గంజాయి దేవత నైవేద్యం: పవన్ కామెంట్స్
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పలు ఏజెన్సీ గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయన.
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పలు ఏజెన్సీ గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయన. గంజాయి సమస్యపై ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. గంజాయి సాగు గిరిజన ఆచారమన్నారు. గంజాయిని గ్రామదేవతకు నైవేద్యంగా పెడతారని అందుకే ఏజెన్సీలో సాగు అవుతుందన్నారు.
ఆచారంగా భావించినప్పుడు సమస్య ఉత్పన్నం కాలేదన్నారు ఉప ముఖ్యమంత్రి. గంజాయిని కమర్షియల్ గా ఎప్పుడైతే ఆలోచన చేశారో సమస్య మొదలైందని తెలిపారు. ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఒక మాఫియాల మారిందన్నారు. పోలీసులతోనే సమస్య పరిష్కారం కాదన్న పవన్ స్థానిక యువ సర్పంచులు గంజాయి నిర్మూలనకు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపుతే సమస్య పరిష్కారం అవుతుందని రోడ్లు, టూరిజం అభివృద్ధి చేస్తే ఆదాయం పెరుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు.