Pawan kalyan: పవన్ మైండ్ గేమ్ ఆడుతున్నారా..? టీడీపీ నిజంగా బలహీనపడిందా..?

టీడీపీకి క్యాడర్ బలంగా ఉంది. పటిష్ఠమైన యంత్రాంగం ఉంది. వీటిపై అవగాహన లేకుండా పవన్ మాట్లాడటం సబబు కాదని, టీడీపీ వీకైందనడం వక్రభాష్యం అంటున్నారు. .

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 6, 2023 | 09:29 PMLast Updated on: Oct 06, 2023 | 9:29 PM

Pawan Kalyan Allegations On Tdp Are Write Or Wrong

Pawan kalyan: జనసేన​అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల మాట్లాడుతూ.. టీడీపీ గతంతో పోలిస్తే బలహీనపడింది అనే అర్థం వచ్చేలా స్పందించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ బలహీనపడిందని పవన్ మాట్లాడటం సబబు కాదనే వాదన వినిపిస్తోంది. అసలు టీడీపీ బలం ఎక్కడా తగ్గలేదనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఏ మూలకు వెళ్లినా.. టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉంది. అలాంటప్పుడు పార్టీ బలహీనపడిందని ఎలా చెప్పారు అనే వాదన వినిపిస్తోంది. టీడీపీకి క్యాడర్ బలంగా ఉంది. పటిష్ఠమైన యంత్రాంగం ఉంది. వీటిపై అవగాహన లేకుండా పవన్ మాట్లాడటం సబబు కాదని, టీడీపీ వీకైందనడం వక్రభాష్యం అంటున్నారు. .
సెప్టెంబర్ 9 న చంద్రబాబు జైలు కెళ్లిన దగ్గర్నుంచీ.. ఇప్పటివరకు పార్టీ క్యాడర్ చాలా వరకు స్వచ్ఛందంగా ఆందోళనలు చేస్తోందనేది టీడీపీ నేతలు చెప్పే మాట. పై నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోయినా.. ప్రతిరోజూ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అసలు పార్టీ వీక్ గా ఉంటే.. పిలుపు ఇచ్చినా కూడా కార్యాచరణ అమలు జరగదు. అలాంటిది ఎవరూ చెప్పకముందే క్యాడర్ లీడ్ తీసుకుని గ్రౌండ్ లో దిగారంటే.. పార్టీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు.

ఇన్నిరోజులుగా టీడీపీని దగ్గర్నుండి చూస్తున్న పవన్.. తెలుసుకున్నది ఇదేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ మాటలు రెండు పార్టీల మధ్య అపోహలకు తావిచ్చేలా ఉన్నాయి. కొత్త సమస్యలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయంగా అవగాహనరాహిత్యంతో మాట్లాడినట్టే ఉన్నాయి. గెలుపోటములు వేరే విషయం. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన నిరసనలు కూడా ఎక్కడికక్కడ గట్టిగానే జరిగాయి. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఏంటో అధినాయకత్వానికి అవగాహన ఉంది. ఏపీ వ్యాప్తంగా పార్టీ ఎన్నికలకు రెడీగా ఉన్న వాతావరణం కనిపిస్తోంది.
టీడీపీ వీకైందని ఎలా అంటారు..?
టీడీపీకి 2019లో 23 సీట్లే వచ్చినా.. మిగతా నియోజకవర్గాల్లో ఏమీ బలహీనపడలేదు. అన్నిచోట్లా టీడీపీకి సాలిడ్ ఓటు బ్యాంకు ఉంది. ఈ విషయం మర్చిపోకూడదని ప్రత్యర్థుల్లోనూ చర్చ జరుగుతుంటుంది. జగన్ కూడా అంతర్గత సమావేశాల్లో టీడీపీని తక్కువ అంచనా వేయొద్దని ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఆ పార్టీకి బలం లేకుండానే అలా చెబుతారా? 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటు బ్యాంకు కాస్త తగ్గిందేమో కానీ.. సంప్రదాయ ఓటు చెక్కుచెదరలేదనేది ఆ పార్టీ నేతల మాట. గెలుపోటములు ఎదురైనప్పుడు ఓటు బ్యాంకు కాస్త అటూఇటూ కావడం సహజమేనని, కానీ టీడీపీకి ఉన్న స్థిరమైన ఓటు బ్యాంక్ అలాగే ఉందంటున్నారు. టీడీపీ బలహీనపడిందనే విషయం జనంలో కూడా లేదు.

ఎక్కడకు వెళ్లినా ప్రజలు వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీయే అనే అభిప్రాయంతో ఉన్నారు. అలాంటిది టీడీపీతో ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న పవన్ కు ఆ సంగతి తెలియకపోవడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ కు టీడీపీ కొత్త కాదు. 2014 నుంచి పొత్తులో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు విడిపోయినా.. మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. టీడీపీ బలం, బలగం ఏంటో పవన్ కు కచ్చితమైన అంచనాలు ఉన్నాయి. క్యాడర్ బలం గురించి గతంలో పవన్ కూడా చెప్పారని టీడీపీ అంటోంది. మొత్తం మీద పవన్ అవగాహన రాహిత్యంతోనే అలా మాట్లాడారని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. ఎన్నికలకు 7 నెలల ముందే.. టీడీపీ బలంగా లేదని చెప్పడం మాత్రం కచ్చితంగా పవన్ కళ్యాణ్ కి రాజకీయ అవగాహన లేకపోవడమే. అయితే, పవన్ కావాలనే టీడీపీని తక్కువ చేసేలా మాట్లాడుతూ.. మైండ్ గేమ్ ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.