Pawan: పవన్ అడ్డగోలు వ్యాఖ్యలు.. కేంద్రం దగ్గర సమాచారం ఉంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు కదా!
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలు తీవ్ర దుమారానికి కారణమయ్యాయి. పవన్ వ్యాఖ్యలను విశ్లేషకులు సైతం తప్పుపడుతున్నారు.

Pawan Kalyan criticizes secretariat staff volunteers in Godavari districts as human trafficking
ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఎలా పడితే అలా వాగడమే.. ఇది పవన్ కల్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో ఫేమస్ డైలాగ్. ఇప్పుడిదే డైలాగ్ పవన్‌కి వర్తిస్తుందంటున్నారు వైసీపీ నేతలు. తన అభిమానులు ఏం చెప్పినా వింటున్నారులే అని అనుకోని నోటికి వచ్చింది మాట్లాడేస్తే చివరికి ఆ అభిమానులే చీదరించుకునే రోజు రావచ్చు. పవన్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చేసే విమర్శ అర్థవంతంగా ఉండాలి. ఆరోపణలు గుప్పిస్తే జనాలు నమ్మేలాగా ఉండాలి. రాష్ట్రంలో అమ్మాయిల మిస్సింగ్ వెనుక వాలంటీర్ల హస్తం ఉందని పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్ర రచ్చకు దారి తీశాయి. కేంద్ర నిఘా సంస్థలు తనకు ఈ విషయాన్ని చెప్పేయని పవన్ చెప్పడంపై విమర్శలు పెరిగిపోతున్నాయి.
ఎంక్వైరి చేయించుకోవచ్చు కదా?
గ్రామాల్లో ఉండే వాలంటీర్లు ప్రతి గ్రామంలో ఎవరు ఎవరి మనిషి. ఏ కుటుంబంలో ఎంత మంది ఉంటున్నారు..? ఆడపిల్లలు ఎవరైనా ప్రేమిస్తున్నారా ? వారిలో వితంతువులు ఉన్నారా అనే విషయాలను సేకరించి సంఘవిద్రోహ శక్తులకు ఈ సమాచారం చేరవేయడంతో పాటు వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించడం ఏ మాత్రం అర్థంలేని పిచ్చి వాగుడుగా అతని అభిమానులు సైతం కొట్టిపారేస్తున్నారు. పైకి చెప్పకున్నా.. పవన్ ఆరోపణలు వాళ్లు కూడా అంగీకరించని పరిస్థితి నెలకొంది. ఇదే విషయంపై కేంద్ర నిఘా వర్గాలు తనను హెచ్చరించాయన పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. కేంద్ర నిఘా సంస్థలు వద్ద సమాచారం ఉంటే ఎంక్వైరీ చేయించుకోవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తు సంస్థలు కేంద్రం అండర్‌లోనే ఉన్నప్పుడు ఇన్‌వెస్టిగేషన్ చేయించుకుంటే సరిపోతుంది కదా అని చురకలంటిస్తున్నారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ మిగిలిన రాష్ట్రాల్లో లేవా?
మానవ అక్రమ రవాణ దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనది. ఇది దాదాపు ప్రతి రాష్ట్రాంలోనూ కనిపిస్తోంది. ఏపీలోనూ దశబ్దాలుగా ఈ సమస్య ఉంది. గతంలో పాలించిన ప్రభుత్వాల కాలంలోనూ చాలా మంది మహిళలు కనిపించకుండా పోయారు. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు అన్ని రాష్ట్రాల్లో ఉండగా.. ఏపీలో మాత్రమే ఉన్నట్టు పవన్ వ్యాఖ్యలు చేశారు. పవన్ ఆరోపణల్లో అసలు లాజిక్ లేకపోగా.. మానవ అక్రమ రవాణకి కారణమైన మూలాలు, సమస్య పరిష్కరణ సైడ్ ట్రాక్ ఐనట్టుగా కనిపిస్తోంది. సరే పనవ్ చెప్పిందే నిజం అనుకుందాం.. ఏపీలో హ్యూమన్ ట్రాఫికింగ్‌కి వాలంటీర్లే కారణం అనుకుందాం.. మరి చంద్రబాబు హయంలో జరిగిన మానవ అక్రమణకి కారణం ఎవరు..? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ్మాయిలు మిస్ అవ్వడంలేదా..? అక్కడ వారందరిని ఎవరు తరలిస్తున్నట్టు..? వాళ్ల వ్యక్తిగత వివరాలు సంఘవిద్రోహ శక్తులకు ఎవరు చేరవేస్తున్నట్టు..? అసలు కేంద్ర నిఘా సంస్థల వద్ద సమాచారం ఉంటే పవన్‌కి చెప్పడం ఏంటి..? వాళ్లే ఇన్‌వెస్టిగేషన్ చేయించుకుంటే సరిపోతుంది కదా..? వాలంటీర్ల వ్యవస్థపై విమర్శిస్తే సరిపోయే దానికి .. వాళ్లపై పవన్ వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్టు..?