పవన్ మాస్టర్ మైండ్.. జనసేన మంత్రులను తెలివిగా దారిలో పెట్టారా…?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కొన్ని విషయాలు గమనించే.. ఉంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రుల విషయంలో మీడియాలో అల్లరి అల్లరి జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కొన్ని విషయాలు గమనించే.. ఉంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రుల విషయంలో మీడియాలో అల్లరి అల్లరి జరుగుతుంది. వాళ్లు అవినీతి చేస్తున్నారో.. అక్రమాలు చేస్తున్నారో… ఏం చేస్తున్నారో తెలియదు గాని.. మీడియాలో మాత్రం వాళ్ల గురించి ఏదో ఒక అలజడి రేగుతూనే ఉంది. మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పిస్తున్నారని కొంతమంది… కొత్త వారిని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారని మరి కొంతమంది కథనాలు రాస్తూనే ఉన్నారు.
ఇటీవల కూడా డార్లింగ్ మంత్రి అంటూ కొన్ని వార్తా సంస్థలు ఒక మంత్రిని టార్గెట్ గా చేసుకుని కథనాలు రాసి.. ఏకంగా తెలంగాణ ప్రభుత్వమే మంత్రిని కంట్రోల్లో పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఎక్కువగా హైదరాబాదులో ఉంటూ దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారని.. తెలంగాణ వ్యవహారాల్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటున్నారంటూ హెచ్చరికలు వెళ్లాయి. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఆయనకు ఒక కార్యాలయం ఉందని.. ఆ కార్యాలయం వేదికగా కూడా దందాలు జరుగుతున్నాయి అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఒక్కసారిగా ఏపీ ప్రభుత్వం లో ఈ వ్యవహారం అలజడి రేపింది. దీనిపై తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మంత్రి గారి గురించి మీడియాలో కాస్త కథనాలు ఎక్కువగానే ఉన్నాయి. కొత్త మంత్రి కాబట్టి హడావిడి చేస్తూ సందడి చేశారు సదరు మంత్రి. ఇక అంతకుముందు కొండపల్లి శ్రీనివాస్ సహా మరికొంతమందిపై కూడా ఇలాగే ఏదో ఒక వార్తలు వచ్చాయి. వాళ్ళని క్యాబినెట్ నుంచి తప్పిస్తున్నారు అంటూ విమర్శలు వచ్చాయి.
ముఖ్యంగా వాసంశెట్టి సుభాష్ విషయంలో పెద్ద రచ్చే జరిగింది. ఆయన విషయంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇలా కూటమిలో తెలుగుదేశం పార్టీ మంత్రులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సమయంలో జనసేన పార్టీ మంత్రుల విషయంలో మాత్రం ఒక్కటంటే ఒక్కటి ఆరోపణ కూడా రాకుండా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు పడుతున్నారు. దానికి తోడు సదరు మంత్రుల విషయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ.. వాళ్లను మీడియాలో ఫోకస్ పాజిటివ్ వేలో అయ్యే విధంగా జాగ్రత్తలు పడుతున్నారు.
వాళ్లకు ఏం చేయాలో ఒక రోడ్ మ్యాప్ ఇచ్చేసారు పవన్ కళ్యాణ్. అవును.. కాకినాడ వ్యవహారంలో నాదెండ్ల మనోహర్ ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఇక నాదెండ్ల మనోహర్ కూడా ఈ మధ్యకాలంలో మీడియాలో కాస్త హడావుడి చేస్తూనే ఉన్నారు. పనితీరు విషయంలో ఆయనకు మంచి మార్కులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కూడా ఆయనకు సానుకూల అభిప్రాయం ఉంది. అలాగే మంత్రి కందుల దుర్గేష్ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పదేపదే ఆయన మీడియా సమావేశాలు నిర్వహించడం.. సమీక్ష సమావేశాలు నిర్వహించడం సినిమా వాళ్ళతో సమావేశాలు నిర్వహించడం.. అధికారులతో మాట్లాడటం ఇలా ఏదో ఒకటి మీడియాలో పాజిటివ్ గానే హైలెట్ అవుతూ వస్తున్నారు కందుల దుర్గేష్. ఇక జనసేన పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ జాగ్రత్తగానే ఉంటున్నారు. ఎవ్వరూ కూడా ఇసుక గాని మద్యం అక్రమాల విషయంలో గాని జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఇటువంటి వాతావరణం కనబడటం లేదు.
పదే పదే టిడిపి ఎమ్మెల్యేలు మీడియాలో హైలైట్ అవుతున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలను కూడా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇసుక అక్రమాల విషయంలో మద్యం అక్రమాల విషయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ లు కూడా ఇచ్చారు. జనసేన మంత్రులను పవన్ కళ్యాణ్ ముందుగానే కంట్రోల్లో పెట్టి తన దారిలో నడిచే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనితో ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ కు భయపడి సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటున్నారు. ఎక్కడా కూడా అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు వార్తలు రావడం లేదు.
ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా మంత్రులు పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ పైనే బాధ్యతలు వదిలేశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎటువంటి అనవసర రాద్ధాంతాల్లో జోక్యం చేసుకోకుండా తన పని తాను చేసుకుంటున్నారు. టిడిపిలో ఏ మంత్రిపై కూడా ఇలాంటి సానుకూల అభిప్రాయం ఇప్పటివరకు రాలేదని చెప్పాలి. దాదాపుగా ప్రతి మంత్రిపై ఏదో ఒక ఆరోపణలు వస్తుంటే తన ముగ్గురు మంత్రులను మాత్రం పవన్ కళ్యాణ్ కంట్రోల్ లో పెట్టుకోవడం అటు కూటమిలో కూడా కాస్త సెన్సేషన్ అవుతుంది.