకస్ చేయడం ద్వారా మంగళగిరి, గాజువాక, భీమవరంలో అనుకున్న ఫలితాలు వచ్చాయని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కుప్పం, హిందూపుం, పిఠాపురం, మంగళగిరి… ఈ నాలుగు నియోజకవర్గాల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతామని చెబుతున్నాయి.