పుష్ప తగ్గాడు…! పవన్ తగ్గలే..! అందుకే కలవకుండా వెళ్ళిపోయాడు..
మెగా ఫ్యామిలీలో విభేదాలు దాదాపుగా ముగిసినట్టుగానే కనపడుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో మెగా ఫ్యామిలీలో విభేదాలు ఓ రేంజ్ లో ఉన్నాయని చాలామంది అంచనా వేశారు. అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ అతని భార్యతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అలాగే మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు.
మెగా ఫ్యామిలీలో విభేదాలు దాదాపుగా ముగిసినట్టుగానే కనపడుతున్నాయి. అల్లు అర్జున్ అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో మెగా ఫ్యామిలీలో విభేదాలు ఓ రేంజ్ లో ఉన్నాయని చాలామంది అంచనా వేశారు. అయితే అనూహ్యంగా అల్లు అర్జున్ అతని భార్యతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అలాగే మెగా బ్రదర్ నాగబాబు ఇంటికి వెళ్లారు. దీనితో ఈ వివాదాలు దాదాపుగా ముగిశాయని అందరూ అంచనా వేస్తున్నారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ను కలవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు.
నిన్న పవన్ కళ్యాణ్ హైదరాబాదులోనే ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయినా సరే పవన్ కళ్యాణ్ అసలు అల్లు అర్జున్ ని కలిసేందుకు ఇష్టపడటం లేదట. అందుకే చిరంజీవిని గాని నాగబాబుని గాని కలిసిన సమయంలో పవన్ అక్కడ లేరు. అల్లు అర్జున్ కూడా పవన్ ఇంటికి వెళ్ళలేదు. చిరంజీవిని నాగబాబుని కలిసి అల్లు అర్జున్ కాసేపు చర్చలు జరిపారు. ఆ తర్వాత తిరిగి ఆయన నివాసానికి చేరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అల్లు అర్జున్ ని కలవలేదు దీనితో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్… అల్లు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అటవీ శాఖ కార్యక్రమంలో కూడా పుష్ప సినిమాపై కామెంట్స్ చేసారు. అల్లు అర్జున్ కు, పవన్ కు మధ్య విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయని అసలు అక్కడే మెగా ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి అని కూడా అంటూ ఉంటారు. బన్నీ స్పీచ్ ఇచ్చే సమయంలో… పవన్ పవన్ అంటూ ఫ్యాన్స్ గోల చేయడంపై బన్నీ అసహనంగా కామెంట్స్ చేసాడు. అయితే అల్లు అర్జున్… పవన్ కళ్యాణ్ ఇగో ని టచ్ చేసాడని అందుకే పవన్ కూడా అల్లు అర్జున్ విషయంలో సీరియస్ గా ఉన్నారని అంటూ ఉంటారు.
అందుకే పవన్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అయి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయలేదు. చాలా వార్తలు పవన్ వెళ్తున్నట్టు షికారు చేసినా అది పులిహోర అనే క్లారిటీ వచ్చింది. తన క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ వెళ్లినా రాంచరణ్ మాత్రం వెళ్లలేదు. ఇక కనీసం తన అన్న చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వచ్చినా అక్కడకి కూడా పవన్ వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఏది ఎలా ఉన్నా మెగా ఫ్యామిలీలో విభేదాలు మాత్రం ఇప్పట్లో సమసి పోయేలా కనపడటం లేదు. మెగా హీరోల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్యం పోరాటంలో అల్లు అర్జున్ ఒంటరిగా మిగిలిపోయాడనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఇతర మెగా హీరోలు అందరూ ఆయనను పక్కన పెట్టడంతో మెగా ఫ్యామిలీలో ఉన్న ఇగో సమస్యలు ఇప్పటిలో పరిష్కారం అయ్యే సీన్ లేదని టాక్ కూడా వినపడుతోంది.