లక్ష మంది ఇండియన్స్ సెల్ఫ్ డిపోర్ట్…!
ట్రంప్ మరోసారి మనోళ్ల గుండెల్లో నిద్రపోతున్నాడు... ఒకరు కాదు ఇద్దరు కాదు మరో లక్షమంది భారతీయుల మెడపై కత్తి పెట్టాడు. ఇన్నాళ్లూ పెరిగిన, చదివిన అమెరికాను వదిలి భారత్‌కు వెళ్లిపోవాల్సిన పరిస్థితిని సృష్టించాడు.

ట్రంప్ మరోసారి మనోళ్ల గుండెల్లో నిద్రపోతున్నాడు… ఒకరు కాదు ఇద్దరు కాదు మరో లక్షమంది భారతీయుల మెడపై కత్తి పెట్టాడు. ఇన్నాళ్లూ పెరిగిన, చదివిన అమెరికాను వదిలి భారత్‌కు వెళ్లిపోవాల్సిన పరిస్థితిని సృష్టించాడు. ఇంతకీ ఎవరీ డ్రీమర్లు…? వారికి వచ్చిన కష్టమేంటి..?అమెరికాలో మీకు సంబంధించిన వారి పిల్లలు ఎవరైనా ఉన్నారా…? తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిపోయారా…? అయితే వారంతా తిరిగి స్వదేశానికి తిరిగి రాక తప్పని పరిస్థితి. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానం వారి పాలిట శాపంగా మారింది. అమెరికానే మా లోకం అనుకున్న వారంతా ఇప్పుడు అది తమది కాదని అర్థమై అయోమయంలో పడిపోయారు. అంతగా పరిచయం లేదని భారత్‌కు తిరిగి వచ్చేయాల్సిన పరిస్థితి.
ఊహ తెలియని వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. అక్కడే చదివారు… అక్కడే పెరిగారు… అక్కడి సంస్కృతికి అలవాటు పడ్డారు. కానీ ఇప్పుడు ఇది మీ గడ్డ కాదు పొమ్మంటోంది ఆ దేశం… అమెరికాలో పెరిగిన భారతీయ యువత పరిస్థితి ఇది. వీరే డ్రీమర్లు… డెవలప్‌మంట్, రిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఏలియన్ మైనర్స్ బిల్లులోని పదాల మొదటి అక్షరాలే డ్రీమర్లుగా మారాయి. డిపెండెంట్ వీసాలపై ఇన్నాళ్లూ తమ తల్లిదండ్రులతో కలసి అక్కడే ఉండిపోయిన వారంతా ఇప్పుడు ఆ దేశాన్ని వదలాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులతో కలిసి డిపెండెంట్ వీసాలపై భారత్ నుంచి అమెరికా వెళ్లిన భారతీయ చిన్నారుల్లో లక్షా 34వేల మంది వీసా గడువు తీరిపోయింది. వారు తల్లిదండ్రులపై ఆధారపడే వయసు దాటిపోయారు.
దీంతో ఇప్పుడు వారంతా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. పిల్లలు తమ తల్లిదండ్రులతో కలసి అమెరికాకు వెళితే వారికి 21ఏళ్ల వయసు వచ్చేవరకు డిపెండెంట్ వీసా కింద వారితో ఉండొచ్చు. వీటినే H-4 వీసాలంటారు. ఇలా డిపెండెంట్ వీసా గడువు ముగుస్తున్న భారతీయ యువత సంఖ్య లక్షా 34వేలుగా ఉందని తేలింది. ఇప్పుడు వారి ముందున్న ప్రత్యామ్నాయ మార్గం ఉన్నత చదువుల కోసం F-1 వీసాను పొందాలి. పిల్లల తల్లిదండ్రులు గ్రీన్‌కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నా అది తేలడానికి కొన్ని దశాబ్దాలు పట్టేలా ఉంది.
