అన్నా చెల్లి కొట్టుకుని రైతుల్ని ముంచారు: పవన్

పల్నాడు పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేసారు. 700 ఎకరాల భూమి మాచవరం, దాచేపల్లి మండలాల్లో స్వంత ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారని... రైతులకు వారి పిల్లలకు ఉద్యోలిస్తామని భూములు తీసుకున్నారని మండిపడ్డారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 5, 2024 | 05:21 PMLast Updated on: Nov 05, 2024 | 7:04 PM

Pawan Kalyan Fire On Ys Jagan

పల్నాడు పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేసారు. 700 ఎకరాల భూమి మాచవరం, దాచేపల్లి మండలాల్లో స్వంత ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారని… రైతులకు వారి పిల్లలకు ఉద్యోలిస్తామని భూములు తీసుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సమస్య ఇదని అభిప్రాయపడ్డారు. గతంలో పెట్రోల్ బాంబులు నాటు బాంబులు వేసి భయపెట్టారని ఆయన ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఫర్నిచర్ తీసుకెళ్ళమని కోడెల లేఖ రాశారని… పదిహేను ఇరవై లక్షలు ఫర్నిచర్ ఆయన పై కేసు పెట్టి వేధించారన్న పవన్… సరస్వతి భూముల రైతులకు న్యాయం జరగలేదన్నారు.

సరైన న్యాయం చేయలేదని మండిపడ్డారు. 1384 ఎకరాల భూములు కొన్నారని 24 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని దళితుల భూమి తీసుకున్నారని మండిపడ్డారు. రైతులు ఇష్టపూర్తిగా భూములివ్వలేదన్నారు పవన్. బాంబులేసి భయపెట్టి భూములు తీసుకున్నారన్నారు. ఇట్లాగే వదిలేస్తే పేట్రేగి పోతారని రైతులకు అండగా ఉండటానికి వచ్చామన్నారు. ఫ్యాక్టరీ రాలేదు. అన్నాచెల్లెళ్లు కొట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు పవన్. అటవీ భూములను రెవిన్యూ భూములుగా మార్చి తీసేసుకున్నారన్నారు.

ఫ్యాక్టరీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జగన్ సిఎం గా ఉన్నప్పుడు యాభై ఏళ్ళకు లీజు తీసుకున్నారన్నారు. ఉపాధి అవకాశాలు ఇస్తే సంతోషమన్న పవన్ సహజ వనరులు ఒకరి సొంతం కాదన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతిలివ్వరిని క్యాప్టివ్ పవర్ గా అనుమతి తీసుకున్నారని పొల్యూషన్ బోర్డు అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు.