బాబాయిను వాడేస్తున్న అబ్బాయ్.. గేమ్ చేంజర్ లో కాకినాడ సీన్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. మెగా అభిమానులకు సంక్రాంతి పండుగ ట్రీట్ రెడీ చేశాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ వెయిటింగ్ ఓ రేంజ్ లో ఉంది. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవుతూనే ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2025 | 04:11 PMLast Updated on: Jan 03, 2025 | 4:11 PM

Pawan Kalyan Attend For Game Changer Event

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. మెగా అభిమానులకు సంక్రాంతి పండుగ ట్రీట్ రెడీ చేశాడు. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా కోసం మెగా ఫాన్స్ వెయిటింగ్ ఓ రేంజ్ లో ఉంది. సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లో ఉన్న కొన్ని షాట్స్ అయితే మాస్ ఆడియన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసాయి. ముఖ్యంగా హెలికాఫ్టర్ షాట్ కు మెగా అభిమానులు ఫీధా అయిపోయారు. ఇక ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ గా రాంచరణ్ విశ్వరూపం చూపించడం ఖాయం అనేది ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది.

మొత్తం నాలుగు లుక్స్ లో రాంచరణ్ ట్రైలర్ లో కనిపించాడు నాలుగు లుక్స్ కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానుల్లో ఎక్కువగా మాస్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు ఈ సినిమాలో కొన్ని సీన్స్ ను ప్లాన్ చేసినట్టు క్లియర్ గా అర్థం అవుతుంది. ముఖ్యంగా హెలికాప్టర్ షాట్ చూస్తే మాస్ ఆడియన్స్ కే కాదు క్లాస్ ఆడియన్స్ కి కూడా కళ్ల పండగ పక్కా. కచ్చితంగా ధియేటర్లో చొక్కాలు విప్పి మాస్ ఆడియన్స్ ఎగరటం ఖాయం అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇక ఈ సినిమాలో ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని వ్యవహారాలను కూడా చూపించడానికి శంకర్ రెడీ అయ్యాడు. ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమ దందా విషయంలో కొన్ని సీన్స్ చూపించారు ట్రైలర్లో. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన సందర్భంగా ఆ వ్యవహారం నేషనల్ వైట్ గా సెన్సేషన్ అయింది. దీనితో ఆ వ్యవహారాన్ని ఈ సినిమాలో చూపించేందుకు శంకర్ ప్లాన్ చేశాడు. సీజ్ ది షిప్ అంటూ పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన ఒక డైలాగ్ కూడా నేషనల్ మీడియాను షేక్ చేసింది.

అవసరమైతే ఆ డైలాగ్ కూడా ఈ సినిమాలో ఉండే ఛాన్స్ ఉంది. ప్రభుత్వంపై ఐఏఎస్ పోరాటం వేరే లెవెల్ లో ఉండనుంది అనేది ట్రైలర్ తో చెప్పేసాడు శంకర్. అలాగే గత వైసిపి ప్రభుత్వం పై కూడా కొన్ని ఇన్ డైరెక్టు డైలాగులు ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు మెగా ఫాన్స్. అప్పట్లో ఐఏఎస్ అధికారులను, ఐపీఎస్ అధికారులను జగన్ వాడుకున్న తీరును ఈ సినిమాలో హైలైట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా గ్రాండ్ గానే చేస్తున్నాడు దిల్ రాజు. శనివారం రాజమండ్రిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా ఒక ఈవెంట్ను ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ కు జనసేన పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అటెండ్ కానున్నారు. దీని కోసం రాజమండ్రిలో భారీ భద్రతను కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.