ఏపీలో అలజడి: చిరుత పులి కాళ్ళను నరికి క్షుద్ర పూజలు,
ఓ వైపు చిరుతలు అంతరించిపోయాయని విదేశాల నుంచి దేశానికి ప్రత్యేక విమానాల్లో తెస్తుంటే ఏపీలో మాత్రం చిరుతలను వేటాడి చంపుతున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిరుతల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఓ వైపు చిరుతలు అంతరించిపోయాయని విదేశాల నుంచి దేశానికి ప్రత్యేక విమానాల్లో తెస్తుంటే ఏపీలో మాత్రం చిరుతలను వేటాడి చంపుతున్నాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిరుతల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వేటగాళ్ళ దెబ్బకు చిరుత పులులు చనిపోవడం పట్ల అధికారులపై ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతోంది. విద్యుత్ తీగలు, ఉచ్చులు, నాటు తుపాకులతో వన్యప్రాణులను స్మగ్లర్లు… వాటితో వ్యాపారం భారీ స్థాయిలో చేస్తున్నారు.
యాదమరి మండలంలో తాజాగా ఓ చిరుతను కాల్చి చంపారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే విషయం తెలిసింది. కౌడిన్య అభియారణ్యం ప్రాంతంలో వన్యప్రాణుల ఎక్కువగా వేటాడుతున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు… బంగారుపాలెం, యాదమరి, తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతాల్లో వన్య ప్రాణుల వేట పై ఫారెస్ట్ అధికారులు నిఘా పెట్టి అసలు చంపిన చిరుతలను ఏం చేస్తున్నారని కూపీ లాగారు.
వన్యప్రాణుల మాంసాన్ని తమిళనాడులో విక్రయిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఈ మాంసానికి భారీ డిమాండ్ ఉందని అధికారులు గుర్తించారు. కౌండిన్య అటవీప్రాంతంలో దాదాపు 5 కు పైగా చిరుతపులను వేటాడి, వాటి మాంసం, చర్మం, గోర్లు తీసుకుని మిగిలిన భాగాలను పూడ్చిపెట్టారు. చిరుతల గోర్లు, కోరల కోసమే ముందు వేటాడుతున్నట్టు భావించినా… చిరుతల కాళ్లను క్షుద్ర పూజలలో ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. యాదమరి చిరుత మృతి ఘటనపై దర్యాప్తు వేగవంతం చేసిన అటవీశాఖ, ప్రత్యేక టీములు ఏర్పాటు చేసారు. ఇప్పటికే పలువురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.