PAWAN KALYAN: అంత మాట అనేశాడే ! పవన్‌పై టీడీపీ గరంగరం.. బతిమలాడుకుంటున్న బాబు

టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల.. ఢిల్లీ బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నానని పవన్ కల్యాణ్ భీమవరంలో జరిగిన మీటింగ్‌లో చెప్పారు. పరోక్షంగా టీడీపీ తన వల్లే బతికి బట్టకట్టిందని చెప్పడంతో.. పవన్‌పై రగిలిపోతోంది టీడీపీలో కమ్మ సామాజిక వర్గం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 01:32 PMLast Updated on: Feb 22, 2024 | 1:45 PM

Pawan Kalyan Comments On Tdp Creates Angry On Tdp Cadre

PAWAN KALYAN: భీమవరంలో జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ టీడీపీలో కాకరేపుతున్నాయి. పరోక్షంగా టీడీపీ తన వల్లే బతికి బట్టకట్టిందని చెప్పడంతో.. పవన్‌పై రగిలిపోతోంది టీడీపీలో కమ్మ సామాజిక వర్గం. ఆయన దయాదక్షిణ్యాల మీద మనం బతకడం ఏంటని మండిపడుతున్నారు. కానీ తప్పదు. బీజేపీతో పెట్టుకొని మనం బతకలేం.. కొంచెం ఓపిక పట్టండి అని కేడర్‌ను బతిమలాడుకుంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల.. ఢిల్లీ బీజేపీ పెద్దలతో చివాట్లు తిన్నానని పవన్ కల్యాణ్ భీమవరంలో జరిగిన మీటింగ్‌లో చెప్పారు. నిజానికి జనసేన అప్పటికే NDAలో భాగస్వామిగా ఉంది.

Shanmukh Jaswanth: అరె ఏంట్రా ఇదీ.. గంజాయి తాగుతూ పట్టుబడ్డ షణ్ముఖ్‌

అంటే ఆ ఇద్దరి పొత్తు నడుస్తున్నప్పుడు.. చంద్రబాబు అరెస్ట్ కాగానే సడన్‌గా టీడీపీతో పొత్తు సంగతి పవన్ ప్రస్తావించడం కరెక్ట్ కాదు. అందుకే ఢిల్లీ బీజేపీ పెద్దలను ఒప్పించడానికి నానా తంటాలు పడ్డానని చెప్పుకున్నారు పవన్. కూటమి నిలబెట్టడానికి నానా అగచాట్లు పడ్డానన్నారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలు తనను తిట్టారని చెప్పాడు పవన్. అంతేకాదు.. ఇష్టం లేకున్నా రాష్ట్రం కోసమే టీడీపీతో బీజేపీని కలిపానని కూడా కామెంట్ చేశారు. అదే ఇప్పుడు టీడీపీశ్రేణులు కొందరికి నచ్చడం లేదు. మొన్నటిదాకా రాష్ట్రంలో జగన్ దిగపోవడం ఖాయం.. మాకు తిరుగులేదు.. పవన్‌కి దిక్కులేదు.. అందుకే తమతో పొత్తు పెట్టుకున్నాడని టీడీపీ నేతలు బీరాలు పోయారు. సోషల్ మీడియాలో కూడా జనసేనకు అంత సీన్ లేదంటూ పోస్టులు పెట్టించారు ఓ వర్గం వారు. కానీ అది కాదు. అసలు జరిగింది ఇది అని పవన్ చెప్పిన సంగతలు విని టీడీపీ నేతలు ఘొల్లుమంటున్నారు. పవన్ పదే పదే త్యాగం చేశానని చెప్పుకోడాన్ని.. జీర్ణించుకోలేకపోతున్నారు టీడీపీ నేతలు.

పవన్ దయాదాక్షిణ్యాలపై ఎందుకు ఆధారపడాలి..? అని టీడీపీలో కమ్మ సామాజిక వర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మనకేంటని చంద్రబాబును నిలదీస్తున్నారు కొందరు సీనియర్లు. కానీ కేంద్రంలో బీజేపీకి ఎదురెళ్లి నిలబడలేమని, అణిగిమణిగి ఉండక తప్పదని నచ్చచెబుతోంది టీడీపీ అధిష్టానం. వచ్చే ఎన్నికల్లో జగన్ పోల్ మేనేజ్మెంట్ ఎంత దారుణంగా ఉంటుంది.. దాన్ని అడ్డుకోవడానికి కేంద్రంలో బీజేపీ తప్ప మరో మార్గం లేదంటున్నారు చంద్రబాబు. పైగా కేంద్రంలో మూడోసారి వచ్చేది కూడా బీజేపీ ఆధ్వర్యంలోని NDA సర్కారే. అలాంటప్పుడు కలిసిపోతే బెటర్ అని టీడీపీ సీనియర్లను బతిమలాడుకుంటున్నారు చంద్రబాబు. అందుకే బీజేపీ – టీడీపీకి మధ్య సయోధ్య కుదర్చడంలో కీలకంగా ఉన్న పవన్ ఏమన్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు టీడీపీ చీప్. ప్రస్తుతానికి జగన్ ఓడిపోవాలి.. తాము అధికారంలోకి వస్తే.. రేపు కేంద్రంలో బీజేపీ సాయంతో కేసుల నుంచి బయటపడాలని డిసైడ్ అయ్యారు బాబు. అందాక మాట్లాడకుండా కూర్చోవడం తప్ప ఎదురు తిరిగే పరిస్థితి కనిపించడం లేదు.