మా బిడ్డ సేఫ్.. మార్క్ శంకర్ ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..

సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ కుర్రాడు ప్రస్తుతం ఎలా ఉన్నాడు అంటూ అందరూ ఆరా తీస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2025 | 07:58 PMLast Updated on: Apr 10, 2025 | 7:58 PM

Our Child Is Safe Chiranjeevis Tweet On Mark Shankars Health

సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ కుర్రాడు ప్రస్తుతం ఎలా ఉన్నాడు అంటూ అందరూ ఆరా తీస్తున్నారు. ఈ సమయంలో స్వయంగా చిరంజీవి తమ బిడ్డ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేశారు. ఆయన ఏమని ట్వీట్ చేశారో ఒకసారి చూద్దాం.. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.

రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు @PawanKalyan తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అంటూ తన ట్విట్ లో పేర్కొన్నారు చిరంజీవి. తమ బిడ్డ కోసం ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు మెగాస్టార్. ప్రస్తుతానికి మార్క్ శంకర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లోడి ఆరోగ్యం పూర్తిగా సెట్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పారు వైద్యులు.