PATNAM SUNITHA: జిల్లా రాజకీయాల నుంచి పార్లమెంట్ స్థానం దాకా.. పట్నం సునీత రాజకీయ ప్రస్థానం
మొదటిసారి టీడీపీ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాకు మొదటి జడ్పీ ఛైర్ పర్సన్‌గా సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
PATNAM SUNITHA: పట్నం సునీతా రెడ్డి.. ప్రస్తుతం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన భర్త మహేందర్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో 2006లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదటిసారి టీడీపీ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన వికారాబాద్ జిల్లాకు మొదటి జడ్పీ ఛైర్ పర్సన్‌గా సునీతా మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.
Samantha Ruth Prabhu: మా ఇంటి బంగారం సమంత.. కొత్త సినిమా ఫస్ట్ లుక్ రివీల్
గతంలో పాత రంగారెడ్డి జిల్లాకు 2006 నుంచి 11 దాకా, 2014 నుంచి 2019 దాకా ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించారు సునీతా మహేందర్ రెడ్డి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఎజెండాగా పనిచేసుకొని పోయే వ్యక్తిత్వం ఉన్న సునీత.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 750 కోట్ల రూపాయల పనులు చేయించారు. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల దగ్గర నుంచి స్కూల్ బిల్డింగ్స్, అంగన్ వాడీ, డ్వాక్రా భవనాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలు లాంటి అనేక పనులు చేపట్టారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలతో పాటు, సైడ్ డ్రైన్స్ నిర్మాణం చేయించారు సునీత మహేందర్ రెడ్డి. తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓవర్ హెడ్ ట్యాంకులు, బోర్‌వెల్స్‌తో పాటు మంచి నీటి పైప్ లైన్స్ ఏర్పాటు చేయించి.. ఇంటింటికీ నీళ్ళు అందేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్ళడంతో సునీత చేసిన సేవలను ఇప్పటికీ జనం మర్చిపోలేదు. మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న సునీతా మహేందర్ రెడ్డి.
YS JAGAN: చంద్రబాబును నమ్మితే.. చంద్రముఖిని నిద్రలేపినట్లే: వైఎస్ జగన్
జడ్పీ ఛైర్‌పర్సన్‌గా రంగారెడ్డి జిల్లాలో చేసిన సేవలకు మంచి గుర్తింపు వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధురాలు మల్లాది సుబ్బమ్మ పేరుతో ఏర్పాటు చేసిన ప్రాగ్య భారతి టైటిల్‌ను అందుకున్నారు సునీత. మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా సునీతా మహేందర్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. మహిళా విజయం అనే మంత్లీ మేగజైన్‌కు సునీత చీఫ్ ప్యాట్రన్‌గా కూడా వ్యవహరించారు. శ్రీశక్తి కార్యక్రమాల నిర్వహణతో ఆమెకు ఎంతో గుర్తింపు లభించింది. అలాగే బయో డైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీకి ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా కూడా పనిచేశారు పట్నం సునీత మహేందర్ రెడ్డి. మహిళల్లో చైతన్యం తీసుకొచ్చి.. వాళ్ళు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ యాక్టివ్‌గా పాల్గొనేలా చేశారు. ఇంటిని పదిలంగా కాపాడుకునే మహిళ.. గ్రామాన్ని, జిల్లాను, రాష్ట్రాన్ని కూడా అలాగే సంరక్షించుకోవాలని మహిళల్లో స్ఫూర్తి నింపారు. గ్రామాల్లో పారిశుధ్యం దగ్గర నుంచి పర్యావరణ పరిరక్షణ, భావి తరాలకు నీటి కొరత రానీయకుండా పొదుపు చేయడం లాంటి అనేక కార్యక్రమాల్లో మహిళలు యాక్టివ్‌గా పాల్గొనేలా చూశారు.
అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను సక్రమంగా అందరూ వినియోగించుకోవడంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ సునీత మహేందర్ రెడ్డి.. ఎంపీగా గెలిస్తే అన్ని వర్గాలను కలుపుకొని పనిచేస్తానంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 6 గ్యారంటీల సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరుస్తానని హామీ ఇస్తున్నారు పట్నం సునీత.