నేను చూసుకుంటా ఏపీ రండి, రేవంత్ – అల్లు ఇష్యూలో పవన్ మైండ్ గేమ్
తెలంగాణలో గతంలో తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఇంతగా ఇబ్బంది పడలేదు. 2014 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు కాస్త ఇబ్బందులు పడినా ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి.
తెలంగాణలో గతంలో తెలుగు సినిమా పరిశ్రమ ఎప్పుడూ ఇంతగా ఇబ్బంది పడలేదు. 2014 తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు కాస్త ఇబ్బందులు పడినా ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమకు అప్పటి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ సంబంధాలు దారుణంగా బలపడ్డాయి కూడా. అందుకే అప్పట్లో తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టడానికి పెద్దగా ఇష్టపడలేదు. పదేపదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అసలు తమకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ఆలోచన లేదని, తెలంగాణలోనే కొనసాగుతామని కూడా వారు కామెంట్ చేశారు.
దీనికి కేసీఆర్ అంటే భయం అనే విషయం స్పష్టంగా అప్పట్లో అర్థమైంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తెలుగు సినిమా పరిశ్రమ అడుగుపెట్టే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్ళిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా పరిశ్రమ అడుగు పెట్టాలని, విదేశాలకు వెళ్లి షూటింగ్ చేసుకోవడం కంటే ఇక్కడ మంచి లొకేషన్స్ ఉన్నాయని కాబట్టి ఇక్కడికి వచ్చే షూటింగ్ చేయాలని ఆయన కోరారు.
ఒకవైపు అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి గా వివాదం నెలకొన్న తరుణంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కాస్త హాట్ టాపిక్ గా మారాయి. సినిమా పరిశ్రమ ఇక్కడికి వస్తే తాము అండగా నిలబడతామని పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం చేసినట్లుగానే తెలుస్తుంది. ఇప్పటివరకు అల్లు అర్జున్ వ్యవహారంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మెగా కుటుంబం కూడా ఈ విషయంలో కాస్త సైలెంట్ గానే ఉంది. అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తున్నారా లేదా అనేదానిపై కూడా స్పష్టత రావడం లేదు.
అయితే అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ మద్దతు కోరుతున్నారు. ఈ వ్యవహారంలో తన బయటకు రావాలి అంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ తో సాధ్యం అవుతుంది అనే భావనలో కూడా బన్నీ ఉన్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు తెలుగు సినిమా పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టాలని తాము అండగా నిలబడతామని కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో సినిమా పరిశ్రమ ఒకరకంగా యుద్ధం చేస్తున్న తరుణంలో కూటమి పార్టీలు ఈ విధంగా రియాక్ట్ కావడం కాస్త ఆసక్తికరంగా మారింది. మరి ఈ పరిణామాన్ని ప్రభుత్వం ఎలా వాడుకుంటుందో చూడాలి. పవన్ కావాలనే ఆ పాయింట్ రైజ్ చేసారనే ఒపినియన్ వినపడుతోంది.