పవన్ కు బొత్సా హగ్, షాక్ అయిన పెద్దిరెడ్డి…!
అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడ్డారు.

అసెంబ్లీ సమావేశాల చివరి రోజు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వస్తుండటం చూసి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఎదురుగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ వస్తుండటం చూసి పెద్దిరెడ్డి, ఇతర వైసీపీ ఎమ్మెల్సీలు పక్కకు వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ కంటపడి నమస్కారం పెట్టిన బొత్స సత్యనారాయణ… సంతోషంతో పొంగిపోయారు.
బొత్స స్పందనను చూసి ఆయనకు ఎదురెళ్లిన పవన్ కళ్యాణ్… పవన్ కళ్యాణ్ తనవైపు వస్తుండటం చూసి ఎదురెళ్లి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కుశల ప్రశ్నలు వేసారు. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్కారం పెట్టి వెళ్ళారు పవన్ కళ్యాణ్. రుగుతున్న పరిణామాల్ని దూరం నుంచీ చూస్తూ వైసీపీ నేతలు అక్కడి నుంచి జారుకున్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. కాగా బొత్స ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో కూటమి విశాఖలో పోటీకి నిలబెట్టలేదు.