చైల్డ్ ఆర్టిస్ట్ కి ఎక్కువ…. జూనియర్ ఆర్టిస్ట్ కి తక్కువ..

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఓవర్‌ యాక్షన్‌ మామూలుగా లేదు. పావలా చేయమంటే రూపాయి పావలా అతితో ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడు కౌశిక్. సొంత పాపులారిటీ కోసం కౌశిక్ రెడ్డి చేస్తున్న కక్కుర్తి పనులు ,...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 14, 2024 | 01:10 PMLast Updated on: Sep 14, 2024 | 1:10 PM

Padi Kaushik Reddy Over Action Troubles Brs

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఓవర్‌ యాక్షన్‌ మామూలుగా లేదు. పావలా చేయమంటే రూపాయి పావలా అతితో ఎక్స్‌ట్రాలు చేస్తున్నాడు కౌశిక్. సొంత పాపులారిటీ కోసం కౌశిక్ రెడ్డి చేస్తున్న కక్కుర్తి పనులు ,… వేస్తున్న జూనియర్‌ ఆర్టిస్ట్‌ వేషాలతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో పడింది. ఎప్పుడో మర్చిపోయిన ఆంధ్ర, తెలంగాణ ప్రస్తావనను ఇప్పుుడు తీసుకొచ్చి మళ్లీ అగ్గిరాజేసి ఏకంగా పార్టీ నే సంక్షోభంలో పడేశాడు కౌశిక్.

పాడి కౌశిక్‌ రెడ్డి… బీఆర్‌ఎస్‌ హుజూరాబాద్‌ ఎమ్మెల్యే…. పేరుకు ఎమ్మెల్యే అయినా… ఇతగాడి అతి చేష్టలు చూసి పార్టీలోనే చాలామంది సూసైడ్‌ స్టార్‌ అని పిలుస్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కౌశిక్ చేసిన ఓవర్‌ యాక్షనే అందుకు కారణం అంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా… మీరు గెలిపించకుంటే… కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ… ఓ వీడియో రిలీజ్‌చేసి ఓటర్స్‌ని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేశారన్న ఆరోపణలు మీద ఉన్నాయి. భార్యా , కూతురు తో కలిసి చేసిన ఆ వీడియో పుణ్యమో లేక మరో కారణమోగానీ… ఎట్టకేలకు ఎమ్మెల్యే అయ్యారు కౌశిక్. ఇక అప్పట్నుంచి ఇతగాడి అతికి అడ్డేలేకుండా పోయింది. ఏం మాట్లాడినా… ఏ పని చేసినా… పబ్లిసిటీ యావ తప్ప పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ అస్సలు ఉండదు. రాజకీయ ఉనికి కోసం హడావిడి చేసే వాళ్ళని చూశాంగానీ… ఇంత అతి గాడిని మాత్రం ఎప్పుడూ చూడలేదు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని ఉద్దేశించి చేసిన నాన్‌ లోకల్‌, ఆంధ్రా వ్యాఖ్యల్ని అయితే బీఆర్ఎస్‌ నేతలే అసహ్యించు కుంటున్నారు . తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి ఆ తరహా మాటలు వాడారే తప్ప విద్వేషంతోకాదని, అంతా ముగిసిపోయి పదేళ్ళు మనం అధికారంలో ఉన్నాక మళ్ళీ ఆంధ్రా, తెలంగాణ మాటలేంటి? ఇతగాడికి మతిగాని పోయిందా అంటూ గులాబీ నేతలే మాట్లాడు కొంటున్నారు. ఈ సమయంలో ఇలాంటి వ్యాఖ్యల వల్ల బి ఆర్ ఎస్ కి నష్టమే తప్ప వీసమెత్తు లాభం కూడా లేదు. కౌశిక్‌ రెడ్డి కేవలం తన సొంత డబ్బా కొట్టుకోవడం కోసం పార్టీ ప్రయోజనాల్ని పణంగా పెడుతున్నాడు. బీఆర్‌ఎస్‌లో మెజార్టీ నాయకుల క అభిప్రాయం కూడా ఇదే. కౌశిక్ ఓవరాక్షన్ చూసిన పార్టీ పెద్దలు కూడా చేసిన వోవర్‌ యాక్షన్‌ చాలు, ఇక నోరు మూసుకోమని కౌశిక్ రెడ్డికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో… హైదరాబాదులో సీమాంధ్ర ఓట్లు కీలకంగా ఉండే చోట ఈ సెగా స్టార్‌ ఇలా ఓవర్‌యాక్షన్‌ చేసి పార్టీని నిండా ముంచేట్టు ఉన్నాడని కూడా మాట్లాడుకుంటున్నా రూ. ఇదే సమయంలో అసలు శేర్లింగంపల్లి లో అరికెపూడి గాంధీకి బీ ఫామ్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ అధినాయకత్వమే కదా? పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నది బి ఆర్ ఎస్ లోనే కదా. అప్పుడు గుర్తుకు రాలేదా ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్‌, అసలు గొడవలన్నీ సమసిపోయి… అందరూ కలిసి హాయిగా బతుకుతున్న సమయంలో ఇలాంటి రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు ఎందుకన్నది బీఆర్‌ఎస్‌లో చాలామంది నేతలు వాదన. అసలు కౌశిక్ రెడ్డి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? అయినదానికి, కాని దానికి ఓ… తెగ పూసేసుకుని వ్యవహారాన్ని ఎందుకు కంపు కంపు చేస్తున్నారంటూ ఆరా తీస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. కౌశిక్ అనేవాడి అతి , ఓవరాక్షన్ అంతా భవిష్యత్‌ రాజకీయానికి పునాది కోసమే. ఇలా ప్రతిదానికి తెగ రియాక్ట్ అయిపోయి….. నాయకత్వం దృష్టిలో ఉంటూ… ఏకంగా హరీష్ రావు, కేటీఆర్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాలన్నది ఇతగాడి ప్లాన్. ఇక బీఆర్‌ఎస్‌ ఎప్పుడు అధికారంలోకి వస్తే… అప్పుడు మంత్రి పదవి కూడా కొట్టేయాలన్నది కౌశిక్ హిడెన్‌ అజెండా. అయితే… తన పర్సనల్‌ అజెండా కోసం పార్టీ ప్రయోజనాల్ని తాకట్టుపెడితే… చివరికి మునిగేది ఎవరో ఈ చైల్డ్ కం జూనియర్‌ ఆర్టిస్ట్‌ తెలుసుకోవాలన్నది బీఆర్‌ఎస్‌ సీనియర్స్‌ అభిప్రాయం.

గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపిస్తానంటూ కౌశిక్ అన్న మాటలు పొలిటికల్ సెగలు రేపుతున్నాయి. మహిళలను అవమానించే రీతిలో ఉన్నాయంటూ కాంగ్రెస్ ఉమన్‌ వింగ్‌ నేతలు రివర్స్‌ అవడంతో బీఆర్ఎస్‌ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. వివిధ వర్గాల మహిళల నుంచి కూడా అభ్యంతరాలు రావడంతో కౌశిక్‌ మాటలు బూమరాంగ్‌ అయ్యాయి. ఈ సందర్భంగా అసలు బీఆర్‌ఎస్‌ నాయకులకు మహిళల పై ఉన్న అభిప్రాయం, చులకన భావం అంటూ చర్చ మొదలవడం కూడా బీఆర్‌ఎస్‌కు ఇబ్బంది కరంగా మారింది. కౌశిక్‌ అతి వాగుడు తో ,ఆ మధ్య మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో కేటీఆర్‌ అన్న మాటల్ని కూడా మరోసారి లాగుతున్నారు. రెండు సందర్భాలను కలిపి మాట్లాడుతూ… అసలు గులాబీ పార్టీ నాయకులకు మహిళలంటే కనీస గౌరవం ఉందా? అని మాట్లాడుకోవడం ఇరుకున పెడుతోందట పార్టీ వర్గాలను. ఉచిత బస్సు ప్రయాణంపై చేసిన వ్యాఖ్యలకు స్వయంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంటే క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి.

ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎపిసోడ్‌లో ఇప్పటివరకు బీఆర్ఎస్‌దే పైచేయి . కోర్టు ఆదేశాల తర్వాత పార్టీలో కూడా భరోసా పెరిగింది. కానీ… కౌశిక్ రెడ్డి ….అరికెపూడి గాంధీ పై వ్యక్తిగత విమర్శలు చేయడం, అదే ఊపులో చీర, గాజుల ప్రస్తావన తీసుకురావడంతో మొత్తం వ్యవహారం ఒక్కసారిగా తల్లకిందులైంది. కౌశిక్ మాటలు కచ్చితంగా పార్టీకి నష్టం చేసేవే అన్నది గులాబీ పార్టీలో టాప్‌ టు బాటమ్‌ ఉన్న అభిప్రాయం.ఈ క్రమంలోనే ఓ విషయం బీఆర్‌ఎస్‌ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. చీర, గాజుల వ్యాఖ్యల తర్వాత ఫామ్‌ హౌస్‌ నుంచి కౌశిక్‌ రెడ్డికి కాల్‌ వచ్చిందని, అసలు సోయిలో ఉండే మాట్లాడుతున్నావా అంటూ… రెడ్డికి ఫోన్లోనే చివాట్లు పెట్టారు. కొన్ని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుని కంపు చేయవద్దని కూడా స్ట్రాంగ్‌గా వార్నింగ్‌ ఇచ్చినట్టు మాట్లాడుకుంటోంది కేడర్‌. అదే సమయంలో తన వ్యక్తిగత పాపులారిటీ, అధిష్టానం దృష్టిలో హీరో ఇమేజ్‌ కోసం కౌశిక్‌ ఈ మధ్య ప్రతి విషయంలో వోవర్‌గా రియాక్ట్‌ అవుతున్నారన్న విషయం అందరికీ అర్థమైంది. ఇక ఛాలెంజ్ ఎపిసోడ్‌లో ఎమ్మెల్యే అరికెపుడి గాంధీని ఉద్దేశించి కౌశిక్‌రెడ్డి చేసిన నాన్‌ లోకల్‌, ఆంధ్రా వ్యక్తి కామెంట్స్‌ కూడా పార్టీని డ్యామేజ్‌ చేశాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో… సీమాంధ్ర ఓట్లు కీలకంగా ఉండే చోట కౌశిక్ వ్యాఖ్యల ఎఫెక్ట్‌ పడుతుందన్న చర్చ సైతం జరుగుతోంది గులాబీ వర్గాల్లో. ఇదే సమయంలో అసలు గాంధీకి బీ ఫామ్‌ ఇచ్చింది బీఆర్‌ఎస్‌ అధినాయకత్వమే కదా? అప్పుడు గుర్తుకు రాలేదా ఆంధ్రా, తెలంగాణ ఫీలింగ్‌, అసలు గొడవలన్నీ సమసిపోయి… అందరూ కలిసి హాయిగా ఉంటున్న టైంలో ఇలాంటి రెచ్చగొట్టుడు వ్యాఖ్యలవల్ల నష్టమే తప్ప వీసమెత్తు ప్రయోజనం ఉంటుందా అని కూడా కుంటున్నాయి టిఆర్ఎస్ వర్గాలు. మొత్తంగా కౌశిక్‌ ఎపిసోడ్‌ ఎట్నుంచి ఎటు నష్టం చేస్తుందోనన్న టెన్షన్‌ బీఆర్‌ఎస్‌ వర్గాల్లో పెరుగుతోంది . ఈ అతిగాడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కువ జూనియర్ ఆర్టిస్ట్ కి తక్కువ అని చెప్పుకుంటూ బి ఆర్ ఎస్ నేతలే బహిరంగంగా నవ్వుకుంటున్నారు.