TELANGANA ASSEMBLY ELECTIONS: నామినేషన్లకు మూడు రోజులే.. టిక్కెట్లు ఇవ్వండి బాబో..!
మూడు ప్రధాన పార్టీలు కూడా ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టాయి. ఓ వైపు నామినేషన్లకు టైమ్ అయిపోతోంది.. మరోవైపు ప్రచారానికి ఇంకా 24 రోజులే మిగిలి ఉన్నయ్. దాంతో టిక్కెట్ కోసం ఆశిస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది.
TELANGANA ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TELANGANA ASSEMBLY ELECTIONS) నామినేషన్లకు ఇంకా మూడు రోజులే గడువుంది. కానీ మూడు ప్రధాన పార్టీలు కూడా ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టాయి. ఓ వైపు నామినేషన్లకు టైమ్ అయిపోతోంది.. మరోవైపు ప్రచారానికి ఇంకా 24 రోజులే మిగిలి ఉన్నయ్. దాంతో టిక్కెట్ కోసం ఆశిస్తున్న అభ్యర్థుల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానాలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాయని తెగ కంగారు పడుతున్నారు. తెలంగాణలో అందరి కంటే ముందే ఆగస్ట్ 21న 115 నియోజకవర్గాలకు BRS అభ్యర్థులను ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ (KCR). మొదట నర్సాపూర్, జనగాం, గోషామహల్, నాంపల్లి స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. ఆ తర్వాత వాటిల్లో నర్సాపూర్, జనగాం టిక్కెట్లను కేటాయించారు.
YS SHARMILA: కాంగ్రెస్‌కు సపోర్టు.. రేవంత్‌పై విమర్శలు.. అంతుచిక్కని షర్మిల స్ట్రాటజీ..
ఇంకా గులాబీ పార్టీ ప్రకటించాల్సిన స్థానాలు రెండే ఉన్నయ్. అవి నాంపల్లి, గోషామహల్. కాంగ్రెస్ (CONGRESS) ఇప్పటికే 100 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఒక స్థానం సీపీఐకి ఇస్తున్నందున.. ఇంకా 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీపీఎం ఎలాగూ సొంతంగానే 14 స్థానాల్లో క్యాండిడేట్స్ లిస్ట్ రిలీజ్ చేసింది. దాంతో ఇక ఆ పార్టీతో పొత్తు లేనట్టే. కాంగ్రెస్ ప్రకటించాల్సిన 18 సీట్లల్లో కామారెడ్డి నుంచి కేసీఆర్‌కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి, నిజాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ పోటీ చేస్తారని తెలుస్తోంది. సో.. ఇంకా 16 మంది జాబితా అయినా ప్రకటించాలి. ఇక బీజేపీ సంగతి చూస్తే.. మొత్తం 119 స్థానాల్లో ఇప్పటి దాకా 88 మందిని బరిలోకి దింపింది. ఇంకా 31 సీట్లను పెండింగ్‌లో పెట్టింది. జనసేనకు 10 సీట్లు పోతే… 20 లేదా 21 స్థానాలను కమలం పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించాలి. బీఆర్ఎస్ అభ్యర్థులను ముందే ప్రకటించడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్తగా టిక్కెట్ తీసుకున్నవారు.. తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్.. కేంద్రం సీరియస్..!
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు కవిత కూడా ప్రచారానికి వెళ్తున్నారు. గ్రామాల్లో స్థానిక నేతలు బూత్‌ల వారీగా ఇంఛార్జులను నియమించుకొని ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ వచ్చి ప్రచారం చేశారు. ఇంకా శివకుమార్, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రచారంలో పాల్గొంటున్నారు. కానీ ఇంకా 18 స్థానాల సంగతిని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చకపోవడంతో.. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండాలు కనిపించడం లేదు. ఆశావాహులంతా అయోమయంలో ఉన్నారు. ఓ వైపు నామినేషన్ల టైమ్ దగ్గర పడుతోంది. ప్రచారం చేసుకోడానికి కనీసం నెల రోజులు కూడా లేవు. దాంతో కాంగ్రెస్, బీజేపీ టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థులంతా టెన్షన్ పడుతున్నారు. టైమ్ వేస్ట్ అవుతోందని ఆవేదన చెందుతున్నారు. ఇవాళైనా లిస్ట్ వస్తుందా అని.. హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులకు.. ముఖ్యనేతలకు ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారు. చివరి నిమిషంలో తమకు కాకుండా.. మిత్ర పక్షాలకు ఇస్తే తమ పరిస్థితి ఏంటి అన్న టెన్షన్ కూడా లీడర్లలో కనిపిస్తోంది.