బ్రేకింగ్: పాస్టర్ ప్రవీణ్.. చనిపోయారా ? చంపేశారా ?
కల్వరిలో క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా చనిపోయారు. ఎయిర్‌పోర్ట్ నుంచి రాజమండ్రికి బయల్దేరిన ప్రవీణ్ కొంతమూరు దగ్గర విగతజీవిగా కనిపించారు.

కల్వరిలో క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల కొంతమూరు హైవేపై అనుమానస్పదంగా చనిపోయారు. ఎయిర్‌పోర్ట్ నుంచి రాజమండ్రికి బయల్దేరిన ప్రవీణ్ కొంతమూరు దగ్గర విగతజీవిగా కనిపించారు. ఆయన మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తనకు కొందరు వ్యక్తుల నుంచి ప్రాణ హాని ఉందని.. తాను ఎప్పుడైనా చనిపోవచ్చంటూ రీసెంట్‌గానే ప్రవీణ్ కామెంట్స్ చేశారు.
ఈ కామెంట్స్ చేసిన కొన్ని రోజులకే ప్రవీణ్ శవమై కనిపించడంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో విచారణ జరపాలంటూ క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రమాద స్థలం వరకూ సీసీ ఫుటేజ్‌ను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రవీణ్ మృతిపై రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి ముందు క్రైస్తవ సంఘాలు ప్రముఖ పాస్టర్లు ఆందోళనకు దిగారు.