పద్మ విభూషణ్…మన్మోహన్ సింగ్, ప్రజా జీవితంలో అనేక పురస్కారాలు

మాజీ ప్ర‌ధాని మన్మోహన్ సింగ్...ప్రొఫెసర్, ఆర్థిక సలహదారు...ఆర్థికవేత్త...ప్రధాన మంత్రి...ఇలా చెప్పుకుంటూ పోతే...చాలానే ఉన్నాయి. జాబితా చాంతాడంత ఉంటుంది. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన మన్మోహన్ సింగ్...ఎన్నో విజయాలు సాధించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2024 | 11:19 AMLast Updated on: Dec 27, 2024 | 11:19 AM

Padma Vibhushan Manmohan Singh Many Awards In Public Life

మాజీ ప్ర‌ధాని మన్మోహన్ సింగ్…ప్రొఫెసర్, ఆర్థిక సలహదారు…ఆర్థికవేత్త…ప్రధాన మంత్రి…ఇలా చెప్పుకుంటూ పోతే…చాలానే ఉన్నాయి. జాబితా చాంతాడంత ఉంటుంది. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన మన్మోహన్ సింగ్…ఎన్నో విజయాలు సాధించారు. ఆర్థిక రంగ నిపుణుడిగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, యునియన్ గ్రాంట్ కమిషన్ గా చెరగని ముద్ర వేశారు.

మాజీ ప్ర‌ధాని మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు కూడా. ఆయన అనేక గొప్ప రచనలు చేశారు. ఇండియాస్ ఎక్స్‌పోర్ట్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్టస్ ఫర్ సెల్ఫ్-సస్టైన్‌డ్ గ్రోత్ అనేక పుస్తకాన్ని రచించారు. అనేక ఆర్థిక జర్నల్స్ కోసం అనేక ఆర్టికల్స్ రాశారు. భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా…ఈ పుస్తకం గుర్తించబడింది. తన అకడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మక డెల్హీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో పని చేసిన సమయంలో…ఆర్థిక నైపుణ్యలను పెంచుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో, అంతర్జాతీయ సంస్థలలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు.

డాక్టర్ మన్మోహన్ సింగ్…చివరి దాకా నిరాడంబర జీవితాన్ని గడిపారు. ప్రజా జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు. 1987లో దేశ రెండో అత్యున్నత పురస్కారం…పద్మ విభూషణ్ అవార్డు వరించింది. 1995లో జవహర్ లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం అందుకున్నారు. 1993-1994 సంవత్సరానికి ఆసియా మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, 1993లో యూరో మనీ అవార్డు ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, యూనివర్సిటీ ఆఫ్ కేమ్బ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ మన్మోహన్ సింగ్ ను వరించాయి. సెంట్రల్ లండన్ లోని సెంట్ జాన్ కాలేజ్ ప్రదర్శనలో ప్రఖ్యాతి రైట్ ప్రైజ్ కూడా ఆయన సొంతమైంది. వివిధ దేశాల అత్యున్నత పురస్కారాలు కూడా ఆయన్ను వరించాయి. 2017లో ఇందిరా గాంధీ బహుమతి అందుకున్నారు.

1972-74 వరకు ఇంటర్నేషనల్ మానిటరీ ఫోరమ్ …భారత డిప్యూటీ కమిషనర్ గా పని చేశారు. 1977-79 వరకు ఎయిడ్-ఇండియా కన్సార్టియమ్ సమావేశాలకు భారత రాయబారి వెళ్లారు. 1980-82 ఇండో-సోవియట్ జాయింట్ ప్లానింగ్ గ్రూప్ మీటింగ్ కు నాయకత్వం వహించారు. 1982లో ఇండో-సోవియట్ మానిటరింగ్ గ్రూప్ సమావేశాల్లో పాల్గొన్నారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్న్మెంట్ మీటింగ్, 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్‌కు ఆయన నాయ‌క‌త్వం వ‌హించారు.