Padi Kaushik Reddy: అనర్హత వేటు తప్పదా.. కౌశిక్‌ రెడ్డి మీద ఈసీకి ఫిర్యాదు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా కుటుంబంతో కలిసి ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డి. ఆ ప్రచారంలో ఓట్లు అడిగే క్రమంలో.. తనను గెలిపించకుంటే హుజురాబాద్‌లో తన శవయాత్ర చూస్తారు అంటూ ఓటర్లకు చెప్పారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2023 | 05:42 PMLast Updated on: Dec 14, 2023 | 5:42 PM

Padi Kaushik Reddy Will Face Disqualification In Assembly

Padi Kaushik Reddy: ఏదో ఒక ఇష్యూతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి. తనను గెలిపించకుంటే కుటుంబంతో సమా ఆత్మహత్య చేసుకుంటానని ప్రచారంలో చెప్పి తిప్పలు పడ్డారు. ఇప్పుడు అదే ఇష్యూ మరోసారి కౌశిక్‌ మెడకు చిక్కుకుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఎమ్మెల్యేగా అనర్హుడు అంటూ మట్టి మనిషి అనే ఫౌండేషన్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే కౌశిక్‌ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేసింది.

Padi Kaushik Reddy: అసెంబ్లీలో కౌశిక్‌ రెడ్డి కూతురు అత్యుత్సాహం.. షాకైన సీఎం రేవంత్‌ రెడ్డి..

భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు మట్టి మనిషి ఫౌండేషన్‌ సభ్యులు. దీనిపై ఈసీ నుంచి ఎలాంటి రియాక్షన్‌ వస్తుంది అనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా ఎన్నికల ప్రచారంలో భాగంగా కుటుంబంతో కలిసి ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డి. ఆ ప్రచారంలో ఓట్లు అడిగే క్రమంలో.. తనను గెలిపించకుంటే హుజురాబాద్‌లో తన శవయాత్ర చూస్తారు అంటూ ఓటర్లకు చెప్పారు. ఈ విషయంలో ఈసీ కూడా సీరియస్‌ అయ్యింది. ఇలాంటి కామెంట్లు చేయడం ఓటర్లను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేయడమే అంటూ సీరియస్‌ అయ్యింది.

ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ కౌశిక్‌ రెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇప్పుడు ఇదే వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది మట్టిమనిషి ఫౌండేషన్‌. మరి ఈసీ నుంచి ఈసారి ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుంది అనేది వేచి చూడాలి.