అమెరికాకు మైనర్లుగా వచ్చి మేజర్లుగా మారి వీసా కోసం ప్రయత్నించే వారిని డాక్యుమెంట్ డ్రీమర్స్ అని పిలుస్తారు. 21 ఏళ్లు ముగియగానే మరో వీసా పొందడం కోసం వీరికి రెండేళ్ల సమయం ఇస్తారు. అయితే ట్రంప్ గెలిచాక వీసా నిబంధనలు మారాయి. కోర్టులు కూడా వీరికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి. ఇవి లక్షల మందిని సెల్ఫ్ డిపోర్టేషన్ దిశగా నడుపుతున్నాయి. ఇటీవల అమెరికా కోర్ట్ ఒకటి DACA ప్రోగ్రామ్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో వారి భవిష్యత్తు మరింత అయోమయంగా మారింది. 2012లో ఒబామా ప్రభుత్వం డిపెండెంట్ వీసా గడువు ముగిశాక వారికి రెండేళ్ల ఊరటను కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం లక్షల మందికి మేలు చేసింది. డ్రీమర్ల బిల్లు ఆమోదం పొందకపోవడంతో దానికి తాత్కాలిక ఊరటగా రెండేళ్ల మినహాయింపు ఇచ్చారు. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చాక దానికి మంగళం పాడుతున్నారు. అంటే 21ఏళ్ల వయసు ముగిసేసరికి మరో వీసా సంపాదించి ఉండాలి లేదా దేశాన్ని వీడాలి.
నెలల చిన్నారిగా అమెరికా వెళ్లి అక్కడే 21 ఏళ్లు గడపిన వారిని ఇప్పుడు మీరు ఈ దేశంవారు కాదు వెళ్లిపొమ్మంటుంటే వారి బాధ అంతా ఇంతా కాదు. వారికి అమెరికా తప్ప ఏం తెలియదు.. చదువు, భాష, స్నేహితులు అంతా అక్కడే… ఇప్పుడు వారు పరాయివారైపోయారు. భారత్ వారి స్వదేశమే అయినా వారు ఇక్కడ గడిపింది తక్కువ. చుట్టపు చూపుగా రావడమే. అంటే వారికి భారత్ పరాయిదేశామే. ఇప్పుడు వారంతా ఇక్కడకు వచ్చి బతకాలంటే అంత ఈజీ కాదు. ఓ నివేదిక ప్రకారం సుమారు 11లక్షల మంది భారతీయులు ఎంప్లాయిమెంట్ బేస్డ్ గ్రీన్‌కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నారు. EB-2, EB-3 కేటగిరీల్లో ప్రాసెసింగ్‌కు 134 ఏళ్ల సమయం చూపిస్తోంది. అంటే వారికి జీవితకాలంలో గ్రీన్‌కార్డ్ రాదన్నమాట. ఇంకొంతమంది పరిస్థితి అయితే మరీ దారుణం. తల్లిదండ్రులు ఇద్దరికీ H1B వీసాలుంటాయి. కానీ వీరికి మాత్రం ఏ వీసా ఉండదు. అంటే అమ్మనాన్న అమెరికాలో ఉంటారు. కానీ వీళ్లు వారిని వదిలి భారత్‌కు వచ్చేయాలి.
డ్రీమర్స్ అందరికీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది F1 స్టూడెంట్ వీసా. కానీ అది చాలా ఇబ్బందులతో కూడుకున్నది. వారంతా విదేశీ విద్యార్థుల కిందనే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వారికి ఇన్ స్టేట్ ట్యూషన్, స్కాలర్‌షిప్, ప్రభుత్వ సాయం అందదు. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాలి. అది ఆర్థికంగా భారంగా మారుతుంది. చాలా కుటుంబాలు వాటిని భరించే స్థాయిలో లేవు. కొంతమంది విద్యార్థులు ప్రత్యామ్నాయంగా కెనడా, యూకే వంటి దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికాతో పోల్చితే ఇమ్మిగ్రేషన్ విధానం అక్కడ కాస్త ఫ్రీగా ఉంది. ఇప్పటికిప్పుడు కోర్టులకు వెళదామన్నా ఊరట దక్కుతుందన్న ఆశలు లేవు. అటు ట్రంప్ ప్రభుత్వం కఠినంగా ఉంది. దీంతో పరిస్థితులకు తలొగ్గి పోవడం మినహా మరో రూట్ వారికి కనిపించడం లేదు. అమెరికాలోనే ఉండాలన్న డ్రీమ్… డ్రీమర్లకు డ్రీమ్‌గానే మిగిలేలా కనిపిస్తోంది.