ఏం పీకడానికి కలెక్టర్ చదివారు? రెచ్చిపోయిన పవన్.. తలలు పట్టుకున్న అధికారులు
కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మూలాలనే పెకలించేసింది. భారీగా అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు.
కలెక్టర్ల సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మూలాలనే పెకలించేసింది. భారీగా అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. ప్రజలు మనపై బృహత్తర బాధ్యత పెట్టారన్నారు పవన్. మేము పాలసీలు మాత్రమే తీసుకురాగలం… క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సింది ఐఏఎస్ లే అని స్పష్టం చేసారు.
గత ప్రభుత్వంలో రెవెన్యూ సిబ్బందితో సినిమా టికెట్లు విక్రయం మొదలు పెట్టి ఎన్నో పనులు చేయించారని… ఇంతమంది ఐఏఎస్ లు ఉండీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారన్నారు. గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులు ఇచ్చిందని అన్నారు. నేడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని పేర్కొన్నారు. ఇంతటి సంక్షోభంలోనూ సమర్థ పాలన అందించడం ఒక్క చంద్రబాబుకే సాధ్యమైందన్నారు. రాళ్లు, రప్పలున్న ప్రదేశంలో చంద్రబాబు సైబరాబాద్ లాంటి నగరాన్ని సృష్టించారని… ఆయన నాయకత్వంలో పనిచేయడం మన అదృష్టమన్నారు.
మీ అందరి సహకారంతో ప్రజా పాలన అందించాలని మేము కోరుకుంటున్నామన్నారు. కాకినాడ పోర్టు నుంచి మూడు చెక్ పోస్టులు పెట్టినా బియ్యం అక్రమ రవాణ ఆగడం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు పవన్. సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ నుండి వచ్చిన ఉగ్రవాదుల వలన 300 మంది ప్రాణాలు పోయాయని… మంత్రి మనోహర్ తనిఖీలకు వెళితే సహకరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందా లేదా? అని నిలదీశారు. పాలన అంటే ఏపీలో లాగా ఉండాలని దేశమంతా అనుకోవాలి. అందుకు ఐఏఎస్ లే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసారు.