వంకర పద్మాలు….దారితప్పిన అవార్డులు
పద్మ అవార్డులు అంటే దేశం లోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు. అనేక రంగాల్లో ప్రతిభావంతులకు, సామాజిక సేవ చేసిన వాళ్ళకి ఇచ్చే పద్మ అవార్డులు నిజానికి ఎప్పుడో దారి తప్పాయి. కాంగ్రెస్ హయాం లో ఈ అవార్డుల ప్రకటన మరీ దారుణంగా ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాస్త పద్దతి మార్చింది.
పద్మ అవార్డులు అంటే దేశం లోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులు. అనేక రంగాల్లో ప్రతిభావంతులకు, సామాజిక సేవ చేసిన వాళ్ళకి ఇచ్చే పద్మ అవార్డులు నిజానికి ఎప్పుడో దారి తప్పాయి. కాంగ్రెస్ హయాం లో ఈ అవార్డుల ప్రకటన మరీ దారుణంగా ఉండేది. బీజేపీ అధికారంలోకి వచ్చాక కాస్త పద్దతి మార్చింది. అన్ సంగ్ హీరోస్ అనే క్యాటగారీ పెట్టి గుర్తింపు లేకుండా, ఎక్కడో మూలన పడి ఉన్న వారిని వెలికి తీసి వారికి పద్మశ్రీ ద్వారా గుర్తింపు ఇస్తోంది కేంద్రం. దీంతో జనమంతా శభాష్ అన్నారు. ఇన్నాలు గుర్తింపు లేనివాళ్ళని ఇన్నాళ్ళకి గుర్తించారు అని జనం చంకలు గుద్దుకున్నారు. ఏమైనా బీజేపీ వాళ్ళు కదా. వాళ్ళ వ్యూహాలే వేరుగా ఉంటాయి. Toli జాబితాలో అన్సంగ్ పర్సన్స్ కి అవార్డ్స్ ఇచ్చిన తరవాత తమకి కావలిసిన వారికి అవార్డ్స్ ఇచ్చుకుంటున్నారు. ఐతే వీటిపై జనం దృష్టి పడక పోవడం తో ఏడా పేడా కావలిసిన వారికి ఇచ్చేసుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళకే మళ్లీ మళ్లీ అవార్డులు పంచిపెడుతున్నారు. అసలు అర్హత లేని వాళ్లకు, వివాదాస్పద వ్యక్తులకు పద్మ అవార్డ్స్ ఇచ్చి కాంగ్రెస్ కి బీజేపీ కి పెద్ద తేడా లేదనిపించారు. ఈ ఏడాది అవార్డ్స్ చూస్తే అలాగే అనిపిస్తుంది.
అన్నిటికంటే వివాదాస్పద అవార్డు. నటుడు బాలకృష్ణ కి పద్మవిభూషణ్ ప్రకటించడం. ఆసలు ఏ ప్రతిపదకన బాలయ్య కి పద్మ భూషణ్ ఇచ్చారో అర్ధం కాదు. ఇటీవలే విడుదలైన డాకు మహరాజ్ సినిమాలో ఐటెంగర్ల్ వెనుక నుంచి ఆమె మొత్త పై అసహ్యంగా బాదుతూ, చండాలమైన స్టెప్పులు వేస్తూ సాగిన దబిడి దిబిడే పాటలో బాలకృష్ణ ప్రతిభ కి ఇది గుర్తింపు అనుకోవాలి. ఏపీ లో కూటమి సర్కార్ ఏర్పడటం తో, బహుశా ఆ కోటా కింద బాలయ్య కి పద్మ భూషణ్ ఇచ్చి ఉండవచ్చు. 2004 జూన్ లో బాలయ్య తన ఇంట్లో ఇద్దరి పై కాల్పులు జరిపారు. ఆ ఇద్దరు బతికి బయట పడ్డారు. సాక్ష్యాలు లేవని కింది కోర్టులో కేసు కొట్టేశారు. అయితే ఇప్పటికీ ఆ కేసు ఏమైందో తెలియదు. కాల్పులు నిజం. పిస్టల్ బాలయ్య దే. జరిగింది ఆయన ఇంట్లోనే. కానీ ఎవరు కాల్చారో తెలియదు. జైలు మెట్లు ఎక్కకుండా బాలకృష్ణ ఆ కేసు నుంచి బయట పడ్డాడు. కానీ ఆ కాల్పులు ఎవరు జరిపారో జనం అందరికీ తెలుసు కోర్టులకి తప్ప.
ఆ తరవాత బాలయ్య ఇంట్లో సెక్యూరిటీ గార్డు హత్య జరిగింది. అది అంతే. ఆ కేసు తేలలేదు. మన దేశం లో న్యాయం ఎంత అన్యాయంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ రెండు కేసులు చాలు. ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపు అయినా చేయాలి అని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తికి పద్మ భూషణ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమో కేంద్రమే ఆలోచించాలి.
ఏపీలో కూటమి సర్కారు ఉంది కనుక, కూటమి లో కీలక పాత్ర పోషించే టిడిపిని ఎప్పటికప్పుడు సంతృప్తి పరచాలి కనుక రాష్ట్ర ప్రభుత్వం రికమండేషన్ పై బాలకృష్ణకు పద్మభూషణ ఇచ్చేసి ఉంటారు. అంతే తప్ప ఆయనపై మర్డర్ కేసులు ఉన్నాయా?, ఆయన భాష ఎలా ఉంటుంది,? ఆయన సినిమాలు ఎంత జూగుప్సాకారంగా ఉంటాయి? ….ఇవన్నీ అనవసరం అనుకున్నట్లు ఉంది కేంద్రం. భారతరత్న నా కాలు గోటితో సమానం అన్న పెద్దమనిషి ఇప్పుడు పద్మభూషణ్ కాళ్ళతో అందుకుంటాడా , చేత్తో అందుకుంటాడో చూడాలి. ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వకుండా, బాలకృష్ణకి పద్మ భూషణ్ తో సరిపెట్టేశారు బిజెపి వాళ్లు.
ఇక డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి. దేశంలో ప్రధానులు, రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు ,ముఖ్యమంత్రు లు, గవర్నర్లకు ఆయనే వైద్యుడు.ఉదర సంబంధిత వ్యాధులపై డాక్టర్ నాగేశ్వర రెడ్డి చేసిన పరిశోధనల ను కచ్చితంగా ప్రశంసించాల్సిందే. కానీ డాక్టర్ నాగేశ్వర రెడ్డికి అవార్డులు కొత్త కాదు. ప్రతి ఏటా చాలా అవార్డులు వస్తూనే ఉన్నాయి. ఆయనకు పద్మభూషణ్ ఇచ్చి ఎన్నాళ్ళు కాలేదు. వెంటనే పద్మ విభూషణ్ అవార్డు ఇప్పించి కేంద్రంలో కొందరు పెద్దలు స్వామి భక్తి చాటుకున్నారు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి తో పాటు దేశంలో ఇంకా చాలామంది ప్రముఖ వైద్యులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. వాళ్లను కూడా గుర్తిస్తే బాగుండేది. అవార్డులు ఇచ్చిన వారికి మళ్ళీ మళ్ళీ ఇచ్చి మిగిలిన వాళ్ళను తక్కువ చేయడం కాదు.
ఇక మాడుగుల నాగఫణి శర్మ. ఈ సహస్ర అవధానిపై 20 ఏళ్ల క్రితం అమెరికాలో పెద్ద వివాదమే రేగింది. బాలికపై లైంగిక వేధింపులు
ఆరోపణలు ఎదుర్కొన్నారు నాగ ఫణి శర్మ. హైదరాబాదులో అత్యంత ఖరీదైన భూమిని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు నాగఫణి శర్మకు కట్టబెట్టారు. సరస్వతీ పీఠం పేరుతో కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని అనుభవిస్తున్నారు నాగఫణి శర్మ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్దలతో అంటకాగడమే కాక, వాళ్లకు రహస్య పూజలు చేస్తూ ఉంటాడని నాగఫణి శర్మకు పేరు. బహుశా అందుకే అన్ని వివాదాలు ఉన్నా ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చేశారు.
ఇక మందకృష్ణ మాదిగ సోషల్ కంట్రిబ్యూషన్ ఏమిటో కేంద్రమే వివరణ ఇవ్వాలి. మాదిగ హక్కుల పోరాట సమితి పేరుతో చాన్నాళ్లుగా మాదిగ రిజర్వేషన్లలో విభజన కోసం పోరాడుతున్నాడు మంద కృష్ణ మాదిగ.
బహుశా మందకృష్ణ మాదిగ కు పద్మశ్రీ ఇవ్వడం ద్వారా ఆ సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవచ్చు అని బిజెపి భావించి ఉండవచ్చు.
ఇక తెలంగాణ విషయానికొస్తే…. రాష్ట్ర ప్రభుత్వం రికమండు చేసిన ఎవరికి అవార్డ్స్ ఇవ్వకపోవడం అన్యాయం. సరే గద్దర్ అంటే ఆయన మావోయిస్టులతో కలిసి ఉన్నాడు…. పోలీసు లెక్కల ప్రకారం సంఘ వ్యతిరేక శక్తి కనక ఆయనకు ఇవ్వకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అసలు పద్మశ్రీకే అర్హులు లేరు అనుకుంటే ఎలా?
ఎంతోమంది ప్రతిభావంతులు, సోషల్ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. కానీ వాళ్లని వదిలేసి కేవలం పొలిటికల్ రికమండేషన్ పైనే ఆధారపడి, ఎటువంటి పరిశోధన చేయకుండా… ప్రజల్లోకి వెళ్లకుండా, తెలుసుకోకుండా ఇచ్చే అవార్డులను ఎవరు పట్టించుకుంటారు.? నిజానికి చాగంటి కోటేశ్వరావు అనే వ్యక్తి హైందవ ధర్మంతో పాటు సామాజిక జీవన విధానాన్ని కూడా ప్రచారం చేస్తున్న వ్యక్తి. ఈనాటి వరకు చిన్న వివాదం గాని, ఆరోపణ గాని లేని వ్యక్తి. ఆయనకు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రానికి ఎందుకు అనిపించలేదో? నటుడు బాలకృష్ణ తో పోలిస్తే చాగంటి చేయ లేనిదొక్కటే ….అది dదబిడి దిబిడి స్టెప్స్ వేయలేకపోవచ్చును. పొలిటికల్ రికమండేషన్ లేకపోవచ్చు. అందుకే దేశంలో పద్మా అవార్డులపై జనానికి ఆసక్తి పోయింది. పద్మ అవార్డులో రాజకీయ జోక్యం, పొలిటికల్ రికమండేషన్లు స్పష్టంగా కనిపిస్తున్నంతకాలం అవి అందుకున్న వాళ్ళకి సంతోషమే తప్ప…. ప్రజల్లో వాళ్ళకి నిజమైన గుర్తింపు మాత్రం రానే రాదు